ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మాస్ మసాలా చిత్ర దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా యాక్షన్ ఎంటర్ టైనర్ “BB3 ” మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లో హీరో బాలకృష్ణ రెండు పవర్ ఫుల్ క్యారెక్టర్స్ లో నటిస్తున్నారు. ఆ రెండు క్యారెక్టర్స్ లో ఒకటి అఘోరా పాత్ర. ఆపాత్ర “BB3 ” మూవీకి హైలైట్ కానుందని సమాచారం. సూపర్ హిట్ కాంబినేషన్ లో బాలకృష్ణ 106 వ
మూవీ గా రూపొందుతున్న “BB3 ” మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీ కి పలు పవర్ ఫుల్ టైటిల్స్ పరిశీలనలో ఉన్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
“BB3 ” మూవీలో ద్విపాత్రాభినయం చేస్తున్న బాలకృష్ణ నటించే ఒక పాత్రకు జోడీగా సీనియర్ హీరోయిన్ జయప్రద ఎంపిక అయ్యారని సమాచారం. తెలుగు , మలయాళ , హిందీ భాషలలో సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా రాణించిన జయప్రద పలు సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. తన పాత్రకు ఇంప్రెస్ అయ్యి జయప్రద “BB3 ” మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కరోనా కారణం గా షూటింగ్ నిలిచిపోయిన “BB3 ” మూవీ షూటింగ్ త్వరలోనే పునః ప్రారంభం కానుందని, 2021 సంవత్సరం ఏప్రిల్ నెలలో రిలీజ్ చేయడానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేసిందని సమాచారం.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: