టాలీవుడ్ లో సూపర్ కాంబినేషన్స్ అన్నీ లైన్ కడుతున్నాయి. బన్నీ-కొరటాల, మహేష్-పరుశురాం ఇంకా చాలా ప్రెష్ కాంబినేషన్స్ అన్నీ సెట్ అవుతున్నాయి. అయితే కరోనా వల్ల అసలే ఉన్న సినిమాలకు షూటింగ్ లు లేట్ అయ్యాయి. అయితే ఇప్పుడు ధైర్యం చేసి షూటింగ్స్ ను మొదలుపెట్టి షూటింగ్ వరకూ పూర్తి చేసుకుంటున్నారు కానీ.. సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో మాత్రం క్లారిటీ లేదు ఎవరికీ.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా ఇప్పుడు మరో ప్రెష్ కాంబో కన్ఫామ్ అయింది. ప్రస్తుతం మంచి ఫామ్ లో ఉన్న విజయ్ దేవరకొండ, సుకుమార్ కాంబినేషన్ లో సినిమా రాబోతుంది. కాంబినేషన్ వింటేనే క్రేజీగా ఉంది కదా. ఇక ఈ సినిమాను అధికారికంగా ప్రకటించారు. ఈ రోజు ఈ సినిమాను నిర్మిస్తున్న కేదార్ సెలగం పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాను ప్రకటించారు. ఇక విజయ్ కూడా తన ట్విట్టర్ ద్వారా విషెస్ చెపుతూ.. “నాలో నటుడు చాలా ఎగ్జయిటింగ్ గా వెయిట్ చేస్తున్నాడు. నాలోని ప్రేక్షకుడు సెలబ్రేట్ చేసుకుంటున్నాడు. మీ అందరికీ గుర్తుండిపోయే సినిమాను ఇస్తామని గ్యారంటీ ఇస్తున్నాను. సుక్కుగారితో సెట్స్‌లో ఎప్పుడెప్పుడు కలుద్దామా! అని ఎదురుచూస్తున్నాను. హ్యాపీ బర్త్ డే కేదార్. నువ్వు మంచి స్నేహితుడివి. ఎంతో హార్డ్ వర్క్ చేస్తావు” అంటూ విజయ్ దేవరకొండ ట్వీట్ చేశారు.
Sukumar – Vijay Deverakonda
The actor in me is super excited
The audience in me is celebrating!
We guarantee you memorable Cinema.. I can’t wait to be on set with Sukku sirrr 😘🤗Happy birthday Kedar, you’ve been a good friend and you work extremely hard 🙂 pic.twitter.com/9CHIIvcpBw
— Vijay Deverakonda (@TheDeverakonda) September 28, 2020
కాగా ఫాల్కన్ క్రియేషన్స్ బ్యానర్‌పై కేదార్ సెలగం శెట్టి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా 2022 లో మొదలు కాబోతుంది. పాన్ ఇండియా ప్రాజెక్ట్‌గా ఈ సినిమా రూపొందిస్తున్నారు. మరి అప్పుడే ఈ కాంబినేషన్ అనగానే అందరికి చాలా అంచనాలు పెరిగిపోయాయి. మరి సినిమా చూడాలంటే మాత్రం 2022 వరకూ వెయిట్ చేయాల్సిందే.
ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరోగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ‘ఫైటర్’ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. పూరి కనెక్ట్స్ , ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెలుగు, హిందీ భాషలలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. సీనియర్ హీరోయిన్ రమ్య కృష్ణ ఒక కీలక పాత్రలో నటిస్తున్న ఈ మూవీ కి మణిశర్మ సంగీతం అందించనున్నారు.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: