లెజెండరీ యాక్ట్రెస్ , అతిలోక సుందరి తనయ జాన్వీ కపూర్ మరాఠీ మూవీ “సైరాట్ ” హిందీ రీమేక్ మూవీ “ధడక్” తో బాలీవుడ్ కు పరిచయం అయ్యారు. “ధడక్” మూవీ ఘనవిజయం సాధించి 100 కోట్ల క్లబ్ లో చేరింది. అంథాలజీ మూవీ “ఘోస్ట్ స్టోరీస్”లో ఒక ఎపిసోడ్ లో జాన్వీ నటించారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఫైటర్ పైలట్ గుంజన్ సక్సేనా జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన ” గుంజన్ సక్సేనా : ది కార్గిల్ ” మూవీ తో జాన్వీ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. జాన్వీ హీరోయిన్ గా “రూహి అఫ్జానా”, “దోస్తానా 2 ” మూవీస్ రూపొందుతున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
హీరోయిన్ జాన్వీకపూర్ ఇప్పుడు రెండు రీమేక్ మూవీస్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మథుకుట్టి దర్శకత్వంలో అన్నా బెన్ ప్రధాన పాత్రలో రూపొందిన సర్వైవల్ థ్రిల్లర్ “హెలెన్ “మలయాళ మూవీ ఘనవిజయం సాధించింది. ఆ మూవీ హిందీ రీమేక్ మూవీలో జాన్వీ కథానాయికగా ఎంపిక అయ్యారు. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో లేడీ సూపర్ స్టార్ నయనతార ప్రధాన పాత్రలో రూపొందిన బ్లాక్ కామెడీ క్రైమ్ థ్రిల్లర్ “కొలమావు కోకిల “తమిళ మూవీ ఘనవిజయం సాధించింది. ఈ తమిళ మూవీ హిందీ రీమేక్ జాన్వీకపూర్ హీరోయిన్ గా రూపొందనుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: