హేమంత్ మధుకర్ దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ అనుష్క ప్రధాన పాత్రలో ‘నిశ్శబ్దం’ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. తెలుగు, తమిళ్, మలయాళ భాషలలో తెరకెక్కుతున్న ఈ సినిమాను తెలుగులో ‘నిశ్శబ్దం’ టైటిల్ తోను, మిగతా భాషలలో సైలెన్స్ టైటిల్ తో రిలీజ్ చేస్తున్నారు. అక్టోబర్ 2న అమెజాన్ ప్రైమ్‌లో ఈ సినిమా విడుదల కానుంది. ఈనేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు చిత్రయూనిట్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సందర్భంగా ఓ ఛానల్ లో ఇంటర్వ్యూ ఇచ్చిన డైరెక్టర్ హేమంత్ మధుకర్ మాట్లాడుతూ.. ఈ సినిమాను ఏప్రిల్ లోనే రిలీజ్ చేద్దామనుకున్నాం అందుకోసం అన్ని ఏర్పాట్లు చేసుకున్నాం అయితే మార్చిలో కరోనా వల్ల లాక్ డౌన్ విధించడం.. థియేటర్స్ క్లోజ్ చేయడం తో సినిమా రిలీజ్ కాలేదు. మేము కొంచం అప్ సెట్ అయ్యాం అప్పుడు.. మళ్లీ థియేటర్స్ ఓపెన్ అవుతాయేమో చూసాం కానీ చాలా లాంగ్ అయ్యేలాగ ఉంది.. అందుకే ఓటీటీ లో రిలీజ్ చేస్తున్నాం.. ఫైనల్ గా ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేయడమే మా గోల్.. మేము ఆ పని చేస్తున్నందుకు సంతోషంగా వుంది అని తెలిపారు.
ఈ కథను ముందు 2013 నే అనుకున్నా అయితే కోన వెంకట్ గారు ఇది మాములు కాన్సెప్ట్ కాదని.. పాన్ ఇండియా లెవెల్ సినిమా కాదని గ్లోబల్ ఆడియన్స్ కు చూపించాలని చెప్పారు. అందుకే కథను యూఎస్ లోనే తీశామని.. హాలీవుడ్ స్టార్ మైఖేల్ మ్యాడ్సన్ ముందు ఎనిమిది నెలలు ఆడిషన్ చేశాం.. ఫైనల్ గా మైఖేల్ మ్యాడ్సన్ ఈ సినిమాలో ఉండటం డ్రీమ్ నిజమవ్వడం లాంటిది అని చెప్పుకొచ్చాడు.
కాగా ఈ సినిమాలో మాధవన్, అంజలి, షాలిని పాండే, శ్రీనివాస్ అవసరాల, సుబ్బరాజు, మైఖేల్ మ్యాడ్సన్ కీలక పాత్రలలో నటిస్తున్నారు. టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల, కోన వెంకట్ నిర్మాణంలో రూపొందుతున్న ఈ సినిమాకు గోపిసుందర్ సంగీతం అందిస్తున్నారు. ఏప్రిల్ 2వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: