ఎన్నో వార్తలు.. ఎన్నో రూమర్స్ తర్వాత ఫైనల్లీ అందాదూన్ లో నటించే లీడ్ యాక్ట్రెస్ పై క్లారిటీ ఇచ్చారు చిత్ర యూనిట్. రాధికా ఆప్టే రోల్ లో ఏమో కానీ టబు పాత్రలో మాత్రం ఎవరు నటిస్తారో అన్నది మాత్రం అందరి క్యూరియాసిటీ. ఎందుకంటే పాత్రకున్న ప్రాముఖ్యత అలాంటిది. ఇక ఇన్ని రోజుల తర్వాత టబు పాత్రలో తమన్నా.. రాధికా ఆప్టే పాత్రలో నభా నటించనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా తాజాగా ఈ పాత్రలపై డైరెక్టర్ మేర్లపాక గాంధీ మాట్లాడుతూ.. అందాదూన్ లో టబు.. రాధికా ఆప్టే చాలా అద్భుతంగా నటించారు.. వారిద్దరి పాత్రలకు ఇక్కడ ఎవరు న్యాయం చేస్తారని ఇన్ని రోజులనుండి అనుకుంటూనే ఉన్నాం.. చాలా చర్చలు తర్వాత నభా, తమన్నాను ఎంపికచేశాం.. వారిద్దరూ చాలా టాలెంట్ ఉన్న హీరోయిన్స్ ఆ పాత్రలకు వాళ్ళైతే ఖచ్చితంగా సరిపోతారని సెలెక్ట్ చేసామని తెలిపారు. ఒరిజినల్ కథను ఎక్కువ మార్చే ప్రయత్నం అయితే చెయ్యట్లేదు.. ఎందుకంటే జాతీయ అవార్డ్ దక్కించుకున్న సినిమా ఇది.. అదే రెస్పెక్ట్ తో ట్రీట్ చేస్తాం..అయితే తెలుగు ఆడియన్స్ ను దృష్టిలో పెట్టుకొని కొన్ని మైనర్ చేంజెస్ అయితే చేస్తున్నాం.. నవంబర్ లో సినిమా షూటింగ్ ప్రారంభించాలని చూస్తున్నాం అని తెలిపారు.
కాగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో నితిన్ ప్రధాన పాత్రలో అందాదూన్ రీమేక్ చేస్తున్నారు. శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్‌పై ఎన్.సుధాకర్ రెడ్డి, నికితా రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సాగర్ మహతి సంగీతం అందించనుండగా… హరి కె.వేదాంత్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేయనున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: