కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

మెగా బ్రదర్ కి కరోనా పాజిటివ్

మెగా బ్రదర్ కి కరోనా పాజిటివ్

Mega Brother Naga Babu Tests Positive For Corona Virus

ఇప్పటికే సినిమా ఇండస్ట్రీకి కరోనా వల్ల చాలా నష్టం జరిగిపోయింది. దానికితోడు ఎంతో మంది లెజెండ్రీ నటీనటులు కూడా ఈ ఏడాదే కన్ను మూసారు. దానికితోడు కరోనా ఇప్పటికే చాలా మంది సెలబ్రిటీస్ ను టార్గెట్ చేసింది. అదేంటో షూటింగ్ లకు వెళ్లకుండా ఇంట్లోనే ఉన్నా కూడా కరోనా సోకిన సెలబ్రిటీస్ చాలా మంది ఉన్నారు. లెజండ‌రీ డైరెక్ట‌ర్ రాజ‌మౌళి నుండి తేజ, డీవీవీ దానయ్య, తేజ, సింగర్ సునీత ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే తయారవుతుంది.. ప్ర‌ముఖ గాయ‌కుడు ఎస్‌పీ బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం ఇప్పటికీ చికిత్స పొందుతూనే ఉన్నారు. ఇప్పుడు మరో సెలబ్రిటీకి కరోనా పాజిటివ్ నిర్దారణ అయింది. ఆ సెలబ్రిటీ ఎవరో కాదు మెగా బ్రదర్ నాగబాబు.

నాగ‌బాబుకు క‌రోనా పాజిటివ్ అని నిర్థార‌ణ అయింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా సోషల్ మీడియాద్వారా తెలిపారు. ''ఇన్ఫెక్షన్ అనేది ఎప్పుడూ బాధగా ఉండేది కాదు.. దీన్ని మీరు తోటివారికి సహాయపడే అవకాశంగా మార్చుకోవచ్చు'' అని చెప్తూ తనకు కోవిడ్ -19 పాజిటివ్ వచ్చిందని.. కరోనాను జయించి ప్లాస్మా దానం చేస్తానని నాగబాబు చెప్పారు. ఇక దీనిపై మెగా అభిమానులు స్పందిస్తూ నాగబాబు త్వరగా కోలుకోవాలని కామెంట్లు పెడుతున్నారు.

కాగా నాగ‌బాబు గ‌త కొన్నిరోజులుగా ఓ ఛాన‌ల్‌లో వ‌చ్చే కామెడీ షోలో పాల్గొంటున్న విష‌యం తెలిసిందే. అక్క‌డి నుంచే వైర‌స్ సోకి ఉండొచ్చు అంటున్నారు.

వీడియోస్

సంబంధిత వార్తలు

అన్నీ
వాట్సాప్‌లో షేర్ చేయండి

షేర్