‘కె.జి.యఫ్’ 2 – బ్యాక్ టు షూట్

KGF 2 Movie Shoot Resumes Post Lockdown

దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో కె.జి.యఫ్ 2 సినిమా కూడా ఒకటి. ఈ సినిమా ఎప్పుడు వస్తుందా.. ఎప్పుడు చూద్దామా అని ఎదురుచూస్తున్నారు. కరోనా లేకపోతే ఇప్పటికే షూటింగ్ పూర్తయి పోస్ట్ ప్రొడక్షన్ పనులు చేసుకుంటూ ఉండేది. చెప్పినట్టే అక్టోబర్ లో రిలీజ్ అయ్యేది. కానీ ఇప్పుడు పరిస్థితులు వేరు కదా. అయితే ఇంకా కొద్దిరోజుల షూట్ మాత్రమే మిగిలింది. ఇప్పుడు మళ్ళీ షూట్ ను మొదలు పెట్టనున్నట్టు తెలుస్తుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తాజాగా ఈ సినిమా షూటింగ్ అప్ డేట్ ఇచ్చారు. తన ట్విట్టర్ ద్వారా షూటింగ్ మొదలు పెట్టనున్నామని.. మేము కూడా చాలా ఎగ్జైట్ గా వున్నామని అన్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎక్కువమందితో జాగ్రత్తలు తీసుకొని షూటింగ్ చేయాలంటే కష్టం.. అయితే నార్మల్ డేస్ లో షూటింగ్ కంటే ఇప్పుడు కొంచం ప్రాసెస్ స్లోగానే ఉంటుంది.. ప్రస్తుతానికి కొన్ని పోర్షన్ మాత్రమే షూటింగ్ చేస్తాం.. అది కూడా కొద్దిమంది టీంతోనే.. కొంచం పరిస్థితులు బెటర్ అయిన తర్వాత మిగిలిన షూటింగ్ ను చేస్తామని తెలిపారు.

 

ఈ సినిమాలో యష్, శ్రీనిధి శెట్టి హీరో హీరోయిన్లుగా నటిస్తుండగా… బాలీవుడ్ స్టార్ యాక్ట‌ర్ సంజ‌య్ ద‌త్ ఈ చిత్రంలో అధీర అనే ప‌వ‌ర్‌ఫుల్ పాత్ర‌లో న‌టిస్తున్నారు. రవీనాటాండన్ ఓ పవర్ ఫుల్ పొలిటీషియన్ పాత్రలో నటిస్తుంది. హోంబ‌లే ఫిలింస్, ఎక్సెల్ మూవీస్, వారాహి చలన చిత్రం బ్యానర్స్ పై  నిర్మిస్తున్న ఈ సినిమాకు ర‌వి బ‌స్రూర్ సంగీతం .. భువ‌న్ గౌడ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty − thirteen =