సామ్ ‘గ్రో విత్ మీ ఛాలెంజ్’

Samantha Akkineni Urges Everyone To Take Part With Her In Grow With Me Challenge

మనం చేసే పనుల ద్వారా అందరికంటే మనం కాస్త విభిన్నం అని తెలుస్తుంది. టాలీవుడ్ లో ఎంతమంది హీరోయిన్స్ ఉన్నా అక్కినేని వారి కోడలు స్టార్ హీరోయిన్ సమంత తాను చేసేపనులు ద్వారా తాను కాస్త భిన్నం అని నిరూపిస్తుంది ఎప్పుడూ. తెలుగు సినిమా రంగంలో అడుగుపెట్టి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ రేంజ్ కు ఎదిగింది. కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే నాగ చైతన్యను పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత క్రేజ్ ఏమన్నా తగ్గిందా అంటే.. అదే క్రేజ్.. అవే సూపర్ హిట్స్. పెళ్లైన తర్వాత కూడా వరుస సినిమాలతో.. హిట్స్ తో, ఆఫర్స్ తో దూసుకుపోతోందంటే అది కేవలం సమంతకు మాత్రమే సాధ్యమైంది. ఇక ఛారిటీ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూనే వుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈ లాక్ డౌన్ లో ఏకంగా ఒక సామాన్య మహిళగా మారిపోయింది సామ్. తన ఇంటి పెరటిలో మొక్కలు పెంచుతూ.. అంతే కాకుండా వాటిని ఆర్గానిక్ పద్ధతిలో ఎలా పెంచాలో కూడా టిప్స్ ఇస్తుంది. ఇక ఇప్పుడు తాజాగా మరో ఇంట్రెస్టింగ్ ఛాలెంజ్ కు తెరలేపింది. అదే గ్రో విత్ మీ అనే ఛాలెంజ్. గ్రో విత్ మీ అనే ఛాలెంజ్ మొదలు పెట్టిన సామ్ తనలానే ఇంటిలో కూరగాయలు పెంచాలని పిలుపునిచ్చారు. తాను పండించిన కూరగాయలు, ఆకుకూరలను చూపిస్తూ సమంత ఒక వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఈ జర్నీలో తనను ప్రోత్సహించిన అభిమానులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే కొన్ని వారాల్లో సేంద్రియ పద్ధతిలో కూరగాయలు పండిద్దామని.. దీని కోసం ఒక కుండ, కొద్దిగా మట్టి, విత్తనాలు, ఖాళీ పాల ప్యాకెట్ లేదంటే హైడ్రోపోనిక్ హోం కిట్ సిద్ధం చేసుకుని కూరగాయలను పండించాలని వెల్లడించారు. అనంతరం ఈ ఛాలెంజ్‌కు ముందుగా ఆమె మంచు లక్ష్మి, రకుల్ ప్రీత్ సింగ్‌లను నామినేట్ చేశారు.

 

 

View this post on Instagram

 

Hey guys, thank you so much for the awesome support on all my #GrowWithMe posts. It feels amazing that you think growing your own food is cool too! As much as I have enjoyed making you a part of my journey, I would love to be a part of your #GrowWithMe journeys too. Now it’s time for you to join me on this #GrowWithMe journey. For the next few weeks, let’s grow together! So go find a pot, some soil, seeds, an empty milk packet or even a Hydroponic Homekit and get growing. Trust me, this will change so many things for you. So don’t forget to tag me and use the hashtag. I can’t wait to hear from you all. To start things off, I’m challenging @lakshmimanchu & @rakulpreet along with all of you to #GrowWithMe. Let’s get our hands dirty 🍀….. outfit @saakshakinni 💓

A post shared by Samantha Akkineni (@samantharuthprabhuoffl) on

ప్రస్తుతం సామ్ విఘ్నేశ్ శివన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తుంది. ఇక ఈ సినిమాతోపాటు సామ్ ఫ్యామిలీ మెన్ 2 అనే వెబ్ సిరీస్‌లో కూడా నటిస్తోంది. ఇందులో విలన్ పాత్ర చేస్తుంది సామ్. మరోవైపు ఇంకా గేమ్ ఓవర్ ఫేమ్ అశ్విన్ శరవణన్ దర్శకత్వంలో కూడా మరో సినిమా చేస్తుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 − 1 =