అతి తక్కువ కాలంలో విజయ్ దేవరకొండ యూత్ ఐకాన్ గా ఎదిగాడు. భయపడకుండా తను మాట్లాడే మాటలు.. చేతలతో తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సృష్టించుకుని యూత్‌లో మాంచి ఫాలోయింగ్ సంపాదించాడు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరోగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ‘ఫైటర్’ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. పూరి కనెక్ట్స్ , ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెలుగు, హిందీ భాషలలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. సీనియర్ హీరోయిన్ రమ్య కృష్ణ ఒక కీలక పాత్రలో నటిస్తున్న ఈ మూవీ కి మణిశర్మ సంగీతం అందించనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఈ రోజు విజయ్ దేవరకొండ తల్లి మాధవి దేవరకొండ 50వ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన ట్విట్టర్ ద్వారా ఓ వీడియోను షేర్ చేశారు. ఈ వీడియోలో మాధవి దేవరకొండ క్రికెట్ బ్యాట్ పట్టుకుని షాట్ కొడుతుండగా.. పక్కన తన కుమారులు.. విజయ్, ఆనంద్‌లు కూడా షాట్ కొడుతున్నట్లుగా పోజిచ్చారు. అనంతరం మాధవి దేవరకొండ 50 కొట్టినట్లుగా బ్యాట్‌ని పైకి ఎత్తడంతో విజయ్, ఆనంద్ క్లాప్స్ కొట్టారు. ఈ వీడియో షేర్ చేసిన విజయ్ దేవరకొండ.. తన మదర్‌ని ఎప్పటికీ సంతోషంగా ఉంచుతానని చెబుతూ ప్రామిస్ చేశారు.
I’ll make sure you are happy forever 🤗❤️ Happy Birthday Mumma! pic.twitter.com/YhbWqrE3b5
— Vijay Deverakonda (@TheDeverakonda) September 24, 2020




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: