హీరోయిన్ గా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి టాప్ హీరోయిన్ గా ఎదిగి.. ఆతర్వాత ‘నరసింహ’ సినిమాలోని నీలాంబరి పాత్రతో తనలోని మరో యాంగిల్ ను చూపించి తన రేంజ్ ను మార్చేసింది రమ్యకృష్ణ. గ్లామరోతో కూడిన పాత్రలోనైనా, సీరియస్ పాత్రలోనైనా అవలీలగా ఒదిగిపోగల నటి రమ్యకృష్ణ. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ చిత్రాల్లో దాదాపు 260కి పైగా చిత్రాల్లో నటించి మెప్పించారు. స్టార్ హీరోయిన్గా అగ్ర కథానాయకులందరితోనూ ఆమె నటించారు. ఇక ఇటీవల వచ్చిన ‘బాహుబలి’ సినిమాతో శివగామిగా తారా స్థాయి కి చేరుకుంది. బాహుబలి సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి వరుస ఆఫర్స్ తో దూసుకుపోతుంది రమ్యకృష్ణ.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈ రోజు రమ్యకృష్ణ పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సందర్భంగా దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు కూడా రమ్యకృష్ణకు వెరైటీగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. రోజ్ రోజ్ రోజా పువ్వా నుంచి మమతల తల్లి వరకు, ఎన్ని సంవత్సరాలు గడిచినా మన ప్రయాణం చెక్కుచెదరనంత గొప్పది. నువ్వు మరిన్ని ఐకానిక్ పాత్రలతో ప్రపంచాన్ని అలరించాలి. నా డియరెస్ట్ అండ్ బ్యూటీఫుల్ హీరోయిన్ రమ్యకృష్ణకు పుట్టినరోజు శుభాకాంక్షలు” అని దర్శకేంద్రుడు తన ట్వీట్లో పేర్కొన్నారు.
From Rose Rose Roja Puvvaaa to Mamathala Thalli, our journey was remarkable over the years. May you entertain the world with more iconic roles.
Wishing my dearest and beautiful @meramyakrishnan a very Happy Birthday. 😊 pic.twitter.com/c1J6Tq2pwO
— Raghavendra Rao K (@Ragavendraraoba) September 15, 2020
ఇక ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరోగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ‘ఫైటర్’ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో విజయ్ కు కూడా తల్లిగా రమ్యకృష్ణ నటిస్తుంది. దీనితోపాటు కన్నడ, తమిళ్, మలయాళం సినిమాల్లో కూడా వరుస సినిమాలతో బిజీగా వుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: