‘వర్మ’ బయోపిక్ షూటింగ్ మొదలు

Movie Shooting Of Ram Gopal Varma Biopic Movie Kick starts Today

ఇప్పటివరకూ యదార్థ సంఘటనల ఆధారంగా.. పలువురి జీవిత చరిత్రల ఆధారంగా రామ్ గోపాల్ వర్మ ఎన్నో సినిమాలు తెరకెక్కించాడు. ఇక ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ వంతు వచ్చింది. ఇప్పటికే రామ్ గోపాల్ వర్మ మీద పలువురు బయోపిక్ లు తీస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు మరో బయోపిక్ రానుంది. మూడు భాగాలుగా రూపొందిస్తున్న ఈ బయోపిక్ లో మొదటి పార్ట్ ను రాము అనే పేరుతో తెరకెక్కిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా ఈ సినిమా షూటింగ్‌ ఈరోజు హైదరాబాద్‌లో ప్రారంభమైంది. కొత్త దర్శకుడు దొరసాయి తేజ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లోని ఒక కాలేజ్ లో ప్రారంభమవ్వగా ఈ విషయాన్ని వర్మ తన ట్విట్టర్ ద్వారా అధికారికంగా తెలిపారు. ఈ షూటింగ్ కు వచ్చిన రామ్ గోపాల్ వర్మ తల్లి సూర్యావతి కెమెరా స్విచ్ఛాన్ చేయగా…. ఆర్జీవీ సోదరి విజయ క్లాప్ ఇచ్చినట్టు తెలిపారు

ఈ బయోపిక్‌ను బొమ్మాకు క్రియేషన్స్ పతాకంపై బొమ్మాకు మురళి నిర్మిస్తున్నారు. ఫస్ట్ పార్ట్ లో దొరసాయి తేజ టీనేజ్ రామ్ గోపాల్ వర్మ పాత్రలో నటిస్తున్నాడని… పార్ట్‌ 1లో రామ్‌ గోపాల్‌ కాలేజ్‌ డేస్‌ చూపించనున్నారు. మూడు పార్ట్‌లలో ముగ్గురు వేరువేరు వ్యక్తులు రామ్‌గోపాల్‌వర్మ స్థానంలో కనిపించనున్నారు. అయితే మూడో పార్ట్‌లో మాత్రం రామ్‌ గోపాల్‌ వర్మే నటించనున్నారు. మిగతా పాత్రల్లో కొత్త నటీనటులు నటిస్తున్నారు.

 

 

 

ఇక ఈ లాక్ డౌన్ లో నిరంతరాయంగా ఎవరైనా వరుస సినిమాలు షూటింగ్ లు చేశారంటే అది వర్మ మాత్రమే. వరుస పెట్టి సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు. ప్రస్తుతం వర్మ ప్రకటించిన వాటిలో ‘కరోనా’ ‘మర్డర్’ ‘కిడ్నాపింగ్ ఆఫ్ కత్రినా కైఫ్’ ‘ది మ్యాన్ హూ కిల్లుడ్ గాంధీ’, 12 ‘O’ క్లాక్, ‘పవర్ స్టార్’ సినిమాలు వున్నాయి. మరి ఇన్ని సినిమాల్లో ఎన్ని సినిమాలు విడుదల అవుతాయో.. ఏంటో చూద్దాం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

14 + 8 =