సింగీతం శ్రీనివాసరావు కి కరోనా పాజిటివ్ – నేనెప్పుడూ ‘పాజిటివే’

Legendary Director Singeetam Srinivasa Rao Tests Positive For Corona Virus

టాలీవుడ్ సెలెబ్రిటీస్ ఒకరి తర్వాత ఒకరు కరోనా బారిన పడుతున్నారు. ఈరోజు ఉదయాన్నే మెగా బ్రదర్ నాగబాబు సోషల్ మీడియా ద్వారా తనకు కరోనా పాజిటివ్ వచ్చిందని చెప్పిన సంగతి గుర్తుండే ఉంటుంది కదా. అది మరిచిపోకముందే మరో లెజెండ్రీ డైరెక్టర్ కు కరోనా పాజిటివ్ నిర్దారణ అయినట్టు తెలుస్తుంది. ఆ డైరెక్టర్ ఎవరో కాదు.. సింగీతం శ్రీనివాసరావు. ఈ విష‌యాన్ని వీడియో ద్వారా స్వ‌యంగా వెల్ల‌డించారు సింగీతం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ గ్లోబల్ పాండమిక్ చాలా సీరియస్.. ప్రతి ఒక్కరూ చాలా జాగ్రత్తగా ఉండాలి.. పేస్ కు మాస్క్ లు సోషల్ డిస్టెన్స్ పాటించాలి. అన్నిజాగ్రత్తలు తీసుకున్నా కానీ ఈ వైరస్ ఎటునుండి వచ్చిందో.. ఎలా వచ్చిందో ఇప్పటికీ అర్ధం కావట్లేదు.. సెప్టెంబ‌ర్ 9న కోవిడ్ పాజిటివ్ అని నిర్దారణ అయిందని తెలిపారు. అంతేకాదు డాక్టర్లు నాకు కరోనా పాజిటివ్‌‌గా అని చెప్పగానే .. గత 65ఏళ్ళుగా నేను ‘‘పాజిటివ్‌’’గానే ఉన్నాను. ఇప్పుడు మీరు పాజిటివ్ అని చెబుతున్నారేంటని వైద్యులతో చమత్కరించాను.. ప్రస్తుతం డాక్టర్ల సూచనలు పాటిస్తూ ఐసొలేషన్‌లో ఉన్నాను ఈ నెల 22న హోమ్ ఐసొలేష‌న్ పూర్త‌వుతుంద‌ని వెల్లడించారు. నాకిష్టమైన పుస్తకాలు చదువుతూ.. కొన్ని స్క్రిప్ట్ లు రాసుకుంటూ కాలక్షేపం చేస్తున్నా.. ప్రస్తుతం బాగానే ఉన్నా అని తెలిపారు సింగీతం శ్రీనివాస రావు.

ప్రయోగాత్మక సినిమాలకు కేరాఫ్ అడ్రస్ సింగీతం శ్రీనివాసరావు. ఆయన పేరు చెప్తే మనకి వెంటనే గుర్తొచ్చే సినిమా పేరు పుష్ఫ‌క‌విమానం. ఆయన సినీ కెరీర్ లో పుష్ఫ‌క‌విమానం, ఆదిత్య 369, విచిత్ర సోద‌రులు లాంటి ఎన్నో గొప్ప సినిమాలను అందించారు. ఆయన చివరిగా వెల్ కమ్ ఒబామా అనే సినిమా తీసారు. ఇన్నేళ్ల గ్యాప్ తర్వాత ఒక బయోపిక్ తో మళ్లీ మెగా ఫోన్ పట్టుకోనున్నట్టు ఇటీవలే వార్తలు కూడా వినిపించాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.