హీరో గోపీచంద్ సంపత్ నంది కాంబినేషన్లో ‘సీటీమార్’ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా లాక్ డౌన్ కి ముందే మూడు షెడ్యూల్స్ లో 60% షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. అయితే కరోనా వల్ల సినిమా షూటింగ్లకు బ్రేక్ పడిన సంగతి తెలిసిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక సంపత్ నంది తన ట్విట్టర్ ద్వారా ఈ సినిమా షూటింగ్ పై క్లారిటీ ఇచ్చాడు. గోపీచంద్ ఫ్యాన్స్ కు, ఈ సినిమా అప్ డేట్ కోసం ఎదుచూస్తున్న ఫ్యాన్స్ కు ఇన్ని రోజులు ఓపికగా వెయిట్ చేసినందుకు ఫస్ట్ చాలా పెద్ద పెద్ద థ్యాంక్స్. సీటీమార్ స్పోర్ట్స్, యాక్షన్ డ్రామాతో తెరకెక్కుతున్న సినిమా. కబడ్డీ నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమా కావడంతో ఇందుకోసం ప్రొఫెషనల్ ప్లేయర్స్ కావాలి.. పైగా యూనిట్ మెంబెర్స్ కూడా ఎక్కువ మంది కావాలి.. ఇలాంటి పరిస్థితుల్లో షూటింగ్ కు వెళ్లాలంటే చాలా కష్టం.. అందుకే షూటింగ్ కోసం సరైన సమయం కోసం ఎదురుచూస్తున్నాం.. అతి త్వరలోనే షూటింగ్ ను ప్రారంభించాలని చూస్తున్నాం… త్వరలోనే ఈ సినిమా షూటింగ్ పై క్లారిటీ ఇస్తామని తెలిపారు.
#Seetimaarr @YoursGopichand @tamannaahspeaks @DiganganaS @bhumikachawlat @actorrahman @TarunRajArora @soundar16 @SS_Screens #Manisharma pic.twitter.com/OGPJwQUiVI
— Sampath Nandi (@IamSampathNandi) September 27, 2020
కాగా స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్నకాగా ఈ సినిమాలో తమన్నా మరో కీలక పాత్రలో నటిస్తుంది. తెలంగాణ కబడ్డీ టీమ్ కోచ్గా నటిస్తుంది. మరో హీరోయిన్ దిగంగన నటిస్తుండగా పోసాని కృష్ణ మురళి, రావు రమేష్, భూమిక, రెహమాన్, బాలివుడ్ యాక్టర్ తరుణ్ అరోరా కూడా నటిస్తున్నారు. మెలోడి బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. సౌందర్ రాజన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నాడు.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























