కరోనా కారణంగా ఎస్పీ బాలు చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చేరి ఆ తర్వాత ఆరోగ్యం కాస్త విషమించి అక్కడే హాస్పిటల్ లో వుంటూ చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయనకు ఇటీవల కరోనా పరీక్షలు నిర్వహించగా నెగెటివ్ కూడా వచ్చింది. ఇక ఇక బాలు హెల్త్ అప్ డేట్స్ గురించి తనయుడు చరణ్ ఎప్పటికప్పుడు ఇస్తూనే ఉన్నాడు. ఇటీవలే తన తండ్రి ఆరోగ్యం నిలకడగానే ఉన్నదని ఎస్పీ చరణ్ తెలిపారు. తన తండ్రి ఈసీఎంవో సపోర్టుతో ఉన్నారని.. ఫిజియోథెరపీలో చురుకుగా పాల్గొంటున్నారని ఎస్పీ చరణ్ పేర్కొన్నారు. తన తండ్రి త్వరగా కోలుకోవడం కోసం శ్రమించిన ఆస్పత్రి వైద్యులకు, ఆయన అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
అయితే తాజాగా సమాచారం ప్రకారం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మళ్లీ అస్వస్థతకు లోనైనట్టు తెలుస్తుంది. ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఎంజీఎం హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. గడచిన 24 గంటల్లో ఎస్పీబీ ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించిందని.. వెంటిలేటర్ సాయంతో ఆయనకు చికిత్సనందిస్తున్నామని.. ప్రస్తుతం అయితే క్రిటికల్ గానే ఉందనిఎంజీఎం అధికారికంగా ప్రకటించింది. దీనితో అభిమానుల్లో మరోసారి కలవరం మొదలైంది.
కాగా సుమారు 40 రోజులుగా ఆస్పత్రిలోనే చికిత్స తీసుకుంటున్నారు. పూర్తిగా కోలుకుంటున్న సమయంలో ఆయన మళ్లీ అస్వస్థతకు గురయ్యారు. కరోనా తగ్గినా ఇతర అనారోగ్య సమస్యలతో ఆయన బాధపడుతున్నారు. మరి ఆయన పూర్తిగా కోలుకోవాలని కోరుకుందాం.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: