‘గుర్తుందా శీతాకాలం’ లాంచ్ డేట్ ఖరారు

Tamannaah & Satyavdev's Gurtunda Seethakalam movie gets a launch date

కన్నడలో సూపర్ హిట్ అయిన ‘లవ్ మాక్ టైల్’ సినిమాను తెలుగులో సత్యదేవ్, తమన్నా హీరో హీరోయిన్లుగా రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. నాగశేఖర్ దర్శకత్వం వహించనున్న ఈ సినిమా రీమేక్ ప్రీ ప్రొడక్షన్ పనులు దాదాపుగా పూర్తయినట్టు తెలుస్తుంది. ఇక ఈ సినిమాకు టైటిల్ గా గుర్తుందా శీతాకాలం అనుకున్నట్టు వార్తలు వచ్చిన సంగతి కూడా విదితమే. ఇప్పుడు ఈ వార్తలకు బ్రేక్ వేశారు. అదే టైటిల్ ను ఖరారు చేశారు. అంతేకాదు ఈ చిత్ర టైటిల్ ఫస్ట్ లుక్‌‌తో పాటు తమన్నా లుక్‌ను కూడా చిత్రయూనిట్ విడుదల చేసింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అంతేకాదు ఈ సినిమా లాక్ డేట్ ను కూడా ఫిక్స్ చేశారు. ఈ నెల 27వ తేదీన హైదరాబాద్ తాజ్ కృష్ణా‌లో పూజా కార్యక్రమాలతో సినిమాను ప్రారంభించనున్నారు. చిత్ర రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ చివరి వారం నుండి స్టార్ట్ చేయబోతున్నట్లుగా చిత్రయూనిట్ ప్రకటించింది. ఈ ఏడాది చివరి లోపు షూటింగ్ ను పూర్తి చేసి.. ఆలోపు థియేటర్స్ కనుక ప్రారంభం అయితే థియేటర్స్ లో రిలీజ్ చేద్దామనే ప్లాన్ లో ఉన్నారట. చూద్దాం మరి అప్పటికి ఏం జరుగుతుందో.

నాగ శేఖర్ మూవీస్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ఈ సినిమాను నాగశేఖర్, భావన రవి నిర్మిస్తున్నారు. కీరవాణి తనయుడు కాల భైరవ సంగీతాన్ని అందిస్తుండగా.. సత్య హెగ్డే సినిమాటోగ్రాఫర్ గా పని చేస్తున్నారు. ఇక ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని వివరాలు, ఇతర నటీనటుల వివరాలు త్వరలోనే తెలియచేయనున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen + eighteen =