ట్యాగ్ · 4140 కథనాలు · పేజీ 44
అను ఇమ్మాన్యుయేల్ న్యూ లుక్
అభిమానుల ఆత్మీయత వెలకట్టలేనిది -రష్మిక
నిధి అగర్వాల్ చిన్ననాటి ఫోటోలు
రామ్ మిర్రర్ సెల్ఫీ
"మోసగాళ్ళు " మూవీ టీజర్ గ్లింప్స్ రిలీజ్
చిట్టి బాబు లాంటి పాత్రలో సుధీర్ బాబు ..!
మీప్రేమకు థ్యాంక్స్ డార్లింగ్స్
రీమేక్ మూవీస్ లో జాన్వీ కపూర్

నందు "బొమ్మ బ్లాక్ బస్టర్" టీజర్ రిలీజ్
ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ గా రాజశేఖర్
సూర్య కు గాత్ర దానం చేస్తున్న సత్వ దేవ్
సాగర సుందరి రష్మిక
నెగటివ్ రోల్స్ కు సై - రాజ్ తరుణ్
ప్లాంట్ లేడీ సమంత
థియేటర్ లో మొదటి సినిమా నాదే
వర్క్ మోడ్ స్టైల్ లో శృతి హాసన్
పీపీఈ కిట్ లో హీరోయిన్ మీనా
దక్షిణాది భాషలతో పాటు హిందీ భాషలో కూడా పలు బ్లాక్ బస్టర్ మూవీస్ ప్రేక్షకులను అలరించి మీనా సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా రాణించారు. పలు భాషల మూవీస్ కు మీనా బెస్ట్ యాక్ట్రెస్ గా అవార్డ్స్ అందుకున్నారు.ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తున్న మీనా , రజనీకాంత్ "అన్నాత్తే "(తమిళ ), మోహన్ లాల్ "దృశ్యం 2 " మూవీస్ లో నటిస్తున్నారు. జీతూ జోసెఫ్ దర్శకత్వంలోమోహన్ లాల్ , మీనా జంటగా రూపొందిన థ్రిల్లర్ "దృశ్యం " మలయాళ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకుని ఘనవిజయం సాధించింది. "దృశ్యం "మూవీ పలు భాషలలో రీమేక్ జరుపుకుని విజయం సాధించింది.
అను ఇమ్మాన్యుయేల్ న్యూ లుక్
బ్లాక్ బస్టర్ "యాక్షన్ హీరో బిజు " మలయాళ మూవీ తో కెరీర్ ప్రారంభించిన అను ఇమ్మాన్యుయేల్ సక్సెస్ ఫుల్ "మజ్ను "మూవీ తో టాలీవుడ్ లో అడుగుపెట్టారు. సూపర్ హిట్ "తుప్పరివాలన్ "(డిటెక్టివ్ ) మూవీ తో అను కోలీవుడ్ కు పరిచయం అయ్యారు. స్టార్ హీరోలు పవన్ కళ్యాణ్ , అల్లు అర్జున్ , గోపీచంద్ , నాగచైతన్య మూవీస్ లో నటించినా అను కు బ్రేక్ రాలేదు. అను ప్రస్తుతం బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా రూపొందుతున్న రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ " అల్లుడు అదుర్స్ " మూవీ లో కథానాయికగా నటిస్తున్నారు.
అభిమానుల ఆత్మీయత వెలకట్టలేనిది -రష్మిక
టాలీవుడ్ , శాండల్ వుడ్ లలో పలు సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించి రష్మిక స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న విషయం తెలిసిందే. సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ రష్మిక అభిమానులతో టచ్ లో ఉంటున్నారు. హీరోయిన్ రష్మిక ప్రస్తుతం ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యం లో రూపొందుతున్న "పుష్ప "మూవీ లో అల్లు అర్జున్ కు జోడీగా నటిస్తున్నారు. "సుల్తాన్ "మూవీ తో రష్మిక కోలీవుడ్ కు పరిచయం కానున్నారు.
నిధి అగర్వాల్ చిన్ననాటి ఫోటోలు
సక్సెస్ ఫుల్ బాలీవుడ్ మూవీ "మున్నా మైఖేల్ " తో కెరీర్ ప్రారంభించిన అందాల నిధి అగర్వాల్ "సవ్యసాచి "మూవీ తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు." Mr మజ్ను " తో ప్రేక్షకులను నిధి అలరించారు. బ్లాక్ బస్టర్ "ఇస్మార్ట్ శంకర్ "మూవీ లో తన అందం , అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుని నిధి పలు అవకాశాలు అందుకుంటున్నారు.
రామ్ మిర్రర్ సెల్ఫీ
బ్లాక్ బస్టర్ "దేవదాసు " మూవీ తో టాలీవుడ్ కు పరిచయమయిన రామ్ పోతినేని ఆ మూవీ లో తన ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. "రెడీ ", "కందిరీగ ", "పండగ చేస్కో ", "నేను శైలజ " వంటి సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. యాక్షన్ ఎంటర్ టైనర్ "ఇస్మార్ట్ శంకర్ " మూవీ లో మాస్ క్యారెక్టర్ లో రామ్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకుని సెన్సేషనల్ స్టార్ ఆఫ్ ది ఇయర్ గా జీ సినీ అవార్డ్ అందుకున్నారు.
"మోసగాళ్ళు " మూవీ టీజర్ గ్లింప్స్ రిలీజ్
24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ , AVA ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై జెఫ్రీ గీ చిన్ దర్శకత్వంలో విష్ణు మంచు హీరోగా బిగ్గెస్ట్ ఐటీ స్కామ్ వాస్తవ సంఘటన నేపథ్యంలో తెలుగు , ఇంగ్లీష్ భాషలలో "మోసగాళ్ళు " మూవీ రూపొందుతుంది. కాజల్ అగర్వాల్ , సునీల్ శెట్టి , నవీన్ చంద్ర , నవదీప్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. శామ్ CS సంగీతం అందిస్తున్నారు. "మోసగాళ్ళు " మూవీ జూన్ 5వ తేదీ రిలీజ్ కావాల్సివుండగా కరోనా కారణం గా విడుదల వాయిదా పడింది.
చిట్టి బాబు లాంటి పాత్రలో సుధీర్ బాబు ..!
ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో నాని-సుధీర్ బాబు కాంబినేషన్ లో వచ్చిన ‘వి’ మూవీ ఇటీవలే అమెజాన్ లో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా విజయం సంగతి పక్కన పెడితే.. ఈ సినిమాలో పోలీస్ పాత్రలో నటించిన సుధీర్ బాబుకు మాత్రం మంచి మార్కులు పడ్డాయి. ఇప్పటివరకూ కాస్త లవర్ బాయ్ రోల్స్ లో కనిపించిన సుధీర్ బాబుకు ఈ సినిమా కమర్షియల్ హీరోగా మారడానికి బాగా ఉపయోగపడిందని చెప్పొచ్చు.
మీప్రేమకు థ్యాంక్స్ డార్లింగ్స్
బాహుబలి, సాహో ల తర్వాత ప్రభాస్ రేంజ్ పూర్తిగా మారిపోయిందని చెప్పొచ్చు. అప్పటినుండి ఏదో ఒక రికార్డు క్రియేట్ చేస్తూనే ఉన్నాడు. రీసెంట్ గా ప్రభాస్ ఫేస్ బుక్ పేజికి 20 మిలియన్ల ఫాలోవర్స్ రావడంతో సరికొత్త రికార్డు ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. మూడు నెలల క్రితమే 15 మిలియన్స్ క్రాస్ చేసిన ప్రభాస్ ఇప్పుడు 20 మిలియన్ మార్క్‌ను టచ్ చేశారు. దీంతో సౌత్‌లోనే ఫేస్బుక్లో ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్న ఘనత ప్రభాస్‌కు మాత్రమే సొంతమైంది. సౌత్ ఇండియాలో ఎక్కువమంది పాలోవర్స్ ఉన్న హీరోగా ఫేస్ బుక్ లో కొత్త రికార్డును క్రియేట్ చేసాడు. ఈ సందర్భంగా ప్రభాస్.. తన అభిమానులు, ఫాలోవర్స్‌కు ప్రత్యేక…
రీమేక్ మూవీస్ లో జాన్వీ కపూర్
లెజెండరీ యాక్ట్రెస్ , అతిలోక సుందరి తనయ జాన్వీ కపూర్ మరాఠీ మూవీ "సైరాట్ " హిందీ రీమేక్ మూవీ "ధడక్" తో బాలీవుడ్ కు పరిచయం అయ్యారు. "ధడక్" మూవీ ఘనవిజయం సాధించి 100 కోట్ల క్లబ్ లో చేరింది. అంథాలజీ మూవీ "ఘోస్ట్ స్టోరీస్"లో ఒక ఎపిసోడ్ లో జాన్వీ నటించారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఫైటర్ పైలట్ గుంజన్ సక్సేనా జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన " గుంజన్ సక్సేనా : ది కార్గిల్ " మూవీ తో జాన్వీ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. జాన్వీ హీరోయిన్ గా "రూహి అఫ్జానా", "దోస్తానా 2 " మూవీస్ రూపొందుతున్నాయి.

నందు "బొమ్మ బ్లాక్ బస్టర్" టీజర్ రిలీజ్
రాజ్ విరాట్ దర్శకత్వంలో నందు, రష్మి హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న సినిమా 'బొమ్మ బ్లాక్‌బస్టర్'. ఈ సినిమా టైటిల్ లుక్ తో పాటు మోషన్ పోస్టర్ ని కూడా చిత్ర యూనిట్ సభ్యులు ఇటీవలే విడుదల చేశారు. నందు ఫస్ట్ లుక్ తో పాటు, రష్మీ గౌతమ్ లుక్స్ కి సైతం ఫుల్ క్రేజ్ రావడం విశేషం.
ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ గా రాజశేఖర్
యాంగ్రీ యంగ్ మెన్ గా పలు సూపర్ హిట్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి రాజశేఖర్ ప్రేక్షకులను అలరించారు. హీరో రాజశేఖర్ ఇప్పుడు ఒక కొత్త మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. జీవిత రాజశేఖర్ నిర్మాణ సారథ్యంలో ఒక క్రైమ్ థ్రిల్లర్ మూవీ రూపొందనుంది. ఈ మూవీ లో హీరో రాజశేఖర్ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ గా నటిస్తున్నారు.

బిగ్ బాస్ 4 - సైలెంట్ గా కెప్టెన్ అయిన కుమార్ సాయి
బిగ్ బాస్ 4 - ఫైనల్ గా మూడు రోజుల నుండి జరుగుతున్న కెప్టెన్సీ టాస్క్ నిన్న ఎపిసోడ్ తో ముగిసింది. మంగళవారం కిల్లర్ కాయిన్స్ అనే టాస్క్ బిగ్ బాస్ ఇవ్వగా దాని కొనసాగింపే నిన్న జరిగింది. ఇందులో నోయల్, అరియానా, దివి, అమ్మా రాజ శేఖర్లు ముందే ఔట్ అయ్యారు. సుజాత దగ్గర స్విచ్ కాయిన్ ఉండడంతో ఆమెను ఔట్ చేయాలని సలహాలు ఇచ్చింది అరియానా. ఈ విషయంలో నీ రన్నింగ్ కామెంట్రీ అవసరమా అంటూ అరియానాపై ఆగ్రహం వ్యక్తం చేసింది. మరో వైపు సోహైల్ అమ్మ రాజశేఖర్ కి సారీ చెప్పడం జరుగుతుంది. మూడో లెవల్లో భాగంగా ఇంటి సభ్యులు సామ, దాన, భేద దండోపాయాలతో కాయిన్స్ పెంచుకోవచ్చని బిగ్ బాస్ చెప్పడంతో కొంత మంది…
సూర్య కు గాత్ర దానం చేస్తున్న సత్వ దేవ్
సుధా కొంగర దర్శకత్వంలో సూర్య సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. తమిళ్ లో ‘సూరరై పోట్రు’ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా తెలుగులో ‘ఆకాశం నీ హద్దురా!’ టైటిల్‌తో విడుదల కానుంది. ఇక ఈ సినిమా ఎప్పుడో షూటింగ్ ను కంప్లీట్ చేసుకుంది. అయితే కరోనా వల్ల రిలీజ్ మాత్రం ఆపాల్సి వచ్చింది. ఇటీవలే ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ అవుతున్నట్టు వార్తలు రాగా వాటిపై స్పందించి ఓటీటీలో రిలీజ్ చేసే ప్లాన్ లేదని తెలిపారు

ఒరేయ్ బుజ్జిగా రివ్యూ - మంచి కామెడీ ఎంటర్టైనర్
ఓవరాల్ గా చెప్పాలంటే ఈ లాక్ డౌన్ లో ఇంట్లో ఉండి బోర్ ఫీల్ అయ్యేవాళ్ళకు ఈ కామెడీ ఎంటర్టైనర్ మంచి టైంపాస్ అవుతుంది. ఫుల్ కామెడీ చూసి నవ్వుకోవచ్చు..
సాగర సుందరి రష్మిక
తెలుగు , కన్నడ భాషలలో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుని రష్మిక సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా రాణిస్తున్నారు. రష్మిక ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న "పుష్ప " మూవీ లో కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే. కరోనా కారణం గా షూటింగ్ నిలిచిపోయిన "పుష్ప " మూవీ షూటింగ్ లో పాల్గొనడానికి రష్మిక ఆసక్తి తో ఎదురు చూస్తున్నారు. రష్మిక హీరోయిన్ గా నటించిన పాన్ ఇండియా మూవీ గా రూపొందిన కన్నడ మూవీ "పొగరు "విడుదలకు సిద్ధంగా ఉంది.
నెగటివ్ రోల్స్ కు సై - రాజ్ తరుణ్
సక్సెస్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ "ఉయ్యాలా జంపాలా " మూవీ తో టాలీవుడ్ కు హీరోగా పరిచయం అయిన రాజ్ తరుణ్ పలు సక్సెస్ ఫుల్ మూవీస్ లో తన కామెడీ తో ప్రేక్షకులను అలరించారు. విజయ్ కుమార్ కొండా దర్శకత్వంలో రాజ్ తరుణ్ హీరోగా రూపొందిన కామెడీ ఎంటర్ టైనర్ "ఒరేయ్ బుజ్జిగా "మూవీ "ఆహా "OTT ద్వారా అక్టోబర్ 1 వ తేదీ రిలీజ్ అయిన విషయం తెలిసిందే.

ఏడాది పూర్తి చేసుకున్న సైరా - బెస్ట్ ఎక్స్పీరియన్స్
సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో స్వతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా సైరా సినిమా వచ్చిన సంగతి తెలిసిందే కదా. చారిత్రక నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా గత ఏడాది 2019 అక్టోబర్ 2 న రిలీజ్ అయి నేటితో ఒక ఏడాది పూర్తి చేసుకుంది. చిరంజీవితో పాటు అమితాబ్ బచ్చన్, జగపతిబాబు, సుధీప్, విజయ సేతుపతి లాంటి పెద్ద పెద్ద స్టార్స్ అందరూ చిరు తో స్క్రీన్ ను షేర్ చేసుకోగా.. విజువల్ వండర్‌గా తీర్చిదిద్దిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంది.
ప్లాంట్ లేడీ సమంత
స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న సమంత సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ తన జీవిత విశేషాలను అభిమానులతో పంచుకుంటున్నారు. సమంత ఫస్ట్ టైమ్ నెగటివ్ రోల్ లో నటించిన "ది ఫ్యామిలీ మెన్ సీజన్ 2 " వెబ్ సిరీస్ త్వరలో ప్రసారం కానుంది. సక్సెస్ ఫుల్ "గేమ్ ఓవర్ "మూవీ ఫేమ్ అశ్విన్ శరవణన్ దర్శకత్వంలో తెలుగు , తమిళ భాషలలో హారర్ నేపథ్యంలో రూపొందనున్న మూవీ కి సమంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ మూవీ లో సమంత మూగ యువతిగా నటిస్తున్నారనీ , సైన్ లాంగ్వేజ్ లో ట్రైనింగ్ కూడా తీసుకున్నారనీ సమాచారం.
థియేటర్ లో మొదటి సినిమా నాదే
మొత్తానికి థియేటర్లు తెరుచుకునే టైం వచ్చేసింది. లాక్ డౌన్ వల్ల గత 8 నెలల నుండి థియేటర్స్ మూతపడే ఉన్నాయి. లాక్ డౌన్ తీసినా కూడా థియేటర్స్ కు మోక్షం రాలేదు ఇన్ని రోజులు. ఇక ఎంతో మంది సినీ లవర్స్ థియేటర్ ఎక్స్పీరియన్స్ ను మిస్ అయ్యారు. ఇక ఇప్పుడు అటు సినీ ఇండస్ట్రీకే కాదు.. సినీ లవర్స్ కు ఊరట కలిగే నిర్ణయం తీసుకుంది కేంద్రప్రభుత్వం. అన్‌లాక్ 5.0లో భాగంగా అక్టోబర్ 15 తర్వాత థియేటర్లు, మల్టీప్లెక్స్‌లను 50 % సిట్టింగ్ తో తెరుచుకునేందుకు అనుమతిని ఇచ్చింది. దీనితో కొన్ని నెలల తర్వాత మళ్ళీ ధియేటర్లు తెరుచుకోనున్నాయి. ఈ క్రమంలో తమ సినిమాలను ధియేటర్లలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
వర్క్ మోడ్ స్టైల్ లో శృతి హాసన్
తెలుగు , తమిళ భాషల సూపర్ హిట్ మూవీస్ లో మల్టీ టాలెంటెడ్ శృతి హాసన్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకుని స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. కరోనా లాక్ డౌన్ కారణం గా 6నెలలపాటు ఇంటికే పరిమితం అయిన శృతి షూటింగ్స్ పునః ప్రారంభం కావడంతో షూటింగ్స్ లో పాల్గొనడానికి ఉత్సాహం గా ఉన్నారు. శృతి ప్రస్తుతం "క్రాక్ "(తెలుగు ), "లాభం "(తమిళ ) మూవీస్ లో నటిస్తున్నారు. పవర్ స్టార్ పర కళ్యాణ్ హీరోగా రూపొందుతున్న కోర్ట్ డ్రామా "వకీల్ సాబ్ " మూవీ లో శృతి కథానాయిక గా ఎంపిక అయ్యారు.