రాజ్ విరాట్ దర్శకత్వంలో నందు, రష్మి హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న సినిమా ‘బొమ్మ బ్లాక్‌బస్టర్’. ఈ సినిమా టైటిల్ లుక్ తో పాటు మోషన్ పోస్టర్ ని కూడా చిత్ర యూనిట్ సభ్యులు ఇటీవలే విడుదల చేశారు. నందు ఫస్ట్ లుక్ తో పాటు, రష్మీ గౌతమ్ లుక్స్ కి సైతం ఫుల్ క్రేజ్ రావడం విశేషం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తాజాగా ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేశారు. ఇక టీజర్ ను బట్టి ఈ సినిమాలో నందు పోతురాజు పాత్రలో, పూరీ జగన్నాథ్ అభిమానిగా కనిపిస్తున్నాడు. కొంత లవ్, కొంత కామెడీ మరికొంత యాక్షన్ ఫిల్మ్‌లా కనిపిస్తోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ మాట్లాడుతూ నందు పోషించిన పోతురాజు పాత్ర వైవిధ్యంగా ఉండబోతుందని, నందు పాత్రకు ధీటుగా రష్మీ గౌతమ్ పాత్ర కూడా ఉండబోతుందని చెబుతున్నారు.ఈ చిత్రం షూటింగ్ తో అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని విడదులకు సిద్ధంగా ఉందని చిత్ర నిర్మాతలు ప్రవీణ్ పగడాల, బోసుబాబు నిడుమోలు, ఆనంద్ రెడ్డి మద్ది, మనోహర్ రెడ్డి యెడ తెలిపారు.
కాగా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాను విజయీభవ ఆర్ట్స్ పతాకం పై పవ్రీణ్ పగడాల, బోస్ బాబు నిడిమోలు, ఆనంద్ రెడ్డీ, మనోహార్ రెడ్డి తెరకెక్కిస్తున్నారు. ఈసినిమాకు ప్రశాంత్ విహారి సంగీతం అందిస్తున్నాడు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: