కామెడీ థ్రిల్లర్ మూవీ లో నివేత పేతురాజ్

Actress Nivetha Pethuraj Signs Up For A Comedy Thriller Movie.

తమిళ హీరోయిన్ నివేత పేతురాజ్ సక్సెస్ ఫుల్ “మెంటల్ మదిలో ” మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. “చిత్ర లహరి “, “బ్రోచేవారెవరురా “, “అల .. వైకుంఠపురములో ” వంటి సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. నివేత నటించిన “RED ” మూవీ రిలీజ్ కు సిద్ధంగా ఉంది. 3 తమిళ మూవీస్ లో నటిస్తున్న నివేత ఇప్పుడు ఒక కామెడీ థ్రిల్లర్ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై సూపర్ హిట్ “కార్తికేయ ” మూవీ ఫేమ్ చందు మొండేటి దర్శకత్వంలో నివేత ప్రధాన పాత్రలో రూపొందుతున్న ఉమెన్ సెంట్రిక్ కామెడీ థ్రిల్లర్ మూవీ రామోజీ ఫిల్మ్ సిటీ లో పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది. సింగిల్ షూటింగ్ షెడ్యూల్ లో ఈ మూవీ చిత్రీకరణ జరగుతుంది. ఈ మూవీ లో నటించే నటీనటులు , టెక్నీషియన్స్ వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి. ఈ మూవీ కంప్లీట్ అయిన తరువాత దర్శకుడు చందు మొండేటి దర్శకత్వంలో నిఖిల్ హీరోగా “కార్తికేయ 2 ” మూవీ షూటింగ్ ప్రారంభం కానుంది. టాలెంటెడ్ యాక్ట్రెస్ నివేత ఫస్ట్ టైమ్ ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ లో నటిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.