తనదైన స్టైల్ ఆఫ్ యాక్టింగ్ తో ప్రేక్షకులను అలరిస్తున్న హీరో నాని ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతున్న రొమాంటిక్ ఎంటర్ టైనర్ “టక్ జగదీష్ ” మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. కరోనా కారణంగా ఆ మూవీ షూటింగ్ నిలిచిపోయింది. త్వరలోనే “టక్ జగదీష్ ” మూవీ షూటింగ్ పునః ప్రారంభం కానుంది. ఈ మూవీ తరువాత నాని , సక్సెస్ ఫుల్ “టాక్సీవాలా ” మూవీ ఫేమ్ రాహుల్ సంక్రుత్యన్ దర్శకత్వంలో “శ్యామ్ సింగ రాయ్ ” మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై రాహుల్ సంక్రుత్యన్ దర్శకత్వంలో నాని హీరోగా చారిత్రాత్మక బ్యాక్ డ్రాప్ లో సైన్స్ ఫిక్షన్ “శ్యామ్ సింగ రాయ్ ” మూవీ రూపొందనుంది. ఈ మూవీ సెకండ్ ఆఫ్ మొత్తం ఒక పురాతన కోట లో జరుగనుందనీ, నాని క్యారెక్టర్ కు కొన్ని థ్రిల్లింగ్ అంశాలు ఉంటాయనీ , ఆ క్యారక్టర్ పై హీరో నాని ఆసక్తిగా ఉన్నారనీ సమాచారం. హీరో నాని 27 వ మూవీ గా రూపొందనున్న
“శ్యామ్ సింగ రాయ్ ” నవంబర్ నెలలో సెట్స్ పైకి తీసుకు వెళ్ళడానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది.
[subscribe]




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: