కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

భక్తి పారవశ్యం లో రామ్ చరణ్

Vinayaka Chavithi Celebrations at Chiranjeevi And Ram Charan's Home

భక్తి పారవశ్యం లో రామ్ చరణ్

Vinayaka Chavithi Celebrations at Chiranjeevi And Ram Charan's Home

Vinayaka Chavithi Celebrations at Chiranjeevi And Ram Charan's Home

మెగా స్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్ , పూరి జగన్నాథ్ దర్శకత్వం లో రూపొందిన సూపర్ హిట్ యాక్షన్ ఎంటర్ టైనర్ "చిరుత "మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. ఆ మూవీ లో యాక్షన్ సీన్స్ , డ్యాన్స్ లలో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకుని సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకున్నారు. రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా రూపొందిన ఫాంటసీ , యాక్షన్ ఎంటర్ టైనర్ "మగధీర " రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. 1000 రోజులు ప్రదర్శించబడి రికార్డ్ క్రియేట్ చేసింది. 2 నేషనల్ , 6 ఫిల్మ్ ఫేర్ , 9 నంది , 10 సినీమా అవార్డ్స్ స్వంతం చేసుకుంది.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందిన "రచ్చ ", "నాయక్ ", "ఎవడు ", "ధృవ ", "రంగ స్థలం " మూవీస్ ఘనవిజయం సాధించాయి.హీరో రామ్ చరణ్ నిర్మాతగా మారి కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై మెగా స్టార్ చిరంజీవి హీరోగా "ఖైదీ నెం 150 ", సైరా నరసింహా రెడ్డి " వంటి సక్సెస్ ఫుల్ మూవీస్ నిర్మించారు. కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా "ఆచార్య " మూవీని నిర్మిస్తున్నారు. రామ్ చరణ్ ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో రూపొందుతున్న "రౌద్రం రణం రుధిరం " మూవీ లో నటిస్తున్నారు. రామ్ చరణ్ హీరోగా పలు మూవీస్ చర్చల దశలో ఉన్నాయి. వినాయక చతుర్థి సందర్భంగా రామ్ చరణ్ తన ఇంటిలో పూజా కార్యక్రమం నిర్వహించారు. ఆ ఫొటో ను రామ్ చరణ్ ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు. భక్తి పారవశ్యం లో రామ్ చరణ్ వినాయకుని కి నమస్కరిస్తున్న ఆ ఫోటో ప్రేక్షక , అభిమానులను ఆకట్టుకుంది.

వీడియోస్

సంబంధిత వార్తలు

అన్నీ
వాట్సాప్‌లో షేర్ చేయండి

షేర్