ట్యాగ్ · 4140 కథనాలు · పేజీ 49
అమ్మతో యాంకర్ అనసూయ
మోహన్ లాల్ ఆర్గానిక్ ఫార్మింగ్
మళ్లీ క్రిటికల్ కండీషన్ లో ఎస్పీ బాలు ఆరోగ్యం
తల్లికి విజయ్ ప్రామిస్ - ఎప్పుడూ సంతోషంగా ఉంచుతా
'రాధే శ్యామ్' షూట్ కోసం వెయిటింగ్
సేమ్ డైరెక్టర్ తో రాజ్ తరుణ్ కొత్త సినిమా

అక్టోబర్ లో "వకీల్ సాబ్ " షూటింగ్ లో శృతి హాసన్
చిరు క్లారిటీ.. అందుకే సుజీత్ ప్లేస్ లో వినాయక్
అడివి శేష్ 'మేజర్' లో 'దబాంగ్ 3' బ్యూటీ

నవంబర్ లో "#VT 10" షూటింగ్ పునః ప్రారంభం
వరుస చిత్రాలతో తీరిక లేకుండా ఉన్నా - పూజాహెగ్డే

ప్రముఖ నటుడు వేణుగోపాల్ మృతి
రామ్ చరణ్ స్టన్నింగ్ లుక్

ఇద్దరు సూపర్ స్టార్లు సేమ్ టు సేమ్
పాన్ కేక్ తయారీ చెపుతున్న రష్మిక
'వకీల్ సాబ్' కూడా షురూ చేశాడు..!
టబు పాత్రకు తమన్నా బెస్ట్ ఛాయిస్

మణిరత్నం "నవరస "వెబ్ సిరీస్ అప్ డేట్
నెగటివ్ రోల్ లో హీరోయిన్ పూర్ణ
"శ్రీ మహాలక్ష్మి " మూవీ తో తెలుగు తెరకు పరిచయం అయిన పూర్ణ "సీమ టపాకాయ్ ", "అవును ", "రాజుగారి గది ", "అవును 2 "వంటి మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. తెలుగు తో పాటు తమిళ , కన్నడ , మలయాళ మూవీస్ లో పూర్ణ నటించారు. పూర్ణ ప్రస్తుతం 100 (కన్నడ ), "తలైవి "(తెలుగు , తమిళ , హిందీ ), ఒక మలయాళ మూవీ లో నటిస్తున్నారు. గ్లామర్ రోల్స్ లో నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న పూర్ణ ఇప్పుడు ఒక తెలుగు మూవీ లో నెగటివ్ రోల్ లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
అమ్మతో యాంకర్ అనసూయ
టాలెంటెడ్ యాంకర్ అనసూయ తన అందం , అభినయం తో ప్రేక్షకులనుఆకట్టుకుని సక్సెస్ ఫుల్ యాంకర్ గా కొనసాగుతున్నారు. నటన కు ప్రాధాన్యం ఉన్న పాత్రలను ఎంపిక చేసుకుని మూవీస్ లో నటిస్తున్నారు. "సోగ్గాడే చిన్ని నాయనా ", "క్షణం ", "రంగస్థలం ", "యాత్ర "వంటి సక్సెస్ ఫుల్ మూవీస్ తో అనసూయ ప్రేక్షకులను అలరించారు. "క్షణం ", "రంగస్థలం " వంటి మూవీస్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి అనసూయ బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ గా అవార్డ్స్ అందుకున్నారు. అనసూయ ప్రస్తుతం "పుష్ప ", "ఆచార్య ", "రంగమార్తాండ " మూవీస్ లో నటిస్తున్నారు.
మోహన్ లాల్ ఆర్గానిక్ ఫార్మింగ్
కరోనా వల్ల కొంత నష్టం ఉన్నా కూడా కొన్ని లాభాలు అయితే ఉన్నాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మన సెలబ్రిటీస్ కొత్త విషయాలను నేర్చుకోవడంతో పాటు ఇంటిపని, వంటపనిలో కూడా ప్రావీణ్యం సంపాదించారు. ముఖ్యంగా బయట ఫుడ్ ను చాలా వరకూ ఆపేసి ఇంట్లో ఫుడ్ కే ప్రాముఖ్యత ఇస్తున్నారు. అంతేకాదు కొంతమంది సెలబ్రిటీస్ అయితే ఏకంగా ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నారు. ఇప్పటికే ఇక్కడ సమంత ఈ ఛాలెంజ్ ను మొదలుపెట్టింది కూడా. అంతేకాదు ఇంట్లోనే మనకు కావాల్సిన కూరగాయాలు ఆర్గానిక్ పద్ధతిలో ఎలా పెంచుకోవాలో కూడా టిప్స్ చెపుతుంది.
బిగ్ బాస్ 4 - మరో వైల్డ్ కార్డ్ ఎంట్రీ
మొదటి రెండు వారాలతో పోల్చుకుంటే బిగ్ బాస్ 4ఈ వారం కాస్త ఇంటరెస్టింగ్ గానే ఉంది అని చెప్పొచ్చు. దానికి కారణం వేరే చెప్పేదేముంది ఫిజికల్ టాస్క్. రోబోలు.. హుమన్స్ మధ్య పెట్టిన ఈ టాస్క్ మంచి రసవత్తరంగానే సాగింది. రోబోలు దివిని కిడ్నాప్ చేయడంతో ఆటలో అసలు మజా అప్పుడు వచ్చింది. దీనికి హుమన్స్ టీమ్ పెద్ద హంగామా చేసినా రోబోలు మాత్రం కూల్ గా ఛార్జింగ్ ను పెట్టుకున్నారు.
మళ్లీ క్రిటికల్ కండీషన్ లో ఎస్పీ బాలు ఆరోగ్యం
కరోనా కారణంగా ఎస్పీ బాలు చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చేరి ఆ తర్వాత ఆరోగ్యం కాస్త విషమించి అక్కడే హాస్పిటల్ లో వుంటూ చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయనకు ఇటీవల కరోనా పరీక్షలు నిర్వహించగా నెగెటివ్ కూడా వచ్చింది. ఇక ఇక బాలు హెల్త్ అప్ డేట్స్ గురించి తనయుడు చరణ్ ఎప్పటికప్పుడు ఇస్తూనే ఉన్నాడు. ఇటీవలే తన తండ్రి ఆరోగ్యం నిలకడగానే ఉన్నదని ఎస్పీ చరణ్ తెలిపారు. తన తండ్రి ఈసీఎంవో సపోర్టుతో ఉన్నారని.. ఫిజియోథెరపీలో చురుకుగా పాల్గొంటున్నారని ఎస్పీ చరణ్ పేర్కొన్నారు. తన తండ్రి త్వరగా కోలుకోవడం కోసం శ్రమించిన ఆస్పత్రి వైద్యులకు, ఆయన అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు.
తల్లికి విజయ్ ప్రామిస్ - ఎప్పుడూ సంతోషంగా ఉంచుతా
అతి తక్కువ కాలంలో విజయ్ దేవరకొండ యూత్ ఐకాన్ గా ఎదిగాడు. భయపడకుండా తను మాట్లాడే మాటలు.. చేతలతో తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ను సృష్టించుకుని యూత్‌లో మాంచి ఫాలోయింగ్ సంపాదించాడు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరోగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో 'ఫైటర్' సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. పూరి కనెక్ట్స్ , ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెలుగు, హిందీ భాషలలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. సీనియర్ హీరోయిన్ రమ్య కృష్ణ ఒక కీలక పాత్రలో నటిస్తున్న ఈ మూవీ కి మణిశర్మ సంగీతం అందించనున్నారు.
'రాధే శ్యామ్' షూట్ కోసం వెయిటింగ్
ప్రస్తుతం టాలీవుడ్లో స్టార్ హీరోయిన్ రేస్‌లో ముందు ఉంది పూజా హెగ్డే. అల వైకుంఠపురములో, గద్దలకొండ గణేష్, మహర్షి, అరవింద సమేత ఇలా వరుస బ్లాక్ బస్టర్ హిట్లతో సూపర్ ఫామ్ లోకి వచ్చేసింది. దాదాపు స్టార్ హీరోలందరితో ఈ బుట్టబొమ్మ జోడీ కట్టేసింది. ప్రస్తుతం అఖిల్ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ మళ్లీ ఇప్పటికే మొదలైంది. పూజా హెగ్డే, అఖిల్ షూట్ లో పాల్గొంటున్నారు.
సేమ్ డైరెక్టర్ తో రాజ్ తరుణ్ కొత్త సినిమా
టాలీవుడ్ లో మంచి హిట్ కోసం ఎదురు చూసే హీరోల్లో రాజ్ తరుణ్ కూడా ఒకడు. ప్రస్తుతం ఒరేయ్ బుజ్జిగా సినిమాతో తన అదృష్టం పరీక్షించుకోడానికి వస్తున్నాడు. విజయ్‌కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈసినిమా అక్టోబర్ 2న అమెజాన్ ప్రైమ్ లో విడుదలవుతుంది. మాళవిక నాయర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో హెబ్బా పటేల్ కూడా కీలక పాత్రలో నటిస్తుంది. ఇంకా ఈ సినిమాలో నరేష్, పోసాని కృష్ణమురళి, అనీష్ కురువిళ్ళ, సప్తగిరి, రాజా రవీంద్ర, అజయ్ ఘోష్, అన్నపూర్ణ, సిరి, జయలక్ష్మి, సోనియా చౌదరి, సత్య, మధునందన్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

అక్టోబర్ లో "వకీల్ సాబ్ " షూటింగ్ లో శృతి హాసన్
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ , బే వ్యూ ప్రాజెక్ట్స్ బ్యానర్స్ పై వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా కోర్ట్ డ్రామా "వకీల్ సాబ్ " మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ కమ్ బ్యాక్ మూవీ గా బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ "పింక్ " తెలుగు లో రీమేక్ అవుతుంది. స్టార్ హీరోయిన్ శృతి హాసన్ కథానాయిక. అంజలి , నివేద థామస్ , అనన్య నాగళ్ళ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.
చిరు క్లారిటీ.. అందుకే సుజీత్ ప్లేస్ లో వినాయక్
ప్రస్తుతం చిరంజీవి, కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్యలో నటిస్తున్న సంగతి తెలిసిందే. త్వరలోనే మళ్లీ షూటింగ్ ను మొదలుపెట్టాలని.. ముందు రామ్ చరణ్ తో వున్న సీన్స్ పూర్తి చేయాలనీ భావిస్తోందట చిత్రయూనిట్. ఇక ఈ సినిమాలో చిరు సరసన కాజల్ అగర్వాల్ నటిస్తుండగా.. తనయుడు రామ్ చరణ్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడు. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్, కొణిదెల ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.
అడివి శేష్ 'మేజర్' లో 'దబాంగ్ 3' బ్యూటీ
ప్రస్తుతం అడివి శేష్ మేజర్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. వాస్తవ ఘటనల ఆధారంగా.. 26/11 ముంబై దాడుల్లో అమరుడైన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో శేష్ రెండు భిన్నమైన లుక్స్ లో కనిపిస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే ఈ సినిమా సగం పైగా షూటింగ్ ను పూర్తి చేసుకున్నట్టు తెలుస్తుంది.

