లాక్ డౌన్ వల్ల దాదాపు ఐదు నెలల నుండి షూటింగ్స్ లేకుండా పోయిన సంగతి తెలిసిందే కదా. షూటింగ్స్ లేక సెలబ్రిటీస్ అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. ఏదో ఒకటి రెండు నెలలు అంటే ఒకే కానీ మరి ఎప్పుడూ బిజీగా వుండే వాళ్ళు ఇన్ని నెలలు పని లేకుండా ఇంట్లోనే ఉండాలంటే కష్టమే. ఈ నేపథ్యంలో షూటింగ్ ను చాలా మిస్ అయ్యాను అంటుంది రకుల్ ప్రీత్ సింగ్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రస్తుతం రకుల్ క్రిష్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా అప్పుడే షూటింగ్ ను కూడా మొదలు పెట్టింది. ప్రస్తుతం వికారాబాద్ అడవుల్లో షూటింగ్ జరుపుకుంటున్నట్టు తెలుస్తుంది. ఈ సందర్భంగా రకుల్ ఇన్ని రోజులు షూటింగ్ ను మిస్ అయ్యానని.. బ్యాక్ టు వర్క్ అని తన సోషల్ మీడియాలో సంతోషంగా తెలిపింది. ఇదిలా ఉండగా ఈ సినిమాలో రకుల్ డీ-గ్లామర్ రోల్ చేయబోతోందట. ఇక ఈ సినిమాలో సాయి తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా నటిస్తున్నాడు. సింగిల్ షెడ్యూల్ లో నవంబర్ నాటికి ఈ సినిమాను పూర్తి చేయాలని చూస్తున్నాడు క్రిష్.
ఇంకా తెలుగులో నితిన్ సరసన చంద్రశేఖర్ ఏలేటి సినిమాలో నటిస్తుంది రకుల్. హిందీలో జాన్ అబ్రహాం “అటాక్ “, అర్జున్ కపూర్ ” ఛలే ఛలో ” మూవీస్ లో నటిస్తుంది. ఇక తమిళనాట కూడా రెండు సినిమాల్లో నటిస్తుంది. శంకర్ దర్శకత్వంలో కమలహాసన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఇండియన్ 2 సినిమాలో ఒక కీలక పాత్రలో నటిస్తుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: