ఫుల్ కామెడీ తో ఒరేయ్ బుజ్జిగా ట్రైలర్

Raj Tarun and Malvika Nair Youthful Love Entertainer Orey Bujjiga Trailer Is Out

విజయ్‌కుమార్‌ దర్శకత్వంలో యంగ్‌ హీరో రాజ్‌ తరుణ్‌ కథానాయకుడిగా ‘ఒరేయ్‌.. బుజ్జిగా’ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. థియేటర్స్ ఇప్పుడప్పుడే ఓపెన్ చేసే అవకాశం లేకపోవడంతో ఇక సినిమాను కూడా ఓటీటీ లో రిలీజ్ చేస్తున్నారు. ఆహా లో అక్టోబర్ 2వ తేదీన ఈ సినిమా రిలీజ్ కానుంది. ఇక ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు చిత్రయూనిట్. దీనిలోభాగంగానే ఈ రోజు ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. హీరో నాగ చైతన్య చేతుల మీదుగా ట్రైలర్ ను రిలీజ్ చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈ ట్రైలర్ ను చూస్తుంటే.. రాజ్ తరుణ్ ఈసారి కామెడీ కు పెద్ద పీట వేసినట్టు కనిపిస్తుంది. ఈ ట్రైలర్ లో కామెడీ అండ్ రొమాన్స్ తో పాటు డైలాగ్స్ కూడా బాగున్నాయి. సినిమాలో ఫుల్ కామెడీ ఉండేలా కనిపిస్తుంది.

 

కాగా మాళవిక నాయర్‌ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో హెబ్బా పటేల్ కూడా కీలక పాత్రలో నటిస్తుంది. ఇంకా ఈ సినిమాలో నరేష్‌, పోసాని కృష్ణమురళి, అనీష్‌ కురువిళ్ళ, సప్తగిరి, రాజా రవీంద్ర, అజయ్‌ ఘోష్‌, అన్నపూర్ణ, సిరి, జయలక్ష్మి, సోనియా చౌదరి, సత్య, మధునందన్‌ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. శ్రీమతి లక్ష్మీ రాధామోహన్‌ సమర్పణలో శ్రీసత్యసాయి ఆర్ట్స్‌ పతాకంపై కొండా కె.కె.రాధామోహన్‌ నిర్మిస్తున్న ఈ సినిమాకు అనూప్‌ రూబెన్స్‌ సంగీతం అందిస్తున్నాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × one =