ప్రముఖ నటుడు వేణుగోపాల్‌ మృతి

Noted Actor Kosuri Venu Gopal Passes Away

వరుసగా జరిగిన సంఘటనలు చూస్తుంటే నిజంగానే ఈ 2020 మాత్రం సినీ పరిశ్రమకు పెద్ద శాపంగానే మారిపోయిందని చెప్పొచ్చు. ఒక పక్క కరోనా వల్ల ఇప్పటికే షూటింగ్ లు లేక ఎక్కడి వాళ్ళు అక్కడ సైలెంట్ అయిపోయారు. ఇప్పుడిప్పుడే షూటింగ్ లు మొదలు పెడుతున్నార్లెండి. ఆశ్ఛర్య కరమైన విషయం ఏంటంటే ఒక రకంగా సామాన్య ప్రజలంటే సెలబ్రిటీసే బయటకు రాకుండా ఇంట్లోనే వుంటూ జాగ్రత్తలు తీసుకున్నారు. అన్ని జాగ్రత్తలు తీసుకున్నా అదేం విచిత్రమో చాలా మంది సినీ సెలబ్రిటీస్ కరోనా బారిన పడ్డారు. ఇంకా చాలా మంది లెజెండ్రీ నటీనటులు కూడా ఈ 2020 లోనే కన్ను మూసారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇప్పుడు మరో నటుడిని బలిగొంది కరోనా. ఎన్నో సినిమాల్లో కమెడియన్‌గా నటించిన కోసూరి వేణుగోపాల్ కరోనా కారణంగా కన్నుమూశారు. కరోనాతో గత కొద్దిరోజులుగా గచ్చిబౌలిలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో చికిత్స తీసుకుంటున్నారు వేణుగోపాల్. అయితే ఇటీవలే మళ్లీ కరోనా పరీక్షలు నిర్వహించగా నెగిటివ్ వచ్చినా.. ఆయన అనారోగ్యం నుంచి కోలుకోలేకపోయారు. దీనితో ఆరోగ్యం విషమించి నిన్న రాత్రి కన్నుమూశారు. వేణుగోపాల్ మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. టాలీవుడ్ మంచి నటుడిని కోల్పోయిందంటూ అనేక మంది తమ సంతాపం ప్రకటించారు.

కాగా పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురానికి చెందిన వేణుగోపాల్‌ ఎఫ్‌సీఐలో మేనేజర్‌గా పనిచేసి రిటైర్ అయ్యారు. ఉద్యోగం చేస్తూనే సినిమాల్లో నటించేవారు. మర్యాద రామన్న, విక్రమార్కుడు, ఛలో, పిల్ల జమిందార్‌ తదితర సినిమాలతో పాటు పలు సీరియళ్లలోనూ కనిపించారు. ఆఖరుగా మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో వచ్చిన అమీతుమీ సినిమాలో కనిపించారు వేణుగోపాల్.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.