ట్యాగ్ · 4140 కథనాలు · పేజీ 47
నా కలలు నిజమయ్యాయి.. నా బాస్ ఓకే చెప్పారు
పాయల్ కరోనా టెస్టింగ్ కష్టాలు
బిజీ బిజీగా తమన్నా

#PSPK28.. ఆ సైలెన్స్ కోసం వెయిట్ చేస్తున్నా
ఛాలెంజింగ్ రోల్ లో సమంత

"వలిమై "తమిళ మూవీ షూటింగ్ లో కార్తికేయ
"శ్యామ్ సింగ రాయ్ " మూవీ అప్ డేట్
సోనూసూద్ కు ప్రకాష్ రాజ్ సత్కారం
బాలకృష్ణ కు జోడీగా జయప్రద ?
ఫుల్ కామెడీ తో ఒరేయ్ బుజ్జిగా ట్రైలర్
సుక్కూ - విజయ్ క్రేజీ కాంబినేషన్ కన్ఫామ్
రైటర్ గా మారిన రజినీ..!
రాశీఖన్నా లేటెస్ట్ వర్కౌట్
పాకిస్థానీ టెర్రరిస్ట్ గా సమంత ..?
సోషల్ మీడియాలో ప్రభాస్ మరో రికార్డ్
బాలు విషయంలో నేషనల్ మీడియాపై హరీష్ కౌంటర్

ఎంటర్ టైన్ చేయడమే గోల్ - నిశ్శబ్దం డైరెక్టర్
సీటీమార్ షూటింగ్ పై సంపత్ నంది క్లారిటీ
హీరో గోపీచంద్ సంపత్ నంది కాంబినేషన్లో ‘సీటీమార్’ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా లాక్ డౌన్ కి ముందే మూడు షెడ్యూల్స్ లో 60% షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. అయితే కరోనా వల్ల సినిమా షూటింగ్‌లకు బ్రేక్ పడిన సంగతి తెలిసిందే.
నా కలలు నిజమయ్యాయి.. నా బాస్ ఓకే చెప్పారు
గతంలో పలు సినిమాల్లో కామెడియన్ గా చేసిన బండ్ల ఆ తర్వాత నిర్మాతగా కూడా కొన్ని సినిమాలు తీసిన సంగతి తెలిసిందే. పవన్‌కల్యాణ్, బండ్లగణేశ్ కాంబినేషన్లో ఇది వరకు తీన్మార్, గబ్బర్ సింగ్ సినిమాలు వచ్చాయి. 2015లో విడుదలైన టెంపర్ సినిమా తర్వాత బండ్లగణేశ్ మరో సినిమాను నిర్మించలేదు. ఆ తర్వాత రాజకీయాల్లోకి వెళ్లి మళ్ళీ తనకు రాజకీయాలు సెట్ కావని బయటకు వచ్చేశాడు. చాలా గ్యాప్ తర్వాత సరిలేరు నీకెవ్వరూ సినిమాతో మళ్లీ రీఎంట్రీ ఇచ్చాడు. ఇక ఇప్పుడు దాదాపు ఐదేళ్ల గ్యాప్ తర్వాత బండ్లగణేష్ మళ్లీ నిర్మాతగా మారబోతున్నాడు.
పాయల్ కరోనా టెస్టింగ్ కష్టాలు
కరోనా పరీక్షకు గాను ముక్కు నుండి శాంపిల్ సేకరిస్తారనే విషయం తెల్సిందే కదా. ఇక ఈ టెస్ట్ కోసం ఒక హీరోయిన్ భయంతో వణికిపోయినట్టు తెలుస్తుంది. ఆ హీరోయిన్ ఎవరో కాదు పాయల్ రాజ్ పుత్. ప్రస్తుతం పాయల్ రాజ్ పుత్ పలు సినిమాలతో బిజీగా వుంది. ఇక షూటింగ్ లు మొదలవుతున్నాయి కాబట్టి పాయల్ కూడా షూటింగ్స్ లో పాల్గొనడానికి వచ్చేసింది. ఈ నేపథ్యంలో ఒక సినిమా షూటింగ్ సందర్బంగా చిత్ర యూనిట్ సభ్యులు ముందస్తు జాగ్రత్తగా యూనిట్ సభ్యులకు కరోనా నిర్థారణ పరీక్షలు చేయించారు. అలా పాయల్ కు కూడా కరోనా టెస్ట్ చేశారు. కరోనా నిర్థారణ పరీక్షకు సంబంధించిన వీడియోను పాయల్ సోషల్ మీడియాలో షేర్ చేసింది.
బిజీ బిజీగా తమన్నా
తెలుగు , తమిళ , హిందీ భాషల పలు సూపర్ హిట్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుని తమన్నా స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. తమన్నా సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు . 6నెలల విరామం తరువాత తమన్నా హైదరాబాద్ లో అడుగు పెట్టారు. స్టార్ హీరోయిన్ తమన్నా ప్రస్తుతం గోపీచంద్ హీరోగా కబడ్డీ నేపథ్యంలో రూపొందుతున్న స్పోర్ట్స్ డ్రామా "సీటీ మార్ " మూవీ లో కథానాయికగా నటిస్తున్నారు.

#PSPK28.. ఆ సైలెన్స్ కోసం వెయిట్ చేస్తున్నా
హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ 28వ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇక ఇటీవలే ఈ సినిమా నుండి పవన్ పుట్టినరోజు సందర్భంగా కాన్సెప్ట్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. అయితే షూటింగ్ మాత్రం ఇప్పుడప్పుడే స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ లేవు. కారణం ప్రస్తుతం వేణు శ్రీరామ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు పవన్. ఆ సినిమా అయిపోయిన తర్వాత క్రిష్ తో సినిమా చేయనున్నాడు. ఈ రెండు సినిమాల తర్వాత హరీష్ సినిమా మొదలుకానుంది.
ఛాలెంజింగ్ రోల్ లో సమంత
తెలుగు , తమిళ భాషల పలు సూపర్ హిట్ మూవీస్ లోన్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకుని సమంత స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. ప్రయోగాత్మక చిత్రాలపై ఆసక్తి చూపుతూ సమంత ఛాలెంజింగ్ రోల్స్ లో నటిస్తూ ప్రేక్షక , అభిమానులను అలరిస్తున్నారు. "ది ఫ్యామిలీ మెన్ సీజన్ 2 "వెబ్ సిరీస్ లో నెగటివ్ రోల్ లో నటించిన సమంత ఇప్పుడు తెలుగు , తమిళ భాషలలో రూపొందనున్న హారర్ నేపథ్య మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

"వలిమై "తమిళ మూవీ షూటింగ్ లో కార్తికేయ
సూపర్ హిట్ "RX 100 " మూవీ తో ప్రేక్షకులను ఆకట్టుకుని , యూత్ లో క్రేజీ హీరోగా మారిన కార్తికేయ "హిప్పీ ", "గుణ 369 ", "90ML" మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. నాని హీరోగా రూపొందిన "గ్యాంగ్ లీడర్ " మూవీ లో ప్రతినాయకుడిగా కార్తికేయ నటించారు. "చావు కబురు చల్లగా" మూవీ లో కార్తికేయ బస్తీ బాలరాజు గా ఒక మాస్ క్యారెక్టర్ తో ప్రేక్షకులను అలరించనున్నారు. కార్తికేయ బర్త్ డే సందర్భంగా ఈ మూవీ టీజర్ గ్లింప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.
"శ్యామ్ సింగ రాయ్ " మూవీ అప్ డేట్
తనదైన స్టైల్ ఆఫ్ యాక్టింగ్ తో ప్రేక్షకులను అలరిస్తున్న హీరో నాని ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతున్న రొమాంటిక్ ఎంటర్ టైనర్ "టక్ జగదీష్ " మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. కరోనా కారణంగా ఆ మూవీ షూటింగ్ నిలిచిపోయింది. త్వరలోనే "టక్ జగదీష్ " మూవీ షూటింగ్ పునః ప్రారంభం కానుంది. ఈ మూవీ తరువాత నాని , సక్సెస్ ఫుల్ "టాక్సీవాలా " మూవీ ఫేమ్ రాహుల్ సంక్రుత్యన్ దర్శకత్వంలో "శ్యామ్ సింగ రాయ్ " మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
సోనూసూద్ కు ప్రకాష్ రాజ్ సత్కారం
ఈ కరోనా వల్ల హీరో అయిన విలన్ ఎవరంటే సోనూసూద్. కరోనా వల్ల ఏర్పడిన గడ్డు పరిస్థితుల్లో ఎంతో మంది ఇబ్బందులు పడిన సంగతి తెలిసిందే. ఇక ఈ పరిస్థితుల్లో చేతికి వెన్నెముక లేనట్టు సాయం చేసాడు సోనూ సూద్. కార్మికులని సొంతింటికి చేర్చడం దగ్గర నుండి తనను సాయం అడిగిన వాళ్లకు కూడా సాయం చేసి శభాష్ అనిపించుకున్నాడు. ఇక ఆయన చేసిన సేవలకు సామాన్య ప్రజలతో పాటు సెలబ్రిటీస్ కూడా ప్రశంసలు కురిపించారు. కొంతమంది అయితే ఆయన్ని దేవుడితో పోల్చిన సందర్భాలు కూడా ఉన్నాయి.
