మనోజ్ బాజ్‌పెయ్, ప్రియమణి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన స్పై థ్రిల్లర్ వెబ్ సిరీస్ ‘ద ఫ్యామిలీ మ్యాన్’.అమెజాన్ ప్రైమ్ లో వచ్చిన ఈ సిరీస్ కు ఫుల్ వ్యూస్ తో పాటు, క్రేజ్ కూడా సొంతం చేసుకుంది. మొదటి సీజన్ సూపర్ హిట్ అవ్వడంతో రెండో సీజన్ కూడా తెరకెక్కిస్తున్న సంగతి కూడా విదితమే. తెలుగు దర్శకులు రాజ్ నిడిమోరు, కృష్ణ డీకేలు ఈ వెబ్ సిరీస్‌ను దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ సిరీస్ తాజాగా షూటింగ్ ను కూడా పూర్తి చేసుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈ వెబ్ సిరీస్ లో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఓ టెర్రరిస్ట్ పాత్రలో సమంత నటిస్తున్నట్టు తెలుస్తుంది. ద ఫ్యామిలీ మ్యాన్ 2 డబ్బింగ్ కూడా పూర్తి చేసింది సామ్. ఇక తాజా సమాచారం ప్రకారం ఈ సిరీస్ లో పాకిస్తానీ ఉగ్రవాది పాత్రలో సమంత కనిపించబోతున్నట్టు తెలుస్తుంది. విభిన్నమైన పాత్రతో పాటు గెటప్ విషయంలో కూడా సమంత కొత్తగా కనిపించబోతున్నట్లుగా సమాచారం.
ఈ వెబ్ సిరీస్ తో పాటు ఇంకా గేమ్ ఓవర్ ఫేమ్ అశ్విన్ శరవణన్ దర్శకత్వంలో కూడా మరో సినిమా చేస్తుంది. విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో కూడా నటిస్తుంది.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: