ఆగష్ట్ 17-21 – టాలీవుడ్ ఇంపార్టెంట్ అప్ డేట్స్ మీకోసం

August 17-21 : Here are the prime tollywood movie updates for this week

గత వారం రోజుల్లో ఎన్నో సినిమా వార్తలు ‘దితెలుగుఫిలింనగర్ .కమ్’ ద్వారా మీకు అందించాం. ఈ వారంలో ఎన్నో విశేషాలు చోటు చేసుకున్నాయి. మరి ఆ అప్ డేట్స్ లో మీరేమైనా ముఖ్యమైన అప్ డేట్స్ మరిచిపోయారా? అయితే ఈ వీక్లీ రౌండప్ మీకోసం. ఈవారం వార్తలపై మీరొక లుక్కేయండి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఓటీటీలో ‘V’

ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో నాని, సుధీర్ బాబు ప్రధాన పాత్రల్లో ‘వి’ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. సెప్టెంబ‌ర్ 5న చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుద‌ల చేయ‌నున్న‌ట్టు అధికారికంగా తెలిపారు. ఈ చిత్రంలో నివేదా థామస్, అదితి రావ్ హైదరీ హీరోయిన్లుగా నటిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై శిరీష్‌, హ‌ర్షిత్ రెడ్డి రూపొందుతున్న ఈ సినిమాకు అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్నాడు.

 

‘కె.జి.యఫ్’ 2 – బ్యాక్ టు షూట్

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్ హీరోగా ‘కె.జి.యఫ్’ సీక్వెల్ ‘కె.జి.యఫ్’ 2 తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకుంది. కరోనా వల్ల ఇన్ని రోజులు షూటింగ్ కు గ్యాప్ ఇచ్చారు చిత్రయూనిట్. అయితే తాజాగా ఈ సినిమా షూటింగ్ ను మొదలు పెట్టారు. ఈ విషయాన్ని ప్రశాంత్ నీల్ సోషల్ మీడియా ద్వారా తెలిపారు.

 

‘ప్రభాస్ 22’ టైటిల్ పోస్టర్ రిలీజ్

‘ప్రభాస్ 22’ టైటిల్ పోస్టర్ ఆగష్ట్ 18న రిలీజ్ చేశారు. మైథలాజికల్ సోషియో ఫాంటసీ ఎంటెర్టైనెర్ గా రెడీ అవుతున్న ఈ చిత్రానికి “ఆది పురుష్” అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ప్రముఖ బాలీవుడ్ నిర్మాతలు భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్ భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని హిందీ, తెలుగు, కన్నడ, తమిళ్, మలయాళం భాషల్లో నిర్మిస్తున్నారు.

 

సందీప్ కిషన్ ‘వివాహ భోజనంబు’ ప్రీ లుక్‌ రిలీజ్

రామ్‌ అబ్బరాజు దర్శకత్వంలో సందీప్ కిషన్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా టైటిల్ తో పాటు ప్రీ లుక్ పోస్టర్ ను ఆగష్ట్17 న రిలీజ్ చేశారు. వెంకటాద్రి టాకీస్‌, సోల్జర్స్‌ ఫ్యాక్టరీ, ఆనంది ఆర్ట్స్ క్రియేషన్స్ పతాకాలపై రూపొందనున్న ఈ సినిమాను సందీప్‌ కిషన్‌, శినీష్, కిరణ్‌ నిర్మిస్తున్నారు. త్వరలో ఫస్ట్‌ లుక్‌తో పాటు ఈ సినిమాలో హీరో, హీరోయిన్‌, ఇతర నటీనటుల వివారాలను తెలియచేయనున్నారు.

 

3 గెటప్స్ లో నాగచైతన్య..?

“మనం “మూవీ ఫేమ్ విక్రమ్ K కుమార్ దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ “థ్యాంక్ యూ ” మూవీ రూపొండుతున్న సంగతి తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో నాగచైతన్య క్యారెక్టర్ డిఫరెంట్ షేడ్స్ లో ఉంటుందని, నాగచైతన్య మూడు విభిన్న తరహా గెటప్స్ లో ప్రేక్షకులను అలరించనున్నారని సమాచారం.

“ఆదిపురుష్ ” మూవీ లో విలన్ గా సైఫ్ అలీ ఖాన్ ?

“తానాజీ ” మూవీ ఫేమ్ ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్ హీరో గా 3D ఫార్మట్ లో భారీ బడ్జెట్ తో “ఆదిపురుష్ ” మూవీ రూపొందనుంది. హీరో ప్రభాస్ రాముడిగా నటిస్తున్న ఈ మూవీ లో రావణబ్రహ్మ గా బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ నటించనున్నారని సమాచారం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three + nineteen =