అప్పుడే 13 ఏళ్లు.. నమ్మలేకపోతున్నా అంటున్న చెర్రీ
మెగాస్టార్ తనయుడిగా ఇండస్ట్రీలో అగుపెట్టినా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఎప్పటికప్పుడు తనలోని నటుడిని మెరుగుపరుచుకుంటూ.. తనను తాను కొత్తగా ఆవిష్కరించుకుంటూ విభిన్నమైన పాత్రలు చేసుకుంటూ.. జాగ్రత్తగా ఒక్కో మెట్టు ఎక్కుతూ స్టార్ హీరో ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు. ఇక చెర్రీ ఇండస్ట్రీకి వచ్చి 13 ఏళ్లు అవుతుంది. ఇక ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకున్నాడు చరణ్.
బాలకృష్ణ కు జోడీగా జయప్రద ?
ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మాస్ మసాలా చిత్ర దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా యాక్షన్ ఎంటర్ టైనర్ "BB3 " మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లో హీరో బాలకృష్ణ రెండు పవర్ ఫుల్ క్యారెక్టర్స్ లో నటిస్తున్నారు. ఆ రెండు క్యారెక్టర్స్ లో ఒకటి అఘోరా పాత్ర. ఆపాత్ర "BB3 " మూవీకి హైలైట్ కానుందని సమాచారం. సూపర్ హిట్ కాంబినేషన్ లో బాలకృష్ణ 106 వ మూవీ గా రూపొందుతున్న "BB3 " మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీ కి పలు పవర్ ఫుల్ టైటిల్స్ పరిశీలనలో ఉన్నాయి.
ఫుల్ కామెడీ తో ఒరేయ్ బుజ్జిగా ట్రైలర్
విజయ్‌కుమార్ దర్శకత్వంలో యంగ్ హీరో రాజ్ తరుణ్ కథానాయకుడిగా 'ఒరేయ్.. బుజ్జిగా' సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. థియేటర్స్ ఇప్పుడప్పుడే ఓపెన్ చేసే అవకాశం లేకపోవడంతో ఇక సినిమాను కూడా ఓటీటీ లో రిలీజ్ చేస్తున్నారు. ఆహా లో అక్టోబర్ 2వ తేదీన ఈ సినిమా రిలీజ్ కానుంది. ఇక ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు చిత్రయూనిట్. దీనిలోభాగంగానే ఈ రోజు ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. హీరో నాగ చైతన్య చేతుల మీదుగా ట్రైలర్ ను రిలీజ్ చేశారు.
పూరి జగన్నాథ్ బర్త్ డే కు విజయ్ దేవరకొండ శుభాకాంక్షలు
సక్సెస్ ఫుల్ "బద్రి " మూవీ తో టాలీవుడ్ కు దర్శకుడిగా పరిచయం అయిన పూరి జగన్నాథ్ "ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం ", "ఇడియట్ ", "అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి ", "పోకిరి ", "దేశముదురు ", "చిరుత ", "టెంపర్ "వంటి సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. చాక్లెట్ బాయ్ రామ్ పోతినేని ని బ్లాక్ బస్టర్ "ఇస్మార్ట్ శంకర్ " మూవీ లో మరో కోణం లో ఆవిష్కరించి పూరి ఘనవిజయం సాధించారు . పూరి జగన్నాథ్ ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరోగా పాన్ ఇండియా మూవీ "ఫైటర్ "ను తెరకెక్కిస్తున్నారు.
సుక్కూ - విజయ్ క్రేజీ కాంబినేషన్ కన్ఫామ్
టాలీవుడ్ లో సూపర్ కాంబినేషన్స్ అన్నీ లైన్ కడుతున్నాయి. బన్నీ-కొరటాల, మహేష్-పరుశురాం ఇంకా చాలా ప్రెష్ కాంబినేషన్స్ అన్నీ సెట్ అవుతున్నాయి. అయితే కరోనా వల్ల అసలే ఉన్న సినిమాలకు షూటింగ్ లు లేట్ అయ్యాయి. అయితే ఇప్పుడు ధైర్యం చేసి షూటింగ్స్ ను మొదలుపెట్టి షూటింగ్ వరకూ పూర్తి చేసుకుంటున్నారు కానీ.. సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో మాత్రం క్లారిటీ లేదు ఎవరికీ.
రైటర్ గా మారిన రజినీ..!
శివ దర్శకత్వంలో తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా అన్నాత్తే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. లాక్ డౌన్ ముందే ఈ సినిమా షూటింగ్ చాలావరకు పూర్తయింది. అయితే ఇంకా కొంత భాగం షూటింగ్ మిగిలివుంది. మిగిలిన భాగాన్ని కూడా పూర్తి చేస్తే ఓ పని అయిపోద్దని భావిస్తున్నారట చిత్రయూనిట్. దీనిలో భాగంగానే త్వరలోనే షూట్ ను ప్రారంభించడానికి ప్లాన్ చేస్తున్నారు.
రాశీఖన్నా లేటెస్ట్ వర్కౌట్
ఢిల్లీ లోని లేడీ శ్రీరామ్ కాలేజ్ లో గ్రాడ్యుయేట్ అయిన రాశీఖన్నా స్కూల్ , కాలేజ్ డేస్ లో స్టడీస్ లో టాపర్ గా ఉన్నారు. సింగర్ అవ్వాలనే కోరిక ఉన్న రాశీఖన్నా ఐ ఏ ఎస్ ఆఫీసర్ కావాలని ఆశించారు. మోడల్ , యాక్ట్రెస్ గా మారాలని అనుకోని రాశీఖన్నా యాడ్స్ కు కాపీ రైటర్ గా పని చేసి పలు యాడ్స్ లో నటించారు. బ్లాక్ బస్టర్ "మద్రాస్ కేఫ్ " మూవీ తో బాలీవుడ్ లో ప్రవేశించిన రాశీఖన్నా సక్సెస్ ఫుల్ "ఊహలు గుసగుస లాడే "మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయ్యారు.
పాకిస్థానీ టెర్రరిస్ట్ గా సమంత ..?
మనోజ్ బాజ్‌పెయ్, ప్రియమణి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన స్పై థ్రిల్లర్ వెబ్ సిరీస్ 'ద ఫ్యామిలీ మ్యాన్'.అమెజాన్ ప్రైమ్ లో వచ్చిన ఈ సిరీస్ కు ఫుల్ వ్యూస్ తో పాటు, క్రేజ్ కూడా సొంతం చేసుకుంది. మొదటి సీజన్ సూపర్ హిట్ అవ్వడంతో రెండో సీజన్ కూడా తెరకెక్కిస్తున్న సంగతి కూడా విదితమే. తెలుగు దర్శకులు రాజ్ నిడిమోరు, కృష్ణ డీకేలు ఈ వెబ్ సిరీస్‌ను దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ సిరీస్ తాజాగా షూటింగ్ ను కూడా పూర్తి చేసుకుంది.
సోషల్ మీడియాలో ప్రభాస్ మరో రికార్డ్
సెలెబ్రటీస్ అందరూ సోషల్ మీడియాలో బాగానే యాక్టీవ్ గానే ఉంటారు. ఒకప్పుడు అంటే ఏదో కొంతమంది మాత్రమే సోషల్ మీడియాల్లో యాక్టీవ్ గా ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు మాత్రం ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాలో తమ అప్ డేట్స్ ఇస్తూ.. ఫ్యాన్స్ కు అందుబాటులో ఉంటూ ఫాలోవర్స్ ను పెంచుకుంటున్నారు. ఇటీవల ప్రభాస్ ట్విట్టర్ లో మిలియన్స్ లలో అభిమానులను సొంతం చేసుకొని రికార్డ్స్ క్రియేట్ చేయగా.. ఇక ఇప్పుడు తాజాగా సోషల్ మీడియాలో మరో రికార్డు ను సొంతం చేసుకున్నాడు.
బాలు విషయంలో నేషనల్ మీడియాపై హరీష్ కౌంటర్
కరోనా కారణంగా ఎంజీఎం ఆసుపత్రిలో చేరిన బాలు చికిత్స పొందుతూ కన్నుమూసిన సంగతి తెలిసిందే. శుక్రవారం మధ్యా హ్నం 1:04 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఇక నేడు తిరువళ్ళూరు జిల్లా తామరైపాక్కం ఫాం హౌజ్‌లో అంత్య క్రియలు నిర్వహించారు.

ఎంటర్ టైన్ చేయడమే గోల్ - నిశ్శబ్దం డైరెక్టర్
హేమంత్ మధుకర్ దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ అనుష్క ప్రధాన పాత్రలో 'నిశ్శబ్దం' మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. తెలుగు, తమిళ్, మలయాళ భాషలలో తెరకెక్కుతున్న ఈ సినిమాను తెలుగులో 'నిశ్శబ్దం' టైటిల్ తోను, మిగతా భాషలలో సైలెన్స్ టైటిల్ తో రిలీజ్ చేస్తున్నారు. అక్టోబర్ 2న అమెజాన్ ప్రైమ్‌లో ఈ సినిమా విడుదల కానుంది. ఈనేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు చిత్రయూనిట్.