కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Telugu Film News 2020

ట్యాగ్ · 4140 కథనాలు · పేజీ 48

సినిమా వార్తలు

త్వరలో "రంగ్ దే ! సెట్స్ లో కీర్తి సురేష్

సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై వెంకీ అట్లూరి దర్శకత్వంలో నితిన్ , కీర్తి సురేష్ జంటగా రొమాంటిక్ ఎంటర్ టైనర్ "రంగ్ దే !" మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. నరేష్ , రోహిణి , వినీత్ , వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. లెజెండరీ సినిమాటోగ్రాఫర్ పి సి శ్రీరామ్ ఈ మూవీ కి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

బాలుకు నయన్ నివాళి..నమ్మడానికి కష్టంగా ఉంది

తెలుగు సినీ ప్రేక్షకులను తన గాత్రంతో ఆరు దశాబ్దాలుగా అలరిస్తూ.. గాయ‌కుడిగా ఎన్నో శిఖ‌రాల‌ని అధిరోహించిన గాన గంధ‌ర్వుడు ఎస్పీ బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం తిరిగి రాని లోకాల‌కు వెళ్ళారు. ఆయన సినీ ప్రయాణంలో తెలుగు, మ‌ల‌యాళ‌, త‌మిళం ఇలా దాదాపు 16 భాషలల్లో 45 వేలకు పైగా పాట‌లు పాడి బాలు లాంటి మరొక సింగర్ లేరు ఇకపై రారు అనేంత స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. మరి ఏ హీరోకు తగినట్టు ఆ హీరోకు పాటలు పాడటం.. పాటలో మాడ్యులేషన్స్.. హీరోనే ఆ పాట పాడుతున్నాడా అనేలా ఉండటం.. ఇలా ఒకటేమిటి బాలును గాన గంధర్వుడిగా చేసిన క్వాలిటీస్ ఎన్నో. అలాంటి గాయకుడు ఇప్పుడు మన మధ్య లేరనే వార్త సినీ ఇండస్ట్రీస్ ను మాత్రమే కాదు ప్రతి…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

మరోసారి పొలిటీషియన్ పాత్రలో హీరో సూర్య

తమిళ స్టార్ హీరో సూర్యకు తమిళ భాషలోనే కాకుండా తెలుగు భాషలో కూడా అభిమానగణం ఎక్కువే. సూర్య హీరోగా తమిళ భాషలో రూపొందిన మూవీస్ తెలుగు భాషలో డబ్బింగ్ వెర్షన్స్ రిలీజ్ అయ్యి ప్రేక్షకులను అలరిస్తున్నాయి. 2D ఎంటర్ టైన్ మెంట్స్ , సిఖ్య ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై సుధ కొంగర దర్శకత్వంలో సూర్య హీరోగా రూపొందిన యాక్షన్ డ్రామా "సూరరై పోట్రు " తమిళ మూవీ , తెలుగు డబ్బింగ్ వెర్షన్ "ఆకాశమే నీ హద్దురా " మూవీస్ అమెజాన్ ప్రైమ్ వీడియో లోఅక్టోబర్ 30 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది.

Team TFNవాట్సాప్
షూటింగ్ అప్‌డేట్

"ది ఫ్యామిలీ మెన్ సీజన్ 2" షూటింగ్ పూర్తి

రాజ్ నిడిమోరు , కృష్ణ డి.కే దర్శకత్వంలో మనోజ్ బాజ్ పాయ్ , ప్రియమణి , సందీప్ కిషన్ , గుల్ పనాగ్ ప్రధాన పాత్రలలో 10 ఎపిసోడ్స్ గా రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ "ది ఫ్యామిలీ మెన్ సీజన్ 1" వెబ్ సిరీస్ 2019 సంవత్సరం సెప్టెంబర్ 20 వ తేదీ అమెజాన్ ప్రైమ్ వీడియో లో ప్రసారం అయ్యి ఘనవిజయం సాధించి, ప్రేక్షకులను ఆకట్టుకుంది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

ప్రభుత్వ లాంఛనాలతో బాలు అంత్య‌క్రియ‌లు పూర్తి

క‌రోనా కార‌ణంగా ఎంజీఎం ఆసుప‌త్రిలో చేరిన బాలు చికిత్స పొందుతూ క‌న్నుమూసిన సంగతి తెలిసిందే. ఇక బాలు మరణంతో సినీ పరిశ్రమ ఒక్కసారిగా విషాదంలో మునిగిపోయింది. ప్రతి ఒక్కరూ బాలుతో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ కన్నీటి పర్యంతమవుతున్నారు. బాలు మరణంతో ఒక శకం ముగిసిందని... గాంధర్వ లోకానికి వెళ్లారని.. భారతీయ సంగీతం తన ముద్దు బిడ్డను కోల్పోయిందని అందరూ గుర్తుచేసుకుంటున్నారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

నివేత పేతురాజ్ గిటార్ స్కిల్స్

సక్సెస్ ఫుల్ "మెంటల్ మదిలో " మూవీ తో తమిళ యాక్ట్రెస్ నివేత పేతురాజ్ తెలుగు తెరకు పరిచయం అయ్యారు. "చిత్రలహరి ", "బ్రోచేవారెవరురా ", "అల .. వైకుంఠ పురములో " వంటి సక్సెస్ ఫుల్ మూవీస్ తో నివేత ప్రేక్షుకులను అలరించారు. నివేత నటించిన యాక్షన్ థిల్లర్ "RED "మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. టాలెంటెడ్ యాక్ట్రెస్ నివేత టాలీవుడ్ లో పలు మూవీస్ ఆఫర్స్ అందుకుంటున్నారు.

Team TFNవాట్సాప్
Gangavva Becomes The New Captain Of Bigg Boss 4 Season Show Gangavva Becomes The New Captain Of Bigg Boss 4 Season Show
బిగ్ బాస్

బిగ్ బాస్ 4.. కిక్ లేని కెప్టెన్సీ టాస్క్ - కెప్టెన్ గా గంగవ్వ

ఇక రెండు రోజులు కెప్టెన్సీ టాస్క్ తో మంచి హీట్ మీదున్న బిగ్ బాస్ హౌస్ నిన్న ఎపిసోడ్ మాత్రం కాస్త కూల్ గా ముగిసింది. ఇక టాస్క్ లో బెస్ట్ పెర్ఫామెన్స్ గా నిలిచిన గంగవ్వ, హారిక, అవినాష్, అభిజిత్‌లకు రంగు పడుద్ది అనే టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. టాస్క్‌లో భాగంగా న‌లుగురికి రంగు నీళ్ళ‌తో నిండిన బౌల్స్ ఇవ్వ‌గా, చివ‌రి వ‌ర‌కు ఎవ‌రు నీళ్లు కింద ప‌డ‌కుండా ఉంచుకుంటారో వారే విజేత‌ల‌ని ప్ర‌క‌టించారు. ఇంటి సభ్యులు అందరూ గంగవ్వను కెప్టెన్‌గా నిల‌బెట్టే క్ర‌మంలో హారిక, అవినాష్, అభిజిత్‌ బౌల్స్‌లో ఉన్న రంగు నీళ్లను ప‌డేశారు. దీంతో గంగవ్వ బిగ్ బాస్ హౌస్‌కి కెప్టెన్ అయ్యింది.

TFN Adminవాట్సాప్
Nishabdham Movie Was Shot At Real Locations of US
షూటింగ్ అప్‌డేట్

US రియల్ లొకేషన్స్ లో "నిశ్శబ్ధం" షూటింగ్

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ , కోన ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్స్ పై హేమంత్ మధుకర్ దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ అనుష్క ప్రధాన పాత్రలో తెలుగు , తమిళ భాషలలో రూపొందిన థ్రిల్లర్ మూవీ "నిశ్శబ్ధం" భారీ అంచనాలతో అక్టోబర్ 2వ తేదీ అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లో మాధవన్ , అంజలి , షాలిని పాండే , మైఖేల్ మ్యాడ్సన్, సుబ్బరాజు ప్రధాన పాత్రలలో నటించారు. గోపిసుందర్ సంగీతం అందించారు. హీరోయిన్ అనుష్క మ్యూట్ ఆర్టిస్ట్ గా నటించారు.

Team TFNవాట్సాప్
ట్రైలర్ & టీజర్

వర్మ 'దిశ ఎన్‌కౌంటర్‌'‌ ట్రైలర్ రిలీజ్

సమాజంలో జరిగే యదార్ధ సంఘటనల ఆధారంగా సినిమాలు తీయడంలో రామ్ గోపాల్ వర్మ దిట్ట అని చెప్పొచ్చు. ఇప్పటివరకూ ఎన్నో సినిమాలు చేయగా.. ఇప్పుడు మరో సంచలన కథతో రాబోతున్నాడు వర్మ. గత ఏడాది దిశ హత్యాచారం సంఘటన సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అదే సంఘటన ఆధారంగా రామ్ గోపాల్ వర్మ 'దిశ ఎన్‌కౌంటర్‌'‌ అనే సినిమా రూపొందిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కూడా చాలా వరకూ అయిపోయింది. ఇప్పుడు తాజాగా ఈ సినిమా ట్రయిలర్ ను రిలీజ్ చేశాడు వర్మ. దిశను నలుగురు యువకులు ఎత్తుకెళ్లడం, అత్యాచారం చేయడం, ఆపై లారీలో తీసుకెళ్లి తగులబెట్టడం వంటి ఘటనలకు సంబంధించిన అంశాలు అన్నీ ట్రైలర్ లో చూపించాడు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

వీక్లీ రౌండప్ (సెప్టెంబర్ 21-25) - లేటెస్ట్ టాలీవుడ్ అప్ డేట్స్

గాన గంధర్వుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆగష్ట్ 5న కరోనా పాజిటివ్ రావడంతో హాస్పిటల్ లో జాయిన్ అయిన బాలు శుక్రవారం మధ్యాహ్నం 1.04 నిమిషాలకు తుది శ్వాస విడిచినట్టు ప్రకటించారు. ఇక బాలు మరణంతో సినీ ప్రముఖులతో పాటు పలువురు సంతాపం తెలియచేస్తున్నారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

లెజెండరీ సింగర్ ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం

ఎస్ పి బి , బాలు అని సంగీతాభిమానులు ముద్దుగా పిలుచుకునే శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం నెల్లూరు జిల్లా కొనేటమ్మ పేట విలేజ్ లో 1946 సంవత్సరం జూన్ 4 వ తేదీ జన్మించారు. చిన్న వయసు లోనే మ్యూజిక్ పట్ల బాలు ఆసక్తి పెంచుకున్నారు. ఇంజనీరింగ్ చదువుతున్న టైమ్ లో అనేక పాటల పోటీలలో పాల్గొని అవార్డ్స్ అందుకున్నారు. సంగీత దర్శకుడు ఎస్ పి కోదండపాణి , సింగర్ ఘంటసాల జడ్జీలు గా జరిగిన పాటల పోటీ లో బాలు బెస్ట్ సింగర్ గా ఎంపిక అయ్యారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

బాలు రాసిన లేఖ - నా పేరు ముందు అవి వద్దు

గాన గంధర్వుడు నిజంగానే గాంధర్వ లోకానికి వెళ్ళిపోయాడు. ఆయన పూర్తి ఆరోగ్యంతో తిరిగి రావాలని ఎంతో మంది ప్రార్థనలు చేశారు. ఇన్ని రోజులు హాస్పిటల్ లో పోరాటం చేసిన బాలు మాత్రం ఈ రోజు తుది శ్వాస విడిచారు. నిజంగానే సినీ సంగీత ప్రపంచానికి ఈ రోజు చీకటి రోజే. తన గాత్రంతో ఎంతో మందిని మంత్ర ముగ్దుల్ని చేసిన బాలు మరణంతో సినీ పరిశ్రమ విషాదంలో మునిగిపోయింది. ఇక ఆయన జ్జాపకాలను అంతా నెమరు వేసుకుంటున్నారు.

TFN Adminవాట్సాప్
Thala Ajith Valamai Movie Team Hit Back To Sets To Resume Shooting Work
షూటింగ్ అప్‌డేట్

అజిత్ "వాలిమై " మూవీ షూటింగ్ పునః ప్రారంభం

బోనీ కపూర్ ఫిల్మ్స్ బ్యానర్ పై హెచ్ వినోత్ దర్శకత్వంలో సూపర్ స్టార్ అజిత్ హీరోగా యాక్షన్ థ్రిల్లర్ "వాలిమై "తమిళ మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. హూమా ఖురేషి , యామీ గౌతమ్ కథానాయికలు. "వాలిమై " మూవీ లో సూపర్ హిట్ "RX 100 "మూవీ ఫేమ్ కార్తికేయ ఒక కీలక పాత్రకు ఎంపిక అయ్యారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. వరుస బ్లాక్ బస్టర్ మూవీస్ తో కోలీవుడ్ లో దూసుకుపోతున్న హీరో అజిత్ 60 వ మూవీ గా "వాలిమై "రూపొందుతుంది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

హీరో నాగార్జున తో నటించడానికి ఎప్పుడూ సిద్ధమే -శ్రియ

"ఇష్టం "(2001 ) మూవీ తో టాలీవుడ్ లో సినీ కెరీర్ ప్రారంభించిన శ్రియ తెలుగు , తమిళ , హిందీ భాషల పలు చిత్రాలతో ప్రేక్షకులను అలరించారు. బెస్ట్ ఫిల్మ్ గా నంది , ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ అందుకున్న సక్సెస్ ఫుల్ "సంతోషం " మూవీ తో శ్రియ గుర్తింపు పొందారు. "నువ్వే నువ్వే " , "ఠాగూర్ ", నేనున్నాను ", "ఛత్రపతి ", "గౌతమి పుత్ర శాతకర్ణి "వంటి సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. శ్రియ నటించిన దక్షిణాది భాషలతో పాటు హిందీ లో కూడా రూపొందిన "గమనం " పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

ఆ సినిమా కోసమే గుండు లుక్ ట్రై చేశాం ..!

ఇటీవల అర్బన్ మాంక్ లుక్ తో మెగా స్టార్ చిరంజీవి మొత్తం సోషల్ మీడియానే షేక్ చేసిన సంగతి తెలిసిందే. ఈ లుక్ మేకింగ్ వీడియోను 'మేకింగ్ ఆఫ్ ద అర్బన్ మాంక్' పేరుతో ఇటీవలే తన ఇన్స్టా లో విడుదల చేసి గుండు చేయించుకోలేదని చిరు కూడా క్లారిటీ ఇచ్చారు. అయితే అసలు ఈ లుక్ ఎందుకు..? ఏదైనా సినిమా కోసమా..? అంటూ అభిమానుల్లో క్యూరియాసిటీ ఇంకా ఉంది. అయితే 'వేదాళం' రీమేక్‌ కోసమే ఈ గుండు లుక్‌ను ప్రయత్నిస్తున్నారని టాక్‌ కూడా వినిపించింది. ఇక లేటెస్ట్‌గా ఓ ఇంటర్వ్యూలో మెగాస్టార్‌ చిరంజీవి తన గుండు లుక్‌పై క్లారిటీ ఇచ్చారు. 'వేదాళం' రీమేక్‌ కోసమే గుండు లుక్‌ను ట్రై చేస్తున్నట్లు, అయితే ఆ లుక్‌ ఇంకా ఫైనలైజ్‌ కాలేదని…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

ఎస్పీ బాలుకి సినీ ప్రముఖుల సంతాపం

ఎస్పీ బాలు మరణంతో భారతీయ సినీ సంగీతం తమ ముద్దు బిడ్డను కోల్పోయింది. ఇన్నేళ్ల సినీ చరిత్రలో ఘంటసాల తర్వాత అంతటి స్థాయిలో ఎవరైనా గాయకుడు ఉన్నాడంటే అది కేవలం ఒక్క బాలు మాత్రమే. క‌రోనాతో దాదాపు 50 రోజుల పాటు ఆసుప‌త్రిలో చికిత్స పొందిన బాలు ఈ రోజు మ‌ధ్యాహ్నాం 1.04ని.ల‌కు క‌న్నుమూసారు. ఇక రేపు సాయంత్రం బాలు అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించ‌నున్నారు. చెన్నై తిరువ‌ళ్లూరు జిల్లాలో రెడ్ హిల్స్ స‌మీపంలో ఉన్న తామ‌రైపాకంలో బాలు అంత్య‌క్రియ‌లు జ‌రగ‌నున్నాయి. ఇక బాలు మృతితో సినీ ప‌రిశ్ర‌మ శోక‌సంద్రంలో మునిగింది. సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు అభిమానులు బాలు మృతికి సంతాపం తెలుపుతున్నారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

జీవితం విలువ తెలిసింది - మెహరీన్

తెలుగు తోపాటు తమిళ , పంజాబీ భాషల చిత్రాలతో మెహరీన్ ప్రేక్షకులను అలరిస్తున్నారు. సక్సెస్ ఫుల్ "కృష్ణగాడి వీర ప్రేమ గాథ " మూవీ తో టాలీవుడ్ లో ప్రవేశించిన మెహరీన్ "మహాను భావుడు ", రాజా ది గ్రేట్ ", "F2 " వంటి సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ప్రస్తుతం పోటీ ప్రపంచంలో ఒత్తిడికి లోనవుతూ చాలామంది ప్రజలు డిప్రెషన్ కు గురి అవుతూ , అనేక సమస్యలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

వైట్ డ్రెస్ లో ఏంజెల్ గా శృతి హాసన్

యాక్ట్రెస్ , సింగర్ , మ్యూజిక్ డైరెక్టర్ శృతి హాసన్ తెలుగు , తమిళ , హిందీ భాషల పలు సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. లాక్ డౌన్ లో వర్కౌట్స్ , కుకింగ్ వీడియోస్ సోషల్ మీడియా లో షేర్ చేసి అభిమానులను ఆకట్టుకున్నారు. శృతి ప్రస్తుతం హీరో రవితేజ "క్రాక్ ", విజయ్ సేతుపతి "లాభం "తమిళ మూవీ లో నటిస్తున్నారు. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందుతున్న కోర్ట్ డ్రామా "వకీల్ సాబ్ " మూవీలో శృతి హాసన్ కథానాయిక గా ఎంపిక అయ్యారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

ఆమె పాత్రలో నటించడం గౌరవంగా ఉంది

ఆయుష్మాన్ ఖురానా,టబు, రాధికా ఆప్టే నటించిన 'అందాదూన్' సినిమా మంచి ప్రేక్షకాదరణతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను తెలుగులో నితిన్ రీమేక్ చేస్తున్న సంగతి కూడా విదితమే. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను తొందర్లోనే సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

గాన గంధర్వుడు ఎస్పీ బాలు కన్నుమూత

గాన గంధర్వుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆగష్ట్ 5న కరోనా పాజిటివ్ రావడంతో హాస్పిటల్ లో జాయిన్ అయిన బాలు ఆరోగ్య పరిస్థితులు అప్పటినుండి బాలేదనే చెప్పొచ్చు. ఇటీవల కరోనా నెగిటివ్ వచ్చినా కూడా ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తాయి. దీనితో నిన్న ఆయన ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు గురువారం ప్రకటించిన ఎంజీఎం వైద్యులు నేడు తుది శ్వాస విడిచినట్లు వెల్లడించారు. శుక్రవారం మధ్యాహ్నం 1.04 నిమిషాలకు ఎస్పీ బాలు తుది శ్వాస విడిచినట్లు వైద్యులు ప్రకటించారు. ఇక బాలు మరణంతో సినీ ప్రముఖులతో పాటు పలువురు సంతాపం తెలియచేస్తున్నారు.

TFN Adminవాట్సాప్

షేర్