ప్రస్తుతం అడివి శేష్ మేజర్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. వాస్తవ ఘటనల ఆధారంగా.. 26/11 ముంబై దాడుల్లో అమరుడైన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో శేష్ రెండు భిన్నమైన లుక్స్ లో కనిపిస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే ఈ సినిమా సగం పైగా షూటింగ్ ను పూర్తి చేసుకున్నట్టు తెలుస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తాజాగా ఈ సినిమాలో హీరోయిన్ ను ఫిక్స్ చేశారు. `దబాంగ్ 3` బ్యూటీ సయీ మంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు. ఈమె ప్రముఖ నటుడు, దర్శకుడు మహేష్ మంజ్రేకర్ కుమార్తె.
Happy to welcome the talented & ravishing @saieemmanjrekar to @MajorTheFilm An amazing role with intensity & innocence in equal measure. She joins the film Late Oct. #MajorTheFilm@SonyPicsIndia @GMBents @urstrulyMahesh @AplusSMovies @SashiTikka @sobhitaD pic.twitter.com/bcS1SifylL
— Adivi Sesh (@AdiviSesh) September 24, 2020
కాగా మహేష్ హోమ్ బేనర్ జీఎంబీ ప్రొడక్షన్స్ సోనీ పిక్చర్స్‌తో కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇంకా `గూఢచారి` హీరోయిన్ శోభిత ధూళిపాళ మరో ముఖ్య పాత్రలో కనిపించనుంది. ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీలో కూడా రిలీజ్ చేయాలని చూస్తున్నారు. విభిన్న కథలను ఎంచుకుంటూ వరుస విజయాలను అందుకుంటూ కెరీర్ లో దూసుకుపోతున్నాడు అడివి శేష్. ఇక ఇటీవల ‘ఎవరు’ సినిమాతో కూడా మంచి హిట్ కొట్టి ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. మరి ఈ సినిమాతో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకుంటాడేమో చూద్దాం.



[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: