
ట్యాగ్ · 4140 కథనాలు · పేజీ 50

నితిన్ 'రంగ్ దే' షూటింగ్ కూడా షురూ
సమంత లేటెస్ట్ వర్కౌట్
మైలురాయి లాంటి సినిమా ఇచ్చిన మహేష్ కు థ్యాంక్స్
అభిమానులతో రష్మిక చిట్ చాట్
'V' టీమ్ రౌండ్ టేబుల్ డిస్కషన్
ఆయనతో సినిమా అంటే ఎగిరి గంతేశా
నో డౌట్.. థియేటర్ లోనే 'విరాట పర్వం'

9 వసంతాల "దూకుడు"

డైరెక్టర్ మణి"రత్నం" గీతాంజలి
విరాట పర్వం నటికి కరోనా పాజిటివ్
క్రిష్ 'అంతర్వాహిని' - పవన్ సినిమా టైటిలా..?

3 సంవత్సరాలు పూర్తి చేసుకున్న "జై లవకుశ "
బ్యాక్ టు వర్క్ - మళ్లీ అడవుల్లోకి రకుల్
స్పోర్ట్స్ నేపథ్య మూవీ లో నాగచైతన్య
శుభ్రత మంచిదే - మెహరీన్
లావణ్య త్రిపాఠి బిజీ లైఫ్

‘బ్లాక్ రోజ్’ ఫస్ట్‌లుక్ రిలీజ్
బాలీవుడ్ అందాల తార ఊర్వశి రౌటేలా టాలీవుడ్ లోకి 'బ్లాక్ రోస్' అనే సినిమాతో ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. మోహన్ భరద్వాజ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమాలో ఊర్వశి రౌటేలా లీడ్ రోల్ లో నటిస్తోంది. ఇక ఈ సినిమా షూటింగ్ కూడా మొదలు పెట్టేసారు.గత నెలలో సెట్స్ పైకి వెళ్లిన ఈ సినిమా నిర్విరామంగా షూటింగ్ జరుపుకుంటుంది. కరోనా నేపథ్యంలో అన్ని జాగ్రత్తలూ తీసుకుంటూ షూటింగ్ చేస్తోంది చిత్ర యూనిట్. ఒకే షెడ్యూల్‌లో షూటింగ్ పూర్తి చేయాలని భావిస్తోంది. ఇదిలా ఉండగా ఈ రోజు ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. సంపత్ నంది తన ట్విట్టర్ లో ఫస్ట్ లుక్ పోస్టర్ ను పోస్ట్ చేసాడు.
నితిన్ 'రంగ్ దే' షూటింగ్ కూడా షురూ
మొత్తానికి టాలీవుడ్ కు ఇప్పుడిప్పుడే పాత రోజులు వస్తున్నాయి. షూటింగ్‌లను స్టార్ట్ చేసి మళ్లీ కళకళాడుతోంది టాలీవుడ్. షూటింగ్ బ్యాలెన్స్ ఉండటంతో చకచకా వచ్చి పూర్తి చేసుకుందామనే ఆలోచనలో పడ్డాయి. దీనిలో భాగంగానే ఇప్పటికే పలువురు యంగ్ హీరోలు షూటింగ్ ను మొదలు పెట్టారు...షూటింగ్ ను పూర్తి చేసుకున్నారు కూడా. మరికొంతమంది ఇప్పుడిప్పుడే షూటింగ్ లను మొదలుపెడుతున్నారు.
సమంత లేటెస్ట్ వర్కౌట్
తెలుగు , తమిళ భాషల మూవీస్ లో తన అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుని సమంత స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ సమంత ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ తన జీవిత విశేషాలను అభిమానులతో పంచుకుంటున్నారు. వర్కౌట్స్ , యోగా , మెడిటేషన్ , సూర్య నమస్కారాలు , గార్డెనింగ్ వంటి వాటితో సమంత అభిమానులను ఇన్ స్పైర్ చేస్తున్నారు. "రంగస్థలం ", "ఓ బేబీ " వంటి సూపర్ హిట్ మూవీస్ తో అలరించిన సమంత "ది ఫ్యామిలీ మెన్ 2" వెబ్ సిరీస్ లో నటించారు. ఒక తమిళ మూవీ కి సమంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
మైలురాయి లాంటి సినిమా ఇచ్చిన మహేష్ కు థ్యాంక్స్
సూపర్ స్టార్ మహేష్ బాబు సినీ కెరీర్ లో ఫుల్ కామెడీ చేసిన సినిమాలు అంటే వేళ్ళ మీద లెక్కేసి చెప్పొచ్చు. కామెడీ చేసినా ఒకే ఒక పంచ్ డైలాగ్ తో కామెడీ చేయడం మహేష్ కు అలవాటు. అలాంటి మహేష్ కెరీర్ లో దూకుడు సినిమా మాత్రం తనలోని కామెడీ యాంగిల్ ను బయటకు తీసుకొచ్చింది అని చెప్పొచ్చు. డైరెక్టర్ శ్రీను వైట్ల మహేష్ ను కొత్త యాంగిల్ లో చూపించడమే కాదు.. మహేష్ కామెడీ చేస్తే ఈ రేంజ్ లో ఉంటుందా అని అభిమానులకు ... సినీ ప్రేక్షకులకు చూపించాడు.
అభిమానులతో రష్మిక చిట్ చాట్
తెలుగు , కన్నడ సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా కొనసాగుతున్న రష్మిక సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. రష్మిక ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న "పుష్ప "మూవీ లో హీరో అల్లు అర్జున్ కు జోడీగా నటిస్తున్నారు. "సుల్తాన్ " మూవీ తో రష్మిక కోలీవుడ్ లో అడుగు పెడుతున్నారు. రష్మిక తాజా గా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటించారు.
'V' టీమ్ రౌండ్ టేబుల్ డిస్కషన్
ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో వచ్చిన ‘వి’ సినిమా సెప్టెంబర్ 5న అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన సంగతి తెలిసిందే. మంచి కథతో పాటు.. యాక్షన్ సీక్వెన్స్ ను మంచిగా బ్యాలన్స్ చేసిన సినిమా ఇది అని చెప్పొచ్చు. ఇక ఈ సినిమాకు మంచి ప్రశంసలు దక్కిన సంగతి కూడా విదితమే. నాని 25 సినిమా కావడం అందులో నెగిటివ్ షేడ్ అవ్వడంతో సినిమాపై అంచనాలు బానే ఉన్నాయి. ఆ అంచనాలను కూడా సినిమా రీచ్ అయిందనే చెప్పొచ్చు. ఇక సినిమాలో సిన్సియర్ పోలీస్ ఆఫీసర్‌గా సుధీర్ నటన చాలా బావుంది. ఇక లుక్ పరంగా సుధీర్ పడ్డ కష్టాన్ని డైరెక్టర్ తొలి ఫైట్‌తో తెరపై ఆవిష్కరించాడుఇంద్రగంటి. ఇక సినిమాలో నాని లవర్ అదితి రావు హైదరి.. సుధీర్…
ఆయనతో సినిమా అంటే ఎగిరి గంతేశా
సినీ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇవ్వడం ఇచ్చిన తర్వాత ఒక ప్లేస్ ను సొంతం చేసుకోవడం కష్టం. ఒకసారి మంచి నటిగా పేరు వచ్చిన తర్వాత అవకాశాలు అవే వచ్చేస్తాయి. ఇక టాప్ పొజిషన్ కు చేరుకున్న తర్వాత స్టార్ హీరోలు సరసన నటించాలని అనుకుంటారు. ఇంకా దిగ్గజాలు కమల్, రజినీతో కలసి నటించడం అంటే అంత కంటే అదృష్టం లేదు అని భావిస్తారు. కానీ అలాంటి అరుదైన అవకాశాలను అందుకున్న వారిలో యువ కథానాయిక నివేదా థామస్ కు చాలా తొందరగానే వచ్చిందని చెప్పొచ్చు. ఐదేళ్ళ గ్యాప్ లో ఈ ఇద్దరితోనూ స్క్రీన్ షేర్ చేసుకుంది నివేదా. యాదృచ్చికం ఏంటంటే రెండు సినిమాల్లోనూ కూతురిగా నటించే అవకాశం దక్కడం గమనార్హం.
నో డౌట్.. థియేటర్ లోనే 'విరాట పర్వం'
థియేటర్స్ లేకపోవడంతో చిన్నగా ఓటీటీ వైపు మొగ్గు చూపుతున్నారు దర్శకనిర్మాతలు. పెద్ద సినిమాలు అంటే ఎలాగూ థియేటర్ లోనే రిలీజ్ కావాలి.. ఉదాహరణకి ఒక ఆర్ఆర్ఆర్, ఒక కె.జి.యఫ్ లాంటి సినిమాల కోసం ప్రేక్షకులు ఎన్ని రోజులైనా వెయిట్ చేస్తారు. థియేటర్స్ ఓపెన్ అయ్యేంత వరకూ వెయిట్ చేస్తారు.. అసలు ఆసినిమాలు ఓటీటీ రిలీజ్ చేస్తామన్నా ముందు ప్రేక్షకులే ఒప్పుకోరు. కానీ చిన్న సినిమాలు .. ఒక మోస్తరు బడ్జెట్ సినిమాల పరిస్థితి వేరు. అందుకే చిన్న సినిమాలు అయితే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఓటీటీ రిలీజ్ అయిపోతున్నాయి. ఇప్పుడిప్పుడే కాస్త పెద్ద సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. పెంగ్విన్ అయింది.. ఇటీవల 'వి' సినిమా అయింది…

9 వసంతాల "దూకుడు"
14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై శ్రీను వైట్ల దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు , సమంత జంటగా రూపొందిన కామెడీ , యాక్షన్ ఎంటర్ టైనర్ "దూకుడు " మూవీ 2011 సంవత్సరం సెప్టెంబర్ 23 వ తేదీ ప్రపంచ వ్యాప్తంగా 1600 స్క్రీన్స్ లో రిలీజ్ అయ్యి రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. విశేష ప్రేక్షకాదరణ పొందిన "దూకుడు " మూవీ 7 నంది , 6 ఫిల్మ్ ఫేర్ , 8 సైమా , 8 సినీ మా అవార్డ్స్ అందుకుని రికార్డ్ క్రియేట్ చేసింది. థమన్ ఎస్ స్వరకల్పనలో సాంగ్స్ ప్రేక్షకులను అలరించాయి.

డైరెక్టర్ మణి"రత్నం" గీతాంజలి
సి ఎల్ నరసారెడ్డి సమర్పణ లో భాగ్యలక్ష్మి ఎంటర్ ప్రైజెస్ బ్యానర్ పై మణిరత్నం దర్శకత్వంలో అక్కినేని నాగార్జున హీరోగా రూపొందిన రొమాంటిక్ ఎంటర్ టైనర్ "గీతాంజలి " మూవీ ఘనవిజయం సాధించింది. గిరిజ కథానాయిక. ఇళయరాజా స్వరకల్పనలో సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. బెస్ట్ డైరెక్టర్ గా మణిరత్నం ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకున్నారు. "గీతాంజలి " మూవీ వివిధ విభాగాలలో 6 నంది అవార్డ్స్ అందుకుంది.
విరాట పర్వం నటికి కరోనా పాజిటివ్
‘నీది నాది ఒకే కథ’ ఫేమ్ వేణు ఊడుగుల దర్శకత్వంలో రానా, సాయిపల్లవి కాంబినేషన్లో విరాటపర్వం 1992 అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో రానా పొలిటికల్ లీడర్ గా.. సాయి పల్లవి నక్సలైట్ గా కనిపించనున్న సంగతి కూడా విదితమే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. అయితే కరోనా వల్ల ఇన్ని రోజులు షూటింగ్ కు బ్రేక్ పడింది.
క్రిష్ 'అంతర్వాహిని' - పవన్ సినిమా టైటిలా..?
పవర్ స్టార్ తన 27వ సినిమాగా క్రిష్ దర్శకత్వంలో పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో మూవీ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ కొద్దిరోజులు జరుపుకోగా కరోనా వలన షూట్ కు బ్రేక్ పడింది. త్వరలో మళ్లీ షూటింగ్ ను తిరిగి ప్రారంభించాలనుకుంటున్నారు. ఇటీవలే పవన్ బర్త్‌డే సందర్భంగా పవన్ ప్రీ లుక్ విడుదల చేశారు దర్శకుడు క్రిష్. 'వకీల్‌సాబ్' షూటింగ్ పూర్తి కాగానే పవన్, క్రిష్ కాంబినేషన్‌లో సినిమా స్టార్ట్ అవుతుంది.
‘ఒరేయ్ బుజ్జిగా` కృష్ణవేణి వీడియో సాంగ్ రిలీజ్
విజయ్‌కుమార్ దర్శకత్వంలో యంగ్ హీరో రాజ్ తరుణ్ కథానాయకుడిగా 'ఒరేయ్.. బుజ్జిగా' సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. నిజానికి ఈ సినిమా మార్చి లోనే రిలీజ్ కావాల్సి ఉంది కానీ కరోనా వల్ల ఆగిపోయిన సంగతి తెలిసిందే. ఇక థియేటర్స్ కూడా ఇప్పుడప్పుడే తెరుచుకునే పరిస్థితి లేదు కాబట్టి ఓటీటీ లో రిలీజ్ చేస్తున్నారు. ఆహా లో అక్టోబర్ 2వ తేదీన ఈ సినిమా రిలీజ్ కానుంది. శ్రీమతి లక్ష్మీ రాధామోహన్ సమర్పణలో శ్రీసత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కె.కె.రాధామోహన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

3 సంవత్సరాలు పూర్తి చేసుకున్న "జై లవకుశ "
వరస బ్లాక్ బస్టర్ మూవీస్ లో తనదైన స్టైల్ ఆఫ్ యాక్టింగ్ తో ప్రేక్షక , అభిమానులను అలరిస్తూ జూనియర్ ఎన్టీఆర్ టాలీవుడ్ లో స్టార్ హీరోగా కొనసాగుతున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ డ్యాన్స్ లు , ఫైట్స్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కె ఎస్ రవీంద్ర దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ "జై లవకుశ " మూవీ 2017 సంవత్సరం సెప్టెంబర్ 21 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. రాశీఖన్నా , నివేద థామస్ కథానాయికలు కాగా స్టార్ హీరోయిన్ తమన్నా ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు.
బ్యాక్ టు వర్క్ - మళ్లీ అడవుల్లోకి రకుల్
రకుల్ ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. మెగా హీరో వైష్ణవ్ తేజ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ కూడా వెంటనే మొదలైపోయింది. సింగల్ షెడ్యూల్ లోనే ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేయాలని ప్లాన్ చేశారు. ప్లాన్ ప్రకారమే గత కొద్దిరోజులుగా వికారాబాద్ అడవుల్లో షూటింగ్ ను మొదలు పెట్టారు. ఇక ఈ సినిమాలో ఒక పల్లెటూరి అమ్మాయిలా రకుల్ నటిస్తున్నట్టు ఇటీవలే బయటకు వచ్చిన ఫొటోలను బట్టి అర్థమవుతూనే వుంది.
స్పోర్ట్స్ నేపథ్య మూవీ లో నాగచైతన్య
హీరో నాగచైతన్య ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతున్న రొమాంటిక్ ఎంటర్ టైనర్ "లవ్ స్టోరీ " మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. "లవ్ స్టోరీ " మూవీ తరువాత హీరో నాగచైతన్య విక్రమ్ K కుమార్ దర్శకత్వంలో "థ్యాంక్యూ " మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ మూవీ త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళనుంది.
శుభ్రత మంచిదే - మెహరీన్
సక్సెస్ ఫుల్ "కృష్ణ గాడి వీర ప్రేమ గాథ " మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన మెహరీన్ "మహానుభావుడు ", "రాజా ది గ్రేట్ ", "F 2" వంటి సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. తెలుగు లోనే కాకుండా తమిళ , హిందీ , పంజాబీ భాషల చిత్రాలలో నటించిన మెహరీన్ తనకు సంబంధించిన ఒక కొత్త విషయాన్ని వెల్లడించారు.
"మహాసముద్రం " మూవీ లో హీరోయిన్ ప్రియాంక అరుళ్ మోహన్
సూపర్ హిట్ "RX 100 " మూవీ తో టాలీవుడ్ కు దర్శకుడిగా పరిచయం అయిన అజయ్ భూపతి ఆ మూవీ ని అద్భుతంగా తెరకెక్కించి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. ఆ మూవీ తరువాత అజయ్ భూపతి ఒక యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీ "మహాసముద్రం " ను రూపొందించనున్నారు. ఏ కె ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై శర్వానంద్ హీరోగా "మహాసముద్రం " మూవీ రూపొందనుంది . ఈ మూవీ లో హీరో సిద్ధార్ధ్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు.
అజిత్ ఫ్యాన్స్ కు ఇదే నా ప్రామిస్ అంటున్న కార్తికేయ
కౌశిక్ పెగళ్లపాటి దర్శకుడిగా పరిచయమవుతూ కార్తికేయ, లక్కీ బ్యూటీ లావణ్య త్రిపాఠి జంటగా నటిస్తోన్న చిత్రం ‘చావుకబురు చల్లగా’. ఈ చిత్రం ద్వారా. ఇక ఈ సినిమాలో కార్తికేయ బస్తీ బాలరాజు పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ బ్యానర్‌పై బన్నీవాస్ నిర్మిస్తున్నారు. కార్తికేయ పుట్టినరోజు సందర్భంగా చిత్ర నిర్మాణ సంస్థ ‘చావుకబురు చల్లగా’ నుండి బస్తీ బాలరాజు పాత్రను పరిచయం చేస్తూ చిన్న వీడియో ను విడుదల చేసారు. ఈ టీజర్ ఇప్పుడు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. టీజర్‌లో కార్తికేయ గెటప్, డైలాగ్ డెలివరి మాడ్యూలేషన్స్ కు మంచి ప్రశంసలు దక్కుతున్నాయి.
లావణ్య త్రిపాఠి బిజీ లైఫ్
హీరోయిన్ లావణ్య త్రిపాఠి పలు సూపర్ హిట్ మూవీస్ లో తన అందం , అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుని సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా కొనసాగుతున్నారు. లావణ్య ప్రస్తుతం "A1 ఎక్స్ ప్రెస్ ", చావు కబురు చల్లగా " మూవీస్ లో కథానాయిక గా నటిస్తున్నారు. స్పోర్ట్స్ డ్రామా "A1 ఎక్స్ ప్రెస్ " మూవీ లో లావణ్య హాకీ ప్లేయర్ గా నటిస్తున్నారు. ఆ పాత్రకై లావణ్య హాకీ గేమ్ లో శిక్షణ పొందుతున్నారు.