కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Telugu Film News 2020

ట్యాగ్ · 4140 కథనాలు · పేజీ 43

సినిమా వార్తలు

పెళ్లి పీటలు ఎక్కబోతున్న కాజల్

మొత్తానికి కరోనా సెలెబ్రిటీస్ సినిమా షూటింగ్స్ కు కలిసిరాలేదేమో కానీ పెళ్లిళ్లకు మాత్రం బాగానే కలిసొచ్చింది. టాలీవుడ్ లో మోస్ట్ బ్యాచిలర్స్ గా ఉన్న వాళ్ళకే పెళ్లిళ్లు అయిపోయాయి. రానా, నితిన్, నిఖిల్, సుజీత్ ఇలా చాలా మంది టాలీవుడ్ సెలబ్రిటీల పెళ్లిళ్లు జరిగాయి. ఇక ఇప్పుడు మరో స్టార్ హీరోయిన్ వివాహం కూడా కన్ఫామ్ అయిపోయింది. ఇప్పటికే ఐడియా వచ్చి ఉంటది కదా ఎవరిదో. ఇంకెవరిది కలువ కళ్ల సుందరి కాజల్ ది. గత కొద్దిరోజులుగా గౌతమ్ కిచ్లూ అనే వ్యాపార వేత్తను కాజల్ పెళ్లి చేసుకోబోతుందని.. కాజల్ పెళ్లి గురించి వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆ వార్తలపై కాజల్ నుండి ఇప్పటివరకూ ఎలాంటి రియాక్షన్ లేదు…

TFN Adminవాట్సాప్
Rashmika Mandanna's Hungama in Goa
సినిమా వార్తలు

గోవా లో రష్మిక సందడి

టాలీవుడ్ , శాండల్ వుడ్ లలో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను ఆకట్టుకుని సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా కొనసాగుతున్న రష్మిక సోషల్ మీడియా లో ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్న విషయం తెలిసిందే. గోవా లో ఎంజాయ్ చేసిన రష్మిక తన గోవా ట్రిప్ విశేషాలను ఇన్ స్టా గ్రామ్ లో ఒక వీడియో ద్వారా వెల్లడించారు.

Team TFNవాట్సాప్
Did you know where did the word tollywood originated from?
సినిమా వార్తలు

'టాలీవుడ్ ' పేరు ఎక్కడినుండి వచ్చిందో తెలుసా..?

ప్రతి ఏడాది వేరు వేరు లాంగ్వేజస్ నుండి ఎన్నో సినిమాలు విడుదలవుతూనే ఉంటాయి. దేశవ్యాప్తంగా బాలీవుడ్ సినీ పరిశ్రమ కాస్త పెద్దది.. ఆ తర్వాత మన టాలీవుడ్డే . అయితే దేశంలోనే ఎక్కువగా సినిమాలు తీసే ఇండస్ట్రీ ఒక్క టాలీవుడ్ మాత్రమే. ఒకప్పుడు హీరోలు తక్కువగా ఉన్నా ఒక్కో హీరో నుండి సుమారు ఐదారు సినిమాలు రిలీజ్ అయ్యేవి. ఇంకా పాత తరంకి వెళ్తే ఒక్కొక్కళ్ళు ఏడాదికి 10కి పైన సినిమాలు చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు టాలీవుడ్ లో హీరో ల సంఖ్య భారీగా పెరిగిపోయింది... చిన్న హీరోల నుండి బడా హీరోలు వరకు చాలామంది ఉన్నారు... దీంతో ప్రతి ఒక్కరూ ఏడాదికి రెండు మూడు సినిమాలు చేసేస్తున్నారు. ఇంకేముంది బాక్సాఫీస్ దగ్గర…

TFN Adminవాట్సాప్
ట్రైలర్ & టీజర్

'RRR' - భీమ్ స‌ర్‌ప్రైజ్ కు ముహూర్తం ఫిక్స్

మొత్తానికి ఏ సినిమా అప్ డేట్ కోసం.. ఏ సినిమా షూటింగ్ కోసం ఇన్ని రోజులు సినీ ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారో ఆ సినిమా షూటింగ్ స్టార్ట్ అయిపోయింది. మరి ఇంతకీ ఆ సినిమా ఏంటో ఐడియా వచ్చింది కదా. ఇంకేంటి దేశవ్యాప్తంగా అందరూ ఎదురుచూస్తున్న 'ఆర్ఆర్ఆర్' సినిమా. ఈ సినిమా అప్ డేట్ ఇస్తామని మేకర్స్ నిన్న చెప్పిన సంగతి తెలిసిందే కదా. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఒక వీడియో రిలీజ్ చేశారు. కరోనా వల్ల మార్చి నుండి షూటింగ్ ను జరపలేదని.. ఇప్పుడు మళ్లీ షూటింగ్ ను స్టార్ట్ చేశామని తెలిపారు. అంతేకాదు ఆ వీడియోలో గేట్స్ తెర‌వ‌డం, దుమ్ము ప‌ట్టిన వ‌స్తువుల‌ను దుల‌ప‌డం, లొకేష‌న్ ప‌రిస‌రాల‌ని శుభ్ర‌ప‌ర‌చ‌డంకు సంబంధించిన…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

హోమ్ ఐసోలేషన్ లో తమన్నా

టాలీవుడ్ , కోలీవుడ్ లలో ప్రేక్షకులను తనఅందం , అభినయం తో ఆకట్టుకుని తమన్నా స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న విషయం తెలిసిందే. సోషల్ మీడియా లో ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ తమన్నా అభిమానులను అలరిస్తున్నారు. తమన్నా ప్రస్తుతం "సీటీ మార్ ", "గుర్తుందా శీతాకాలం " మూవీస్ లో నటిస్తున్నారు. బాలీవుడ్ బ్లాక్ బస్టర్ "అంధాధున్ "తెలుగు రీమేక్ , ఒక వెబ్ సిరీస్ కు తమన్నా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

Team TFNవాట్సాప్
షూటింగ్ అప్‌డేట్

రంగంలో దిగిన 'టక్ జగదీష్'

ఇటీవలే 'వి' సినిమాతో అలరించాడు నాని. ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో నాని హీరోగా ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామాగా "టక్ జగదీష్" సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. లాక్ డౌన్ కు ముందే ఈ సినిమా 40 శాతం వరకూ షూటింగ్ ను పూర్తి చేసుకుంది. అయితే ఇక అందరూ సినిమా షూటింగ్ లు ప్రారంభిస్తున్న నేపథ్యంలో నాని కూడా రంగంలోకి దిగినట్టు తెలుస్తుంది. ఈ సినిమా షూటింగ్ ను మళ్లీ మొదలుపెట్టారట చిత్రయూనిట్. సినిమా రిలీజ్ సంగతి పక్కన పెడితే వీలైనంత త్వరగా సినిమా షూటింగ్ ను పూర్తిచేయాలన్న ప్లాన్ లో ఉన్నాడట నాని.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

అలియాపై క్లారిటీ తో రాజమౌళి

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణంతో నెపోటిజమ్ పై ఎన్ని చర్చలు జరిగాయో.. జరుగుతున్నాయో చూస్తూనే ఉన్నాం. ఈ నెపోటిజమ్ అనే కాన్సెప్ట్ వల్ల కొంతమంది బాలీవుడ్ వారసులు కూడా టార్గెట్ అయ్యారన్న సంగతి కూడా తెలుసు. అందులో ముఖ్యంగా అలియా బట్ కూడా ఒకరు. సడక్ 2 కు వచ్చిన డిస్ లైక్స్ ను చూస్తేనే చెప్పొచ్చు పాపం అలియా పై ఎంత ట్రోలింగ్ జరిగిందో. ఇక ఈ నేపథ్యంలో ఆర్ఆర్ఆర్ సినిమా నుండి కూడా అలియా తప్పుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తలపై స్పందించిన రాజమౌళి అలియా ప్లేస్ లో ఇంకే హీరోయిన్ ను రీప్లేస్ చేయనని చెపుతున్నాడు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

'ఆర్ఆర్ఆర్' - ఇప్పుడు మా వంతు

దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో స్టార్ట్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటిస్తున్న భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’. చరణ్ ‘మన్నెం దొర అల్లూరి సీతారామరాజు’గా కనిపిస్తుండగా తారక్ ‘కొమరం భీమ్’ పాత్రలో నటిస్తున్నాడు. ఇక ఈ చిత్రంపై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో.. ఈ సినిమా కోసం అభిమానులు ఏ రేంజ్ లో ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికే మేకర్స్ విడుదల చేసిన రామ్‌చరణ్ ఇంట్రో వీడియో విశేషంగా ఆకట్టుకుంది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

హీరో రవితేజ మూవీలో హీరోయిన్స్

మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వాస్తవ సంఘటన లతో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ "క్రాక్ " మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఆ మూవీ షూటింగ్ ముగింపు దశలో ఉంది. "క్రాక్ " మూవీ తరువాత రవితేజ , సక్సెస్ ఫుల్ "రాక్షసుడు " మూవీ ఫేమ్ రమేష్ వర్మ దర్శకత్వంలో ఒక మూవీ కి గ్రీన్ సిగ్నల్ఇచ్చారు. ప్రస్తుతం రమేష్ వర్మ దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరో గా "అల్లుడు అదుర్స్ " మూవీ రూపొందుతుంది .

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

ఫాంటసీ డ్రామా మూవీ లో తాప్సీ

ఫ్యాషన్ స్టూడియోస్ బ్యానర్ పై దీపక్ సుందర్ రాజన్ దర్శకత్వంలో తాప్సీ ప్రధాన పాత్రలో ఒక ఫాంటసీ డ్రామా తమిళ మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. హీరో విజయ్ సేతుపతి ఒక కీలక పాత్రలో నటించారు. ఈ మూవీ లో తాప్సీతో పాటు విజయ్ సేతుపతి కూడా ద్విపాత్రాభినయం చేయడం విశేషం. రాజస్థాన్ జైపూర్ పరిసరాలలో చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ అయ్యింది. ఈ మూవీ కి "అన్నాబెల్లె సుబ్రమణ్యం" టైటిల్ పరిశీలనలో ఉంది.

Team TFNవాట్సాప్
Krishna Vamsi Feel Good Family Entertainer Ninne Pelladatha Completes 24 Years.
సినిమా వార్తలు

24 వసంతాల "నిన్నే పెళ్ళాడతా "

అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై కృష్ణవంశీ దర్శకత్వంలో నాగార్జున , టబు జంటగా రూపొందిన రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్"నిన్నే పెళ్ళాడతా " మూవీ 1996 సంవత్సరం లో అక్టోబర్ 4 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. బెస్ట్ ఫిల్మ్ గా నేషనల్ అవార్డ్ అందుకున్న ఈ మూవీ కి సందీప్ చౌతా సంగీతం అందించారు. 3 ఫిల్మ్ ఫేర్ , 2 నంది అవార్డ్స్ అందుకున్న "నిన్నే పెళ్ళాడతా "మూవీ 4 సెంటర్స్ లో 175 డేస్ ప్రదర్శించబడింది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

పవన్ తో సుదీప్ భేటీ

సినీ నటుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ను కన్నడ స్టార్ హీరో సుదీప్ కలవడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. తెలుగు రాష్ట్రాల్లో పవన్ కల్యాణ్ కు ఎంత ఇమేజ్ ఉందో కర్నాటకలో సుదీప్ కి అంత ఇమేజ్ ఉంది. ఈ నేపథ్యంలో ఏదైనా సినిమా కోసం వీరిద్దరూ భేటీ అయ్యారా..? నార్మల్ గానే భేటీ అయ్యారా? అని ఇప్పటికే పలు వార్తలు వచ్చేసాయి. అయితే వీరిద్దరూ క్యాజువల్ గానే మీట్ అయినట్టు తెలుస్తుంది. ఈ సందర్భంగా దాదాపు గంటసేపు ఇద్దరూ సినిమాలు.. కరోనా నిబంధనలు పాటిస్తూ సినిమా షూటింగ్స్ చేయడం.. ఇంకా సామాజిక అంశాలపై మాట్లాడుకున్నట్టు సమాచారం. మరి ఎందుకు కలిసారో తెలియాలంటే మాత్రం కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.

TFN Adminవాట్సాప్
ట్రైలర్ & టీజర్

త్వరలో రానున్న 'మాస్టర్' టీజర్

సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూసే సినిమాల్లో తమిళ్ స్టార్ హీరో విజయ్ 'మాస్టర్' సినిమా కూడా ఒకటని చెప్పొచు. ఎందుకంటే కేవలం తమిళ్ లోనే కాదు విజయ్ తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. నగరం, ఖైదీ చిత్రాల దర్శకుడు లొకేష్‌ కనకరాజ్‌ దర్శకత్వంలో విజయ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా 'మాస్టర్‌'. తమిళంతో పాటు తెలుగులోనూ ఈ సినిమా రిలీజ్ చేయనున్నారు. కరోనా లేకపోతే ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ అయి ఉండేది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

సరదాగా నవ్వుకునే 'ఒరేయ్ బుజ్జిగా'

విజ‌య‌కుమార్ కొండా ద‌ర్శ‌క‌త్వంలో హీరో రాజ్ త‌రుణ్‌, హీరోయిన్ మాళ‌వికా నాయ‌ర్ జంట‌గా న‌టించిన చిత్రం 'ఒరేయ్ బుజ్జిగా'. కేకే రాధ‌మోహ‌న్ నిర్మించిన ఈ సినిమా అక్టోబ‌ర్ 2న ఆహాలో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఇక కామెడీ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈ సినిమా మంచి రివ్యూస్ నే సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా లో ఇంట్రెస్టింగ్ పాయింట్స్ గురించి చెప్పుకోవాలంటే...

TFN Adminవాట్సాప్
Romantic Movie Team Releases An Interesting Update About The Movie Release
సినిమా వార్తలు

"రొమాంటిక్ " మూవీ అప్ డేట్

పూరి కనెక్ట్స్ (పూరి జగన్నాథ్ &ఛార్మి ) బ్యానర్ పై అనిల్ పాదూరి దర్శకత్వంలో ఆకాష్ పూరి హీరోగా రొమాంటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్"రొమాంటిక్ " మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. మోడల్ కేతిక శర్మ కథానాయిక. సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. మందిరా బేడీ , మకరంద్ , దివ్యదర్శిని ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. సునీల్ కశ్యప్ సంగీతం అందించారు. "రొమాంటిక్ " మూవీకి స్టోరీ , స్క్రీన్ ప్లే , డైలాగ్స్ ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ అందించారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

హీరో ప్రభాస్, అనుష్క ల పెళ్ళి ఫోటో ?

తెలుగు, తమిళ బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ అనుష్క స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. అనుష్క ప్రధాన పాత్రలో నటించిన థ్రిల్లర్ "నిశ్శబ్ధం " మూవీ లో అద్భుతంగా నటించి అనుష్క ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. స్టార్ హీరోయిన్ అనుష్క సోషల్ మీడియా ట్విట్టర్ లో జాయిన్ అయిన విషయం తెలిసిందే. తనకు సంబంధించిన అప్ డేట్స్ ను అనుష్క అభిమానులతో పంచుకుంటున్నారు. తాజాగా అభిమానులు అడిగిన ప్రశ్నలకు అనుష్క ట్విట్టర్ ద్వారా జవాబిచ్చారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

తమన్నా కు కరోనా పాజిటివ్

కరోనా వల్ల ఆగిన షూటింగ్స్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి. ఇక హీరో హీరోయిన్స్ ఎవరి సెట్ లలో వాళ్లు వాలిపోతున్నారు. ప్రభాస్ ఏకంగా రాధే శ్యామ్ షూట్ కోసం ఇటలీనే వెళ్ళిపోయాడు. ఇక ఇందులో భాగంగానే మిల్కీ బ్యూటీ కూడా గత కొద్దీ రోజులుగా షూటింగ్ లో పాల్గొంటున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు తమన్నాకు కరోనా పాజిటివ్ వచ్చినట్టు తెలుస్తుంది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

బెస్ట్ ప్లేస్ యూరోప్ - విజయ్ దేవరకొండ

సెన్సేషనల్ హిట్ "అర్జున్ రెడ్డి " మూవీ లో విజయ్ దేవరకొండ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకుని బెస్ట్ యాక్టర్ గా ఫిలిం ఫేర్ అవార్డ్ అందుకున్నారు. బ్లాక్ బస్టర్ "గీత గోవిందం " మూవీ తో విజయ్ యూత్ లో క్రేజీ హీరోగా మారారు. విజయ్ ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెలుగు , హిందీ భాషలలో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ "ఫైటర్ " మూవీ లో నటిస్తున్నారు. పాన్ ఇండియా మూవీ గా రూపొందుతున్న "ఫైటర్" మూవీ తో విజయ్ బాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు.

Team TFNవాట్సాప్
Rang De Movie Team Plans To Head To Italy For Movie Shooting
షూటింగ్ అప్‌డేట్

ఇటలీ లో "రంగ్ దే !"

సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై వెంకీ అట్లూరి దర్శకత్వంలో నితిన్ , కీర్తి సురేష్ జంటగా రొమాంటిక్ ఎంటర్ టైనర్ "రంగ్ దే " మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. నరేష్ , బ్రహ్మాజీ , వినీత్ , వెన్నెలకిషోర్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. లాక్ డౌన్ కారణంగా "రంగ్ దే " మూవీ షూటింగ్ నిలిచిపోయింది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

కియారా అద్వానీ బ్లాక్ &వైట్ ఫొటో

బ్లాక్ బస్టర్ "భరత్ అనే నేను " మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీ తన అందం , అభినయంతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న విషయం తెలిసిందే. సూపర్ హిట్ " అర్జున్ రెడ్డి " మూవీ హిందీ రీమేక్ "కబీర్ సింగ్ " మూవీ లో కియారా కథానాయికగా నటించారు. "కబీర్ సింగ్ " మూవీ రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఆ మూవీ ఘనవిజయం తో కియారా హిందీ మూవీస్ లో బిజీగా మారారు. కియారా కథానాయిక గా నటించిన "లక్ష్మీ బాంబ్ ", "ఇందూ కి జవానీ " మూవీస్ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.

Team TFNవాట్సాప్

షేర్