నవంబర్ లో “#VT 10” షూటింగ్ పునః ప్రారంభం

VT 10 Movie To Get Back To Sets From November.

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా , ప్రముఖ దర్శకుడు శ్రీను వైట్ల వద్ద దర్శకత్వ శాఖ లో పనిచేసిన కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో, అల్లు వెంకటేష్ , సిద్ధు ముద్ద నిర్మాణ సారథ్యంలో బాక్సింగ్ నేపథ్యం లో యాక్షన్ థ్రిల్లర్ “#VT 10” మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. బాక్సింగ్ లో ప్రత్యేక శిక్షణ తీసుకున్న వరుణ్ తేజ్ కు జోడీ గా బాలీవుడ్ మూవీ “దబంగ్ 3 ” ఫేమ్ సాయీ మంజ్రేకర్ నటిస్తున్నారు. కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర , సునీల్ శెట్టి , జగపతి బాబు , నవీన్ చంద్ర , నదియా ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“#VT 10” మూవీ కి థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. వైజాగ్ లో 15 రోజులు షూటింగ్ జరుపుకున్న “#VT 10” మూవీ కరోనా కారణం గా షూటింగ్ నిలిచిపోయింది. ఇప్పుడు “#VT 10” మూవీ షూటింగ్ నవంబర్ మొదటి వారంలో హైదరాబాద్ లో పునః ప్రారంభం కానుంది. నవంబర్ నుండి మార్చి నెల వరకూ షూటింగ్ షెడ్యూల్స్ ను చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది. సూపర్ హిట్ “గద్దల కొండ గణేష్ ” మూవీ తరువాత హీరో వరుణ్ తేజ్ నటించే “#VT 10” మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.