కరోనా కారణంగా ఎంజీఎం ఆసుపత్రిలో చేరిన బాలు చికిత్స పొందుతూ కన్నుమూసిన సంగతి తెలిసిందే. శుక్రవారం మధ్యా హ్నం 1:04 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఇక నేడు తిరువళ్ళూరు జిల్లా తామరైపాక్కం ఫాం హౌజ్‌లో అంత్య క్రియలు నిర్వహించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఇక బాలు మరణంతో సినీ పరిశ్రమ ఒక్కసారిగా విషాదంలో మునిగిపోయింది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ బాలుకు కన్నీటి నివాళులర్పించారు. అంతర్జాతీయ మీడియా కూడా బాలు మృతికి ఘనంగా నివాళులర్పించింది. ఇక ఈ విషయంలోనే హరీష్ శంకర్ నేషనల్ మీడియాకు చురకలు అంటించారు. `ఇంటర్నేషనల్ మీడియా కూడా ఎంత అద్భుతంగా ప్రెజెంట్ చేసిందో.. మన నేషనల్ మీడియాని చూస్తే జాలేస్తుంది.. అంతేలే.. కొందరి స్థాయి విశ్వవ్యాప్తం.. ఇరుకు సందుల్లో కాదు..` అని హరీష్ శంకర్ ట్వీట్ చేశారు.
ఇంటర్నేషనల్ మీడియా కూడా ఎంత అద్భుతంగా ప్రెజెంట్ చేసిందో..
మన నేషనల్ మీడియా ని చూస్తే జాలేస్తుంది..అంతేలే..
కొందరి స్థాయి విశ్వవ్యాప్తం..
ఇరుకు సందుల్లో కాదు.. pic.twitter.com/hcYDqMU9WK
— Harish Shankar .S (@harish2you) September 26, 2020
కాగా బాలు సినీ ప్రయాణంలో తెలుగు, మలయాళ, తమిళం ఇలా దాదాపు 16 భాషలల్లో 40 వేలకు పైగా పాటలు పాడారు. స్టార్ హీరోలు కమల్ హాసన్, రజనీకాంత్ , సల్మాన్ ఖాన్ వంటి పలువురు నటులకు బాలు డబ్బింగ్ వాయిస్ అందించారు. నటుడిగా 72, సంగీత దర్శకుడిగా 46 చిత్రాలకు ఎస్ పి బాలు పనిచేశారు. సింగర్, మ్యూజిక్ డైరెక్టర్, యాక్టర్, డబ్బింగ్ ఆర్టిస్ట్, నిర్మాతగా చిత్రపరిశ్రమకు సేవలందించిన బాలసుబ్రహ్మణ్యం ను కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ , పద్మభూషణ్ పురస్కారాలతో సత్కరించించింది. బెస్ట్ సింగర్ గా 6 నేషనల్, 29 నంది, 6 ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ బాలు అందుకున్నారు.
[subscribe]




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: