కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Telugu Film News 2020

ట్యాగ్ · 4140 కథనాలు · పేజీ 45

షూటింగ్ అప్‌డేట్

శర్వా ద్విభాషా చిత్రం షూటింగ్ పునఃప్రారంభం

టాలీవుడ్ హీరోలు ఒక్కొక్కరూ షూటింగ్ లు మొదలుపెడుతున్నారు. దాదాపు చాలా మంది ఇప్పటికే కెమెరా ముందుకు వచ్చారు. ప్రభాస్ అయితే ఏకంగా ఇటలీకి పయనమయ్యాడు. ఇక ఇప్పుడు తాజాగా శర్వా కూడా షూట్ ను స్టార్ట్ చేసేసాడు. ప్రస్తుతం కిషోర్ రెడ్డి దర్శకత్వంలో శర్వానంద్ రైతు సమస్యల నేపథ్యం లో శ్రీకారం సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

TFN Adminవాట్సాప్
ఫస్ట్ లుక్

నితిన్ కొత్తసినిమా టైటిల్, ప్రీ లుక్ రిలీజ్

నితిన్-చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటివరకూ ఈ సినిమాపై ఎలాంటి అప్ డేట్ ఇవ్వని చిత్ర యూనిట్ ఇప్పుడు ఈ సినిమా టైటిల్ ను అలాగే ఒకే సారి ప్రీ లుక్ ను కూడా రిలీజ్ చేశారు. ప్ర‌ముఖ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ ఈ సినిమా టైటిల్ ను ప్రీ లుక్ ను రిలీజ్ చేశారు. ఇక ఈ సినిమాకు చెక్ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. ప్రీ లుక్ లో నితిన్ చేతికి సంకెళ్ల‌తో ఉండ‌గా..అత‌డి ముందు చెస్ కాయిన్స్ క‌నిపిస్తున్నాయి. పోస్ట‌ర్ చూస్తుంటే డైరెక్ట‌ర్ చంద్ర‌శేఖ‌ర్ యేలేటి థ్రిల్ల‌ర్ స్టోరీతో సినిమాను డిజైన్ చేసిన‌ట్టు తెలుస్తోంది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

పెళ్లి ఫొటో తో మామను స్మరించుకున్న చిరు

ఈ రోజు అల్లు రామలింగయ్య 99వ జయంతి అన్న సంగతి తెలిసిందే. ఇక ఈ సందర్భంగా అల్లు, మెగా ఫ్యామిలీతో పాటు అభిమానులందరూ ఆయన్ని గుర్తుచేసుకుంటున్నారు. ఇప్పటికే ఆయనకు గుర్తుగా అల్లు స్టూడియోస్ ను నిర్మించనున్నట్టు అల్లు అరవింద్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు అల్లుడు మెగా స్టార్ చిరంజీవి కూడా మామయ్యను సోషల్ మీడియా ద్వారా గుర్తుచేసుకున్నారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

యోగా మంచిదే - అనుష్క

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ , కోన ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్స్ పై హేమంత్ మధుకర్ దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ అనుష్క ప్రధాన పాత్రలో తెలుగు , తమిళ భాషలలో రూపొందిన థ్రిల్లర్ "నిశ్శబ్ధం "మూవీ అక్టోబర్ 2 వ తేదీ అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా ప్రపంచవ్యాప్తం గా రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. అనుష్క మ్యూట్ ఆర్టిస్ట్ గా నటించిన "నిశ్శబ్ధం "మూవీ పూర్తిగా US లో రియల్ లొకేషన్స్ లో షూటింగ్ జరుపుకొనడం విశేషం. "నిశ్శబ్ధం "మూవీ ప్రమోషన్స్ లో భాగంగా అనుష్క ఒక ఇంటర్వ్యూ లో పాల్గొన్నారు.

Team TFNవాట్సాప్
బిగ్ బాస్

బిగ్ బాస్ 4 - కిల్లర్ కాయిన్స్ టాస్క్ లో లొల్లి

బిగ్ బాస్ 4 నాలుగో వారంలో కెప్టెన్సీ టాస్క్ మొదలైంది. కెప్టెన్సీ కోసం ఇంటి సభ్యులు బాగానే గేమ్ ఆడుతున్నారు. కిల్లింగ్ కాయిన్స్ అనే టాస్క్ లో కాయిన్లు సంపాదించాల‌నేది బిగ్ బాస్ ఇంటి స‌భ్యుల‌కు ఇచ్చిన టాస్క్. బజర్ మోగినప్పుడల్లా కాయిన్స్ వేస్తుంటే ఇంటి సభ్యులు సేకరించాలి. ఇక కిందా మీదా పడి ఎలాగోల కాయిన్స్ ను సంపాదించుకున్నారు. కొంతమంది పక్కన వాళ్లవి లాక్కున్నారు. గొడవ పడ్డారు. ఇక నిన్న రాత్రి ఎపిసోడ్ లో అయితే సోహైల్, మెహబూబ్ లు మొత్తం వేరే వాళ్ల కాయిన్స్ ను దొంగతనం చేసే పనిలో పడ్డారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

"RED " మూవీ దీపావళికి థియేటర్స్ లో రిలీజ్ ?

శ్రీ స్రవంతి మూవీస్ బ్యానర్ పై కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఎనర్జిటిక్ హీరో రామ్ కథానాయకుడుగా రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ "RED " మూవీ కరోనా కారణం గా విడుదల వాయిదా పడింది. హీరో రామ్ ద్విపాత్రాభినయం చేసిన ఈ మూవీ లో నివేత పేతురాజ్ , మాళవిక శర్మ , అమృత అయ్యర్ కథానాయికలు. సంపత్ రాజ్ , నాజర్ , వెన్నెల కిషోర్ ముఖ్య పాత్ర లలో నటించారు. మణిశర్మ సంగీతం అందించారు. సూపర్ హిట్ "తడమ్ "తమిళ మూవీ కి తెలుగు రీమేక్ గా "RED " మూవీ రూపొందింది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

త్రిష స్వీట్ మెమొరీ

1999 సంవత్సరంలో సెప్టెంబర్ 30 వ తేదీ 16 సంవత్సరాల వయసు లో "మిస్ చెన్నై "గా క్రౌన్ గెలుచుకున్న త్రిష అదే సంవత్సరం సినీ కెరీర్ ప్రారంభించారు. తెలుగు , తమిళ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో 2దశాబ్దాలుగా ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. పలు మూవీస్ కు త్రిష బెస్ట్ యాక్ట్రెస్ గా అవార్డ్స్ అందుకున్నారు. హీరోయిన్ త్రిష నటించిన తమిళ మూవీస్ "పరమపద విలయాట్టు ", "గర్జన "షూటింగ్ కంప్లీట్ చేసుకున్నాయి.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

విజయ్ దేవరకొండ ఇన్ స్టాగ్రామ్ రికార్డ్

"నువ్విలా ", "లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ", "ఎవడే సుబ్రమణ్యం " వంటి మూవీస్ లో చిన్న పాత్రలలో నటించిన విజయ్ దేవరకొండ హీరోగా మారి "పెళ్ళిచూపులు " మూవీ తో ఘనవిజయం సాధించారు. సెన్సేషనల్ హిట్ "అర్జున్ రెడ్డి " మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి విజయ్ ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. ఆ మూవీ కి విజయ్ బెస్ట్ యాక్టర్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకున్నారు. "అర్జున్ రెడ్డి " మూవీతో విజయ్ యూత్ లో యెనలేని క్రేజ్ పెంపొందించుకున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

'అల్లు స్టూడియోస్' కు శ్రీకారం

తెలుగు సినీ చరిత్రలో కామెడీకి కొత్త అర్ధం చెప్పి... తన హావ భావాలతో ఎంతోమంది తెలుగు ప్రేక్షకులను నవ్వించిన నవ్వుల రేడు అల్లు రామలింగయ్య. కేవలం కామెడీ పాత్ర‌లు మాత్రమే కాదు విల‌న్ ప‌క్క‌న వుండే కామెడీ విల‌న్ పాత్ర‌ల్లో కూడా తన కామెడీతో నవ్వించేవారు. పాత్ర చిన్నదైనా, పెద్దదైనా సరే నవ్వులు పూయించి అలరించేవారు అల్లు రామలింగయ్య. వెయ్యికిపైగా చిత్రాల్లో అల్లు అభినయం జనానికి కితకితలు పెట్టింది. ఇప్పుడు అల్లు వారి ఫ్యామిలీ ఇంత స్థాయిలోఉండటానికి ఒకరకంగా అల్లు రామలింగయ్యే కారణమని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఈరోజు అల్లు రామలింగయ్య 99వ జయంతి.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

ట్విట్టర్ లోకి అధికారికంగా వచ్చిన అనుష్క

సెలబ్రిటీస్ సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటారన్న సంగతి తెలిసిందే. ట్విట్టర్లో కానీ ఇన్స్టాలో కానీ తమ సినిమాలకు సంబంధించి.. వ్యక్తిగత విషయాలు కూడా తెలుపుతుంటారు. ఒక రకంగా అభిమానులకు ఎప్పటికప్పుడు దగ్గరగా ఉండటానికి ఉపయోగపడతాయి ఇవి. ఇప్పుడు అనుష్క కూడా ఈ ప్రపంచంలోకి వచ్చేసింది.అధికారికంగా తన ట్విట్టర్ అకౌంట్‌ను ప్రకటిస్తూ.... మీరంతా క్షేమంగా ఉన్నారని భావిస్తున్నాను. మీరంతా ఎలాంటి సమస్యలు లేకుండా ఉండాలని కోరుకొంటుననాను. ఇక నుంచి నా గురించి, నా సినిమా గురించి నా ట్విట్టర్ అకౌంట్‌ను ఫాలో అవ్వండి. రానున్న రోజుల్లో చాలా విషయాలు తెలుస్తాయి అని అనుష్క ట్వీట్ చేసింది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

పర్ఫెక్ట్ టైమింగ్ అంటే మన హీరోలదే

ఒకప్పుడు లాగ కాకుండా ఇప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోస్ అంతా చాలా ఫ్రెండ్లీగా ఉంటున్నారు. యంగ్ హీరోస్ అంతా ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ తోడుగా వుంటున్నారు. అంతేకాదు ఒకరి సినిమా ప్రమోషన్స్ లో మరొకరు పాల్గొంటూ అటు సినిమాకు సపోర్ట్ ఇవ్వడమే కాకుండా.. ఫ్యాన్స్ కు కూడా తమ మధ్య ఎలాంటి భేదాభిప్రాయాలు లేవు.. మీరు కూడా ఫ్రెండ్లీ గా ఉండాలని పరోక్షంగా చెపుతున్నారు. ఇండస్ట్రీలో మహేష్ – తారక్, రామ్ చరణ్ బెస్ట్ ఫ్రెండ్స్, గోపి చంద్ – ప్రభాస్ ఫ్రెండ్స్, రామ్ చరణ్ – ఎన్టీఆర్ బెస్ట్ ఫ్రెండ్స్.. మంచు మనోజ్ అయితే అందరి కుర్ర హీరోలతో ఫ్రెండ్లీ గా ఉంటాడు. ఇంకా ఇలాంటి ఫ్రెండ్ షిప్పులు ఇండస్ట్రీలో చాలానే ఉన్నాయి.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

రక్త దానానికై బాలకృష్ణ పిలుపు

అక్టోబర్ 2వ తేదీ గాంధీ జయంతి సందర్భంగా తలసేమియా బాధితులకొరకు తెలంగాణ యువత , ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రక్త దాన శిబిరం నిర్వహిస్తున్నామనీ , ఆరోగ్యంగా ఉన్న ప్రతీ ఒక్కరూరక్త దానం చేసి ఆపదలో ఉన్నవారిని కాపాడాలని నందమూరి బాలకృష్ణ ప్రజలకు పిలుపునిచ్చారు.

Team TFNవాట్సాప్
షూటింగ్ అప్‌డేట్

ఛలో ఇటలీ - రాధే శ్యామ్ నెక్స్ట్ షెడ్యూల్

కరోనా కారణంగా ఆగిపోయిన సినిమాల షూటింగ్లు ఇప్పుడిప్పుడే మొదలవుతున్నాయి. నిన్న మొన్నటివరకూ ఇక్కడే షూటింగ్ స్టార్ట్ చేయగా ఇప్పుడు విదేశాల్లో షూటింగ్ లు కూడా స్టార్ట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రాధేశ్యామ్ టీం కూడా ఇటలీకి పయనమైనట్టు తెలుస్తుంది. లాక్ డౌన్ ముందు అక్కడ కొంత చిత్రీకరణ జరుపుకుంది రాధేశ్యామ్ సినిమా. కరోనా వల్ల ఇక్కడికి రావాల్సి వచ్చింది. ఇక మొన్నటి వరకూ విదేశాల్లో కరోనా ప్రభావం ఎక్కువ ఉండడంతో అక్కడ చాలా వరకూ షూటింగ్లకు అనుమతి ఇవ్వలేదు. ఇప్పుడు విదేశాలకు కూడా గ్రీన్ సిగ్నల్ రావడంతో వెంటనే రాధేశ్యామ్ షూటింగ్ కోసం వెళ్లిపోయారు. వీలైనంత తొందరగా అక్కడి షెడ్యూల్ ను పూర్తి చేసి తిరిగి…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

'నిశ్శబ్దం' ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్

హేమంత్‌ మధుకర్ దర్శకత్వంలో అనుష్క కథానాయికగా నటిస్తున్న చిత్రం ‘నిశ్శబ్దం’. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై విశ్వప్రసాద్‌ నిర్మించారు. అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో ద్వారా ఈ చిత్రం అక్టోబర్‌ 2న ప్రేక్షకులముందుకు రానున్న ఈ సినిమాలో కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాల గురించి తెలుసుకుందాం..

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

నితిన్ కొత్త సినిమా టైటిల్ రిలీజ్ కు ముహూర్తం ఫిక్స్

భీష్మ సినిమా తర్వాత వరుస సినిమాలను లైన్ లో పెట్టాడు నితిన్. ప్రస్తుతం వెంకీ అట్లూరి దర్శకత్వంలో నితిన్ హీరోగా 'రంగ్ దే' సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. రంగ్ దే సినిమా షూటింగ్ ను కూడా మొదలు పెట్టాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ మొదలవ్వగా.. కరోనా వల్ల షూట్ కు బ్రేక్ పడింది. మళ్లీ ఇప్పుడు షూట్ ను మొదలుపెట్టారు. ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుండగా సితార ఎంటర్టైన్మెంట్స్‌ నిర్మిస్తోంది. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు పి సి శ్రీరామ్ ఛాయాగ్రహణం సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నాడు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

రెస్ట్ తీసుకోడానికి బెస్ట్ ప్లేస్.. నాన్నా నువ్వే బెస్ట్

సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురు .. సితార సోష‌ల్ మీడియాలో ఎంత‌ యాక్టివ్ గా ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌స‌రం లేదు. స్వయంగా ఒక యూ ట్యూబ్ ఛానల్ నే మైంటైన్ చేస్తుందంటేనే చెప్పొచ్చు ఎంత టాలెంట్ ఉందో. వంశీ పైడిపల్లి కూతురు ఆద్య తో కలిసి పలు వీడియోలు చేస్తూ సందడి చేస్తూనే ఉంటుంది. అంతేకాదు ఎప్ప‌టిక‌పుడు ఏదో ఒక ఫొటోనో, వీడియోనో పోస్ట్ చేసి నెటిజ‌న్ల‌ను ప‌లుక‌రిస్తూనే ఉంటుంది.

TFN Adminవాట్సాప్
షూటింగ్ అప్‌డేట్

'రెడ్' సినిమా - డబ్బింగ్ పూర్తి చేసిన రామ్

కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఎనర్జిటిక్ హీరో రామ్ ప్రధాన పాత్రలో 'రెడ్' అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ పొడక్షన్ పనులు జరుపుకుంటుంది. తమిళంలో సూపర్ హిట్ అయిన 'తడం' సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ నుఇటీవలే రిలీజ్ చేయగా.. రామ్ లుక్స్ ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా బాగానే జరిగినట్టు కూడా తెలుస్తుంది. ఇక తాజాగా ఈ సినిమా డబ్బింగ్ కూడా పూర్తి చేసినట్టు తెలుస్తుంది. రామ్ తన డబ్బింగ్ పూర్తి చేసినట్టు తన ఇన్స్టా ద్వారా తెలిపాడు.

TFN Adminవాట్సాప్
Fighter Movie To Resume Shooting Work In October
షూటింగ్ అప్‌డేట్

అక్టోబర్ లో "ఫైటర్ "షూటింగ్ పునః ప్రారంభం

పూరి కనెక్ట్స్ , ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై పూరి జగన్నాథ్ దర్శకత్వంలో సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ , బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనన్య పాండే జంటగా యాక్షన్ ఎంటర్ టైనర్ "ఫైటర్ " మూవీ తెలుగు, హిందీ భాషలలో రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లో తన పాత్రకై విజయ్ థాయ్ ల్యాండ్ లో మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ తీసుకున్నారు. "ఫైటర్ " మూవీ తో విజయ్ బాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

హీరో నాగశౌర్య న్యూ లుక్

"ఊహలు గుసగుస లాడే ", కల్యాణ వైభోగమే ", జ్యో అచ్యుతానంద ", చలో ", ఓ బేబీ ", "అశ్వద్ధామ "వంటి మూవీస్ తో నాగశౌర్య ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. హీరో నాగశౌర్య ప్రస్తుతం సంతోష్ జాగర్లమూడి దర్శకత్వంలో ప్రాచీన క్రీడ ఆర్చరీ నేపథ్యంలో రూపొందుతున్న #NS20 మూవీ లో ఆర్చర్ గా నటిస్తున్నారు. ఈ మూవీ కై సిక్స్ ప్యాక్ అబ్స్ సాధించిన నాగశౌర్య ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

ప్రతీ సినిమాను ఛాలెంజ్ గా తీసుకొంటా -తమన్నా

15 సంవత్సరాలుగా తెలుగు , తమిళ , హిందీ భాషల చిత్రాలలో తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుని తమన్నా స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. టాలెంటెడ్ యాక్ట్రెస్ తమన్నా ఫస్ట్ టైమ్ కబడ్డీ నేపథ్యంలో రూపొందుతున్న స్పోర్ట్స్ డ్రామా "సీటీ మార్ "మూవీ లో కథానాయికగా నటిస్తున్నారు. బాలీవుడ్ లో తమన్నా "బోలే చూడియన్ " మూవీ లో నటిస్తున్నారు. "గుర్తుందా శీతాకాలం " మూవీ కి తమన్నా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. బాలీవుడ్ మూవీ "అంధాధున్"తెలుగు రీమేక్ మూవీ లో ఒక కీలక పాత్రకు తమన్నా ఎంపిక అయ్యారు.

Team TFNవాట్సాప్

షేర్