#PSPK28.. ఆ సైలెన్స్ కోసం వెయిట్ చేస్తున్నా

I am looking forward to join #pspk28 movie shooting says director harish shankar

హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ 28వ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇక ఇటీవలే ఈ సినిమా నుండి పవన్ పుట్టినరోజు సందర్భంగా కాన్సెప్ట్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. అయితే షూటింగ్ మాత్రం ఇప్పుడప్పుడే స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ లేవు. కారణం ప్రస్తుతం వేణు శ్రీరామ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు పవన్. ఆ సినిమా అయిపోయిన తర్వాత క్రిష్ తో సినిమా చేయనున్నాడు. ఈ రెండు సినిమాల తర్వాత హరీష్ సినిమా మొదలుకానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ నేపథ్యంలోనే హరీష్ కూడా పవన్ సినిమా షూటింగ్ కోసం వెయిట్ చేయలేకపోతున్నా అని అంటున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న హరీష్ దాదాపు 8 ఏళ్ళు అయిపోయింది పవన్ తో సినిమా చేసి.. నిజానికి ఒక సినిమా షూటింగ్ చేస్తున్నప్పుడు దాదాపు 200 మంది పని చేస్తుంటారు. అలాంటి సమయంలో పవన్ సెట్స్ లోకి నడిచొస్తుంటే పిన్ డ్రాప్ సైలెంట్ అయిపోతుంది.. ఆ రోజు కోసం నేను వెయిట్ చేస్తున్నా.. ఆ సైలెన్స్ కోసం చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నా అని తెలిపారు.

కాగా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాలో నటించే నటీనటుల గురించి త్వరలోనే తెలియచేయనున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × three =