“శ్రీ మహాలక్ష్మి ” మూవీ తో తెలుగు తెరకు పరిచయం అయిన పూర్ణ “సీమ టపాకాయ్ “, “అవును “, “రాజుగారి గది “, “అవును 2 “వంటి మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. తెలుగు తో పాటు తమిళ , కన్నడ , మలయాళ మూవీస్ లో పూర్ణ నటించారు. పూర్ణ ప్రస్తుతం 100 (కన్నడ ), “తలైవి “(తెలుగు , తమిళ , హిందీ ), ఒక మలయాళ మూవీ లో నటిస్తున్నారు. గ్లామర్ రోల్స్ లో నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న పూర్ణ ఇప్పుడు ఒక తెలుగు మూవీ లో నెగటివ్ రోల్ లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
వనమాలి క్రియేషన్స్ బ్యానర్ పై విజయ్ కుమార్ కొండా దర్శకత్వంలో రాజ్ తరుణ్ హీరోగా రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ షూటింగ్ ప్రారంభం అయిన విషయం తెలిసిందే. ఈ మూవీ లో పూర్ణ ఒక కీలక పాత్రకు ఎంపిక అయ్యారు. హీరోయిన్ పూర్ణ నెగటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లో నటించి ప్రేక్షకులను అలరించనున్నారు. దర్శకుడు విజయ్ కుమార్ కొండా , హీరో రాజ్ తరుణ్ కాంబినేషన్ లో రూపొందిన రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ “ఒరేయ్ బుజ్జిగా ” మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: