గత ఐదారు నెలల నుండి ఎలాంటి షూటింగ్ లు లేక చిత్ర పరిశ్రమ వెల వెల బోయింది. ఇప్పుడిప్పుడే షూటింగ్ లు మొదలుపెడుతున్నారు. ఈ నేపథ్యంలో వకీల్ సాబ్ చిత్ర యూనిట్ కూడా షూటింగ్ ను మొదలు పెట్టింది. నిజానికి వకీల్ సాబ్ షూటింగ్ లాక్ డౌన్ ముందే చాలా వరకు షూటింగ్ ను పూర్తి చేసుకుంది. మే రిలీజ్ ప్లాన్ చేశారు. కానీ కరోనా వచ్చి మొత్తం మార్చేసింది. ఇక ఇప్పుడు కొద్దిరోజుల షూటింగ్ మాత్రమే మిగిలి ఉండగా..ప్రస్తుతం హైదరాబాదు పరిసరాల్లో ఈ సినిమా షూటింగ్ జరుపుతున్నారు. ఈ చిత్రీకరణలో కథానాయిక అంజలి, ఇతర నటీనటులు పాల్గొంటున్నట్టు తెలుస్తుంది. అయితే, పవన్ కల్యాణ్ మాత్రం వచ్చే నెలలో ఈ సినిమా షూటింగులో జాయిన్ అవుతారని అంటున్నారు. శ్రుతిహాసన్, నివేద థామస్ లు కూడా అప్పుడే షూటింగులో పాల్గొంటారని తెలుస్తోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో హిందీ సూపర్ హిట్ మూవీ పింక్ రీమేక్ ను తెలుగులో ‘వకీల్ సాబ్’ గా చేస్తున్నసంగతి తెలిసిందే కదా. బోనీ కపూర్ నిర్మాణ సంస్థ బేవ్యూ ప్రాజెక్ట్స్‌తో కలిసి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ‘దిల్’ రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: