ఇద్దరు సూపర్ స్టార్లు సేమ్ టు సేమ్

When Two Superstars Come Together In One Frame

తెలుగు సినీ చరిత్రలో సూపర్ స్టార్ కృష్ణ చేసిన ప్రయోగాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమాల గురించి కాస్త పరిజ్ఞానం ఉన్న ఎవరికైనా తెలుస్తుంది. తెలుగు వెండి తెరపై కృష్ణ చేసిన ప్రయోగాలు మరే హీరో చేయలేదంటే అతిశయోక్తి కాదు. తెలుగులో మొదటి 70 ఎమ్‌ఎమ్‌ సినిమా… `మోసగాళ్లకు మోసగాడు` చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు కౌబాయ్‌ని ప‌రిచ‌యం చేశారు. ఇంకా జేమ్స్‌ బాండ్‌ చిత్రాలతో పాటు ఎన్నో ప్రయోగాత్మక చిత్రాలు చేసి రికార్డు సాధించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక తండ్రికి తగ్గ కొడుకే సూపర్ స్టార్ మహేష్ కూడా. కృష్ణ మాదిరిగానే మహేష్ కూడా ఎప్పుడూ కొత్త కొత్త ప్రయోగాలు చేయడానికి ముందుంటారు. ఒక్కోసారి అవి మంచి ఫలితాలను అందించలేకపోవచ్చు ఇప్పుడున్న హీరోల్లో ప్రయాగాలు ఎవరు చేస్తారు అంటే మాత్రం మహేష్ పేరే ముందు వినిపిస్తుంది. అందుకు పైన ఫొటోనే ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఫొటోలో మహేష్, కృష్ణ ఇద్దరూ సిట్టింగ్ పొజిషన్ ఒకేలా ఉంది. దీన్నిబట్టి చెప్పొచ్చు ఇద్దరూ సూపర్ స్టార్లు ఒకటే అని. ఇక ఈ ఫొటో మహేష్ సతీమణి నమ్రత గతంలో సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

ఇక రాజకుమారుడు సినిమాతో వెండితెరపై అరంగేట్రం చేశారు. ఈ 21 ఏళ్లలో ఎన్నో జయాపజయాలను చవిచూశారు. మురారి, అతడు, ఒక్కడు, పోకిరి, దూకుడు, బిజినెస్ మాన్, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, శ్రీమంతుడు, భరత్ అనే నేను, మహర్షి, రీసెంట్ గా సరిలేరు నీకెవ్వరు లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ లభించాయి.

ప్రస్తుతం మహేష్ తన తర్వాత సినిమా పరుశురాం తో చేస్తున్న సంగతి తెలిసిందే. సూపర్ స్టార్ మహేష్ బాబు ఎంట‌ర్‌టైన్‌మెంట్, 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, మైత్రీ మూవీ మేకర్స్ లు కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. త్వరలోనే షూటింగ్ ను ప్రారంభించనున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × two =