‘మోస్ట్ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్’ సెట్ లో బుట్టబొమ్మ

Actress Pooja Hegde Joins Back Movie Shoot Of Most Eligible Bachelor

మొత్తానికి ఇప్పుడిప్పుడే ధైర్యం చేసి షూటింగ్ లను స్టార్ట్ చేస్తున్నారు. ఇంకెన్ని రోజులు ఉన్నా కరోనా ప్రభావం తగ్గేలా లేదు.. ఇలానే ఉన్నా వర్కౌట్ కాదులే అని అందరూ షూటింగులను మొదలు పెడుతున్నారు. చాలా సినిమాల షూటింగ్స్ చివరి దశలో ఉండటంతో కరోనా నిబంధనలు పాటిస్తూ షూటింగ్ పార్ట్ వరకూ ముందు ఫినిష్ చేస్తే రిలీజ్ సంగతి తర్వాత చూడొచ్చులే అని షూటింగ్స్ మొదలు పెట్టేస్తున్నారు. ఇప్పటికే కొన్ని సినిమాల షూటింగ్స్‌ మొదలైన విషయం తెలిసిందే. కొన్ని సినిమాలు మొదలై షూటింగ్ పూర్తి చేసుకున్నాయి కూడా.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తాజాగా అఖిల్‌ అక్కినేని, పూజా హెగ్డే కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటున్న ‘మోస్ట్ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్’ షూటింగ్‌ కూడా మొదలైంది. చాలా రోజులు ఇంట్లోనే ఉన్న పూజా నిన్ననే ఇక్కడికి షూటింగ్ నిమిత్తం వచ్చింది. అలా వచ్చిందో లేదో ఇలా షూటింగ్ లో పాల్గొంది. ఈ సందర్భంగా సెట్‌లో ఉన్న తన ఫొటోను ఇన్స్టా లో పోస్ట్ చేసింది. తన టీమ్‌తో కార్‌వాన్ దగ్గర ఉన్న ఫొటోను షేర్‌ చేసిన పూజా.. ద బాండ్స్ బ్యాక్ టుగెదర్‌ అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చింది.

 

 

View this post on Instagram

 

The band’s back together…🥁📽😷 #glamsquad #mosteligiblebachelor

A post shared by Pooja Hegde (@hegdepooja) on

కాగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతుంది. లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతు ఈ సినిమాను గీత ఆర్ట్స్ 2 బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ సినిమాకు గోపి సుందర్ సంగీతం అందిస్తున్నారు. ఇంకా ఈ సినిమాతో పాటు పూజా హెగ్డే ప్రభాస్‌ ‘రాధేశ్యామ్’ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ కూడా ప్రారంభం కానుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen − 10 =