బిగ్ బాస్ 4 – మరో వైల్డ్ కార్డ్ ఎంట్రీ

Swathi Deeksith Enters Bigg Boss House Through Wild Card Entry

మొదటి రెండు వారాలతో పోల్చుకుంటే బిగ్ బాస్ 4ఈ వారం కాస్త ఇంటరెస్టింగ్ గానే ఉంది అని చెప్పొచ్చు. దానికి కారణం వేరే చెప్పేదేముంది ఫిజికల్ టాస్క్. రోబోలు.. హుమన్స్ మధ్య పెట్టిన ఈ టాస్క్ మంచి రసవత్తరంగానే సాగింది. రోబోలు దివిని కిడ్నాప్ చేయడంతో ఆటలో అసలు మజా అప్పుడు వచ్చింది. దీనికి హుమన్స్ టీమ్ పెద్ద హంగామా చేసినా రోబోలు మాత్రం కూల్ గా ఛార్జింగ్ ను పెట్టుకున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక రోబోల టీమ్ కు చెందిన అవినాష్ అమ్మ రాజశేఖర్ మాస్టర్ దగ్గర అతనికి తెలియకుండా చాలా తెలివిగా ఛార్జింగ్ పెట్టుకున్నాడు. దీంతో మాస్టర్ చాలా సీరియస్ అయ్యాడు. ఆ తర్వాత మోనాల్ గంగవ్వ వేసుకున్న రోబో డ్రెస్ ను విసిరేసింది. దీంతో గంగవ్వ మోనాల్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆహారం ఇస్తే చార్జింగ్ ఇస్తామని గంగవ్వకు మనుషుల టీమ్ చెప్పి ఆహారం తీసుకొని చార్జింగ్ ఇచ్చారు. ఆట ముగిసే సమయానికి అభి, గంగవ్వల దగ్గర ఛార్జింగ్ ఉండటంతో రోబోల టీమ్ విజయం దక్కించుకున్నారు. ఇక రోబోలు టీం నుండి కెప్టెన్సీ టాస్క్ కోసం నలుగురిని ఎంచుకోమని బిగ్ బాస్ చెప్పడంతో అభిజిత్, హారిక, గంగవ్వ, అవినాష్ లను ఎంచుకున్నారు. ఇక హుమన్స్ టీం నుండి వరస్ట్ పెర్ఫామెన్స్ ఎవరు చేశారో చెప్పమని అడుగగా.. మాగ్జిమమ్ ఓట్లు నోయల్ కు పడటంతో జైలు కు వెళ్లాల్సి వచ్చింది. మరి కెప్టెన్సీ టాస్క్ ఎం పెడతారో చూడాలి.

ఇక ఇదిలా ఉండగా ఇప్పటికే హౌస్ లోకి ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా అవినాస్, కుమార్ సాయి రాగా.. ఇప్పుడు మరో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వనుంది. ఆ హీరోయిన్ ఎవరో కాదు స్వాతి దీక్షిత్. బిగ్ బాస్ హౌస్ లోకి స్వాతి దీక్షిత్ ఎంట్రీ ఇవ్వనుంది. జంప్ జిలానీ, బ్రేకప్, చిత్రాంగద సినిమాల్లోని పాత్రల ద్వారా గుర్తింపు తెచ్చుకుంది స్వాతి దీక్షిత్. మరి ఈ భామ ఏ మేరకు ప్రేక్షకులను అకట్టుకుంటుందో చూద్దాం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × 4 =