సుధా కొంగర దర్శకత్వంలో సూర్య సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. తమిళ్ లో ‘సూరరై పోట్రు’ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా తెలుగులో ‘ఆకాశం నీ హద్దురా!’ టైటిల్‌తో విడుదల కానుంది. ఇక ఈ సినిమా ఎప్పుడో షూటింగ్ ను కంప్లీట్ చేసుకుంది. అయితే కరోనా వల్ల రిలీజ్ మాత్రం ఆపాల్సి వచ్చింది. ఇటీవలే ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ అవుతున్నట్టు వార్తలు రాగా వాటిపై స్పందించి ఓటీటీలో రిలీజ్ చేసే ప్లాన్ లేదని తెలిపారు
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఈ సినిమా తెలుగులో రిలీజ్ అవుతున్న నేపథ్యంలో సూర్యకు ఒక టాలెంటెడ్ నటుడు డబ్బింగ్ చెప్పనున్నట్టు తెలుస్తుంది. ఆ హీరో ఎవరో కాదు సత్య దేవ్. తెలుగులో సూర్య పాత్రకు సత్యదేవ్ డబ్బింగ్ చెప్పనున్నాడట. మరి సత్యదేవ్ వాయిస్ లో వుండే బేస్ సూర్య పాత్రకు కరెక్ట్ గా సెట్ అవుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మరి చూద్దాం ఎలాంటి స్పందన వస్తుందో
కాగా అపర్ణ బాలమురళి హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో మోహన్‌బాబు కీలక పాత్రలో నటిస్తున్నారు. జీవీప్రకాశ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫి నికేత్ బొమ్మి అందిస్తున్నాడు. కెప్టెన్ గోపినాధ్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాను సూర్య నిర్మిస్తున్నాడు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: