ఈ కరోనా వల్ల హీరో అయిన విలన్ ఎవరంటే సోనూసూద్. కరోనా వల్ల ఏర్పడిన గడ్డు పరిస్థితుల్లో ఎంతో మంది ఇబ్బందులు పడిన సంగతి తెలిసిందే. ఇక ఈ పరిస్థితుల్లో చేతికి వెన్నెముక లేనట్టు సాయం చేసాడు సోనూ సూద్. కార్మికులని సొంతింటికి చేర్చడం దగ్గర నుండి తనను సాయం అడిగిన వాళ్లకు కూడా సాయం చేసి శభాష్ అనిపించుకున్నాడు. ఇక ఆయన చేసిన సేవలకు సామాన్య ప్రజలతో పాటు సెలబ్రిటీస్ కూడా ప్రశంసలు కురిపించారు. కొంతమంది అయితే ఆయన్ని దేవుడితో పోల్చిన సందర్భాలు కూడా ఉన్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తాజాగా విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ కూడా సోనూసూద్ ను సత్కరించడం జరిగింది. అసలు సంగతేంటంటే.. సోనూసూద్ అల్లుడు అదుర్స్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ మళ్లీ కొద్దిరోజుల క్రితమే మొదలైంది. ఇక ఈషూటింగ్లో సోనూసూద్ పాల్గొనగా ఈ సినిమాలో మరో కీలక పాత్రలో నటిస్తున్న ప్రకాష్ రాజ్ సత్కరించారు. ఇక ఈ విషయాన్ని సీనియర్ నటుడు బ్రహ్మాజీ తన ట్విట్టర్‌లో ఫోటోని షేర్ చేస్తూ.. సోనూసూద్‌ను ప్రకాశ్ రాజ్ గారు సన్మానించారని.. తెలుపుతూ ఫొటో కూడా షేర్ చేశారు.
It’s a nice gesture from our @prakashraaj ..felicitated helping hand @SonuSood on alludu adurs sets..🙏🏼❤️💐👏god bless .. pic.twitter.com/ujK8SsVOpj
— BRAHMAJI (@actorbrahmaji) September 28, 2020
కాగా సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో ‘అల్లుడు అదుర్స్’ సినిమా తెరకెక్కుతుంది. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నభానటేశ్, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్స్‌గా నటిస్తుండగా… సోనూసూద్ కీలక పాత్రలో నటిస్తున్నాడు… గొర్రెల సుబ్రహ్మణ్యం నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:
తెలుగు ఫుల్ మూవీస్
Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.