మణిరత్నం “నవరస “వెబ్ సిరీస్ అప్ డేట్

An Interesting Update About Mani Ratnam Navarasa Web Series Is Out

లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం “నవరస “పేరుతో వెబ్ సిరీస్ రూపొందిస్తున్న విషయం తెలిసిందే. 9 ఎపిసోడ్స్ ఉన్న “నవరస ” వెబ్ సిరీస్ లో ఒక ఎపిసోడ్ కు మణిరత్నం దర్శకత్వంవహిస్తుండగా మిగతా 8 ఎపిసోడ్స్ ను 8 మంది దర్శకులు తెరకెక్కించనున్నారు. గౌతమ్ మీనన్ , కె వి ఆనంద్ , కార్తీక్ నరేన్ , రతీంద్రన్ ప్రసాద్ , పొన్ రామ్ , బిజోయ్ నంబియార్ దర్శకులుగా ఎంపిక అయ్యారు. మిగతా 2 ఎపిసోడ్స్ కు హీరోలు సిద్ధార్ధ్ , అరవింద్ స్వామి దర్శకులుగా పరిచయం అవుతున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

స్టార్ హీరో సూర్య , విజయ్ సేతుపతి , అరవింద్ స్వామి కొన్ని ఎపిసోడ్స్ లో ప్రధాన పాత్రధారులు. ఒక ఎపిసోడ్ కు జర్నీ మూవీ ఫేమ్ జై , స్నేహ ఎంపిక అయ్యారు. రతీంద్రన్ దర్శకత్వ ఎపిసోడ్ కు పార్వతి తిరువోతు , సిద్ధార్ధ్ ఎంపిక అయ్యారు. పొన్ రామ్ దర్శకత్వ ఎపిసోడ్ కు హీరో దుల్కర్ సల్మాన్ ఎంపిక అయ్యారు. 9 మంది డైరెక్టర్స్ , మూవీ హీరో, హీరోయిన్స్ తో రూపొందుతున్న “నవరస “వెబ్ సిరీస్ ప్రేక్షకులను అలరించనుంది. దర్శకుడు మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ “పొన్నియిన్ సెల్వన్ ” మూవీ భారీ తారాగణం , భారీ బడ్జెట్ తో రెండు భాగాలుగా రూపొందుతున్న విషయం తెలిసిందే.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × 2 =