ప్రస్తుతం చిరంజీవి, కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్యలో నటిస్తున్న సంగతి తెలిసిందే. త్వరలోనే మళ్లీ షూటింగ్ ను మొదలుపెట్టాలని.. ముందు రామ్ చరణ్ తో వున్న సీన్స్ పూర్తి చేయాలనీ భావిస్తోందట చిత్రయూనిట్. ఇక ఈ సినిమాలో చిరు సరసన కాజల్ అగర్వాల్ నటిస్తుండగా.. తనయుడు రామ్ చరణ్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడు. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్, కొణిదెల ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఈ సినిమా తర్వాత చిరు లూసిఫర్ సినిమా రీమేక్ కూడా చేయనున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ సినిమా భాద్యతలు వినాయక్ చేతిలో పడ్డాయి. నిజానికి ఈ సినిమాకు ముందు డైరెక్షన్ చేస్తున్నట్టు వినాయక్ పేరే వినిపించింది. ఆతర్వాత ఏమైందో తెలియదు కానీ సాహో డైరెక్టర్ సుజీత్ కు ఆ భాద్యతలు అప్పగించారు. అయితే ఇప్పుడు మళ్లీ వినాయక్ చేతికే ఈ రీమేక్ వెళ్ళింది. దానికి కారణం ఏంటో చిరు క్లారిటీ కూడా ఇచ్చారు.
తాజాగా ఈ విషయం పై మాట్లాడిన చిరు సుజీత్ ప్లేస్ లో వినాయక్ ని రీప్లేస్ చేశామని కన్ఫామ్ చేస్తూ.. సుజీత్ నా దగ్గరికి వచ్చి పెళ్లి పనుల్లో బిజీ గా ఉండటం వల్ల స్క్రిప్ట్.. ప్రీ ప్రొడక్షన్ పనుల పై కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నా అని చెప్పడం జరిగిందని.. సో అతను రిక్వెస్ట్ చేసినందుకే ఈ రీమేక్ భాద్యతలు వినాయక్ కు అప్పగించామని స్పష్టం చేశారు. ఇక ఈ భాద్యతలు తీసుకున్న వినాయక్ అప్పుడే స్క్రిప్ట్ పనుల్లో పడిపోయారట. కాగా ఇటీవలే సుజీత్ వివాహం జరిగిన సంగతి తెలిసిందే.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: