‘ఆదిపురుష్’ – ప్రభాస్ రాముడు అయితే.. రావణుడిగా ఎవరికి మీ ఓటు..?

బాహుబ‌లి సినిమాతో దేశ వ్యాప్తంగానే కాదు ప్ర‌పంచ వ్యాప్తంగా కూడా స‌త్తా చాటాడు‌. సాహో సినిమా ప్ర‌భాస్‌ని అభిమానుల‌కి మ‌రింత ద‌గ్గ‌ర చేసింది. దీనితో పాన్ ఇండియా సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయాడు ప్రభాస్. త‌న 20వ చిత్రం ‘రాధేశ్యామ్’ ఇంకా పూర్తి కాక ముందే మరో రెండు సినిమాల‌ను ఆయన ప్రకటించారు. అంద‌ులో ఒక‌టి ‘మహానటి’ దర్శకుడు నాగ్ అశ్విన్‌తో కాగా, రెండో చిత్రం ఓంరౌత్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌బోయే ‘ఆదిపురుష్‌’.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఎలాంటి హడావుడి లేకుండానే ‘ఆదిపురుష్‌’ చిత్రాన్ని ప్రకటించారు చిత్ర యూనిట్. మైథిలాజికల్ సోషియో ఫాంటసీ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకోనున్న ఈ చిత్రాన్ని బాలీవుడ్ నిర్మాతలు భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్ భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా.. హిందీ, తెలుగు, కన్నడ, తమిళ్, మలయాళం భాషల్లో నిర్మించనున్నారు.

ఇక ఇదిలా ఉండగా ఈ సినిమాలో నటించే నటీనటుల గురించి.. ప్రభాస్ పాత్ర గురించే అప్పుడే వార్తలు మొదలయ్యాయి. ఇప్పటికే ఈ సినిమాలో విలన్ పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నాడని.. హీరోయిన్ గా కీర్తి సురేష్ నటిస్తుందని కథనాలు చక్కర్లు కొడుతున్నాయి. ఇంకా ప్రభాస్ రాముడి పాత్రలో నటిస్తున్నట్టు కూడా వార్తలు వచ్చాయి. మరి ఒకవేళ ఈ సినిమాలో ప్రభాస్ ది కనుక రాముడి పాత్ర అయితే రావణాసురిడి పాత్రకు ఎవరైతే ఫర్ఫెక్ట్ గా సెట్ అవుతారని అనుకుంటున్నారు. సరదాగా మీ ఓటు ద్వారా మీ అభిప్రాయాన్ని తెలపండి.

'ఆదిపురుష్' - ప్రభాస్ రాముడు అయితే.. రావణుడిగా ఎవరికి మీ ఓటు..?

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × five =