చిట్టి బాబు లాంటి పాత్రలో సుధీర్ బాబు ..!

Sudheer Babu Once Again To Come Up With A Versatile Role In His Upcoming Movie Directed By Palasa Director

ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో నాని-సుధీర్ బాబు కాంబినేష‌న్ లో వ‌చ్చిన ‘వి’ మూవీ ఇటీవలే అమెజాన్ లో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా విజయం సంగతి పక్కన పెడితే.. ఈ సినిమాలో పోలీస్ పాత్రలో నటించిన సుధీర్ బాబుకు మాత్రం మంచి మార్కులు పడ్డాయి. ఇప్పటివరకూ కాస్త ల‌వ‌ర్ బాయ్ రోల్స్ లో క‌నిపించిన సుధీర్ బాబుకు ఈ సినిమా క‌మ‌ర్షియ‌ల్ హీరోగా మారడానికి బాగా ఉపయోగపడిందని చెప్పొచ్చు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా ప‌‌లాస ఫేం క‌రుణ‌కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్న సినిమాలో సుధీర్‌బాబు నటిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక గ్రామీణ నేప‌థ్యంలో తెర‌కెక్క‌నున్న ఈ సినిమాలో సుదీర్ బాబు పాత్ర రంగ‌స్థ‌లంలో రాంచ‌ర‌ణ్ పోషించిన చిట్టిబాబు రోల్ త‌ర‌హాలో సాగుతుంద‌ని వినిపిస్తుంది. వింటేజ్ బ్యాక్ డ్రాప్ లో భారీ బ‌డ్జెట్ తో ఈ సినిమా తెర‌కెక్కించ‌నున్న‌ట్టు తెలుస్తోంది. అయితే ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సి ఉంది.

కాగా వాస్తవ సంఘటనల నేపథ్యంలో తెరకెక్కిన సినిమా ‘పలాస 1978’ తో దర్శకుడిగా టాలీవుడ్ కు పరిచయమయ్యాడు కిరణ్ కుమార్. ఈ ఏడాది మార్చి నెలలో న విడుదలైన ఈ సినిమాకు మంచి ప్రశంసలు దక్కాయి. మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు కరుణ కుమార్. ఆనాటి సామాజిక, రాజకీయ పరిస్థితులను చాలా న్యాచురల్ గా చిత్రీకరించిన విధానానికి చాలా మంది ఫిదా అయ్యారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.