నవంబర్ లో "#VT 10" షూటింగ్ పునః ప్రారంభం
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా , ప్రముఖ దర్శకుడు శ్రీను వైట్ల వద్ద దర్శకత్వ శాఖ లో పనిచేసిన కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో, అల్లు వెంకటేష్ , సిద్ధు ముద్ద నిర్మాణ సారథ్యంలో బాక్సింగ్ నేపథ్యం లో యాక్షన్ థ్రిల్లర్ "#VT 10" మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. బాక్సింగ్ లో ప్రత్యేక శిక్షణ తీసుకున్న వరుణ్ తేజ్ కు జోడీ గా బాలీవుడ్ మూవీ "దబంగ్ 3 " ఫేమ్ సాయీ మంజ్రేకర్ నటిస్తున్నారు. కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర , సునీల్ శెట్టి , జగపతి బాబు , నవీన్ చంద్ర , నదియా ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు.
వరుస చిత్రాలతో తీరిక లేకుండా ఉన్నా - పూజాహెగ్డే
స్టార్ హీరోలతో పాటు యంగ్ హీరోలతో కూడా జంటగా నటిస్తూ పూజాహెగ్డే పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను ఆకట్టుకుని సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా కొనసాగుతున్నారు. పూజాహెగ్డే ప్రస్తుతం "రాధేశ్యామ్ ", "మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ " మూవీస్ లో నటిస్తున్నారు. 6 నెలల తరువాత పూజాహెగ్డే "మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ " మూవీ షూటింగ్ లో పాల్గొన్నారు. పూజాహెగ్డే నటించిన బాలీవుడ్ మూవీ "హౌస్ ఫుల్ 4"ఘనవిజయం సాధించడంతో బాలీవుడ్ లో రెండు భారీ మూవీస్ కు హీరోయిన్ గా ఎంపిక అయ్యారు.

ప్రముఖ నటుడు వేణుగోపాల్ మృతి
వరుసగా జరిగిన సంఘటనలు చూస్తుంటే నిజంగానే ఈ 2020 మాత్రం సినీ పరిశ్రమకు పెద్ద శాపంగానే మారిపోయిందని చెప్పొచ్చు. ఒక పక్క కరోనా వల్ల ఇప్పటికే షూటింగ్ లు లేక ఎక్కడి వాళ్ళు అక్కడ సైలెంట్ అయిపోయారు. ఇప్పుడిప్పుడే షూటింగ్ లు మొదలు పెడుతున్నార్లెండి. ఆశ్ఛర్య కరమైన విషయం ఏంటంటే ఒక రకంగా సామాన్య ప్రజలంటే సెలబ్రిటీసే బయటకు రాకుండా ఇంట్లోనే వుంటూ జాగ్రత్తలు తీసుకున్నారు. అన్ని జాగ్రత్తలు తీసుకున్నా అదేం విచిత్రమో చాలా మంది సినీ సెలబ్రిటీస్ కరోనా బారిన పడ్డారు. ఇంకా చాలా మంది లెజెండ్రీ నటీనటులు కూడా ఈ 2020 లోనే కన్ను మూసారు.
రామ్ చరణ్ స్టన్నింగ్ లుక్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న "రౌద్రం రణం రుధిరం "మూవీ లో అల్లూరి సీతారామ రాజు గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ , రామ్ చరణ్ హీరోలుగా భారీ బడ్జెట్ తో రూపొందుతున్న "RRR" మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి హీరోగా రూపొందుతున్న "ఆచార్య " మూవీ లో రామ్ చరణ్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. "ఆచార్య " మూవీ షూటింగ్ త్వరలోనే పునః ప్రారంభం కానుంది.

ఇద్దరు సూపర్ స్టార్లు సేమ్ టు సేమ్
తెలుగు సినీ చరిత్రలో సూపర్ స్టార్ కృష్ణ చేసిన ప్రయోగాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమాల గురించి కాస్త పరిజ్ఞానం ఉన్న ఎవరికైనా తెలుస్తుంది. తెలుగు వెండి తెరపై కృష్ణ చేసిన ప్రయోగాలు మరే హీరో చేయలేదంటే అతిశయోక్తి కాదు. తెలుగులో మొదటి 70 ఎమ్ఎమ్ సినిమా... `మోసగాళ్లకు మోసగాడు` చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు కౌబాయ్‌ని పరిచయం చేశారు. ఇంకా జేమ్స్ బాండ్ చిత్రాలతో పాటు ఎన్నో ప్రయోగాత్మక చిత్రాలు చేసి రికార్డు సాధించారు.
పాన్ కేక్ తయారీ చెపుతున్న రష్మిక
లాక్ డౌన్ పుణ్యమా అని హీరోయిన్స్ అందరూ వంటింట్లో దూరి గరిట పట్టే అవకాశం దక్కింది. ఇప్పటికే పలువురు హీరోయిన్స్ పలు వంటలు చేసి వాటిని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు కూడా. ఇప్పుడు మరో భామ కూడా వంటింట్లో దూరి గరిటె పట్టుకుంది. ఆ హీరోయిన్ ఎవరో కాదు రష్మిక మందన్న.
'వకీల్ సాబ్' కూడా షురూ చేశాడు..!
గత ఐదారు నెలల నుండి ఎలాంటి షూటింగ్ లు లేక చిత్ర పరిశ్రమ వెల వెల బోయింది. ఇప్పుడిప్పుడే షూటింగ్ లు మొదలుపెడుతున్నారు. ఈ నేపథ్యంలో వకీల్ సాబ్ చిత్ర యూనిట్ కూడా షూటింగ్ ను మొదలు పెట్టింది. నిజానికి వకీల్ సాబ్ షూటింగ్ లాక్ డౌన్ ముందే చాలా వరకు షూటింగ్ ను పూర్తి చేసుకుంది. మే రిలీజ్ ప్లాన్ చేశారు. కానీ కరోనా వచ్చి మొత్తం మార్చేసింది. ఇక ఇప్పుడు కొద్దిరోజుల షూటింగ్ మాత్రమే మిగిలి ఉండగా..ప్రస్తుతం హైదరాబాదు పరిసరాల్లో ఈ సినిమా షూటింగ్ జరుపుతున్నారు. ఈ చిత్రీకరణలో కథానాయిక అంజలి, ఇతర నటీనటులు పాల్గొంటున్నట్టు తెలుస్తుంది. అయితే, పవన్ కల్యాణ్ మాత్రం వచ్చే నెలలో ఈ సినిమా షూటింగులో జాయిన్ అవుతారని…
టబు పాత్రకు తమన్నా బెస్ట్ ఛాయిస్
ఎన్నో వార్తలు.. ఎన్నో రూమర్స్ తర్వాత ఫైనల్లీ అందాదూన్ లో నటించే లీడ్ యాక్ట్రెస్ పై క్లారిటీ ఇచ్చారు చిత్ర యూనిట్. రాధికా ఆప్టే రోల్ లో ఏమో కానీ టబు పాత్రలో మాత్రం ఎవరు నటిస్తారో అన్నది మాత్రం అందరి క్యూరియాసిటీ. ఎందుకంటే పాత్రకున్న ప్రాముఖ్యత అలాంటిది. ఇక ఇన్ని రోజుల తర్వాత టబు పాత్రలో తమన్నా.. రాధికా ఆప్టే పాత్రలో నభా నటించనున్నారు.

మణిరత్నం "నవరస "వెబ్ సిరీస్ అప్ డేట్
లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం "నవరస "పేరుతో వెబ్ సిరీస్ రూపొందిస్తున్న విషయం తెలిసిందే. 9 ఎపిసోడ్స్ ఉన్న "నవరస " వెబ్ సిరీస్ లో ఒక ఎపిసోడ్ కు మణిరత్నం దర్శకత్వంవహిస్తుండగా మిగతా 8 ఎపిసోడ్స్ ను 8 మంది దర్శకులు తెరకెక్కించనున్నారు. గౌతమ్ మీనన్ , కె వి ఆనంద్ , కార్తీక్ నరేన్ , రతీంద్రన్ ప్రసాద్ , పొన్ రామ్ , బిజోయ్ నంబియార్ దర్శకులుగా ఎంపిక అయ్యారు. మిగతా 2 ఎపిసోడ్స్ కు హీరోలు సిద్ధార్ధ్ , అరవింద్ స్వామి దర్శకులుగా పరిచయం అవుతున్నారు.