కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

బాలీవుడ్ కు వెళ్ళే ఆలోచన లేదు -రాశీఖన్నా

బాలీవుడ్ కు వెళ్ళే ఆలోచన లేదు -రాశీఖన్నా

I have no intention of going to Bollywood Says Actress Raashi Khanna

బ్లాక్ బస్టర్ "మద్రాస్ కేఫ్ " (2013) మూవీ తో బాలీవుడ్ లో సినీ కెరీర్ ప్రారంభించిన రాశీఖన్నా సక్సెస్ ఫుల్ "ఊహలు గుస గుస లాడే " మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. టాలీవుడ్ లో పలు సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన రాశీఖన్నా సూపర్ హిట్ "ఇమైక్క నోడిగళ్ " మూవీ తో కోలీవుడ్ కు పరిచయం అయ్యి పలు సూపర్ హిట్ మూవీస్ తో కోలీవుడ్ లో బిజీగా మారారు. రాశీఖన్నా ప్రస్తుతం 2 తమిళ మూవీస్ లో నటిస్తున్నారు. పలు తెలుగు మూవీస్ చర్చల దశలో ఉన్నాయి. రీసెంట్ గా ఒక వెబ్ సిరీస్ కు రాశీఖన్నా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

"మద్రాస్ కేఫ్ " మూవీ తరువాత రాశీఖన్నా హిందీ మూవీస్ లో నటించలేదు. రాశీఖన్నా మాట్లాడుతూ .. బాలీవుడ్ లో నటించకపోవడానికి ప్రత్యేక కారణాలు లేవనీ , "మద్రాస్ కేఫ్ " మూవీ లో నటిస్తున్న టైమ్ లోనే టాలీవుడ్ లో "మనం " మూవీ లో అవకాశం వచ్చిందనీ , హీరోయిన్ గా నటించిన "ఊహలు గుస గుస లాడే " మూవీ ఘనవిజయం సాధించిందనీ , తరువాత వరుస మూవీస్ తో బిజీగా మారాననీ, తెలుగు ప్రేక్షకులనుండి అపారమైన ప్రేమ , అభిమానం లభిస్తున్నాయనీ, కుటుంబం తో హైదరాబాద్ లో సెటిల్ అయ్యాననీ , ప్రత్యేకంగా హిందీ మూవీస్ కై ఆలోచించడం దేనికని అనిపిస్తుందనీ , అవకాశాలను బట్టి తమిళ , మలయాళ మూవీస్ లో నటిస్తాననీ , బాలీవుడ్ కు వెళ్ళే ఆలోచన లేదనీ , నటిగా తన ప్రయాణం సంతృప్తికరంగా సాగుతుందనీ రాశీఖన్నా చెప్పారు.

వీడియోస్

సంబంధిత వార్తలు

అన్నీ
వాట్సాప్‌లో షేర్ చేయండి

షేర్