బిగ్ బాస్ 4 – సైలెంట్ గా కెప్టెన్ అయిన కుమార్ సాయి

Contestant Kumar Sai Gets Elected As Captain In Bigg Boss 4 Show

బిగ్ బాస్ 4 – ఫైనల్ గా మూడు రోజుల నుండి జరుగుతున్న కెప్టెన్సీ టాస్క్ నిన్న ఎపిసోడ్ తో ముగిసింది. మంగ‌ళ‌వారం కిల్ల‌ర్ కాయిన్స్ అనే టాస్క్ బిగ్ బాస్ ఇవ్వ‌గా దాని కొనసాగింపే నిన్న జరిగింది. ఇందులో నోయల్, అరియానా, దివి, అమ్మా రాజ శేఖర్‌లు ముందే ఔట్ అయ్యారు. సుజాత ద‌గ్గ‌ర స్విచ్ కాయిన్ ఉండ‌డంతో ఆమెను ఔట్ చేయాల‌ని స‌ల‌హాలు ఇచ్చింది అరియానా. ఈ విష‌యంలో నీ ర‌న్నింగ్ కామెంట్రీ అవ‌స‌ర‌మా అంటూ అరియానాపై ఆగ్రహం వ్యక్తం చేసింది. మరో వైపు సోహైల్ అమ్మ రాజశేఖర్ కి సారీ చెప్పడం జరుగుతుంది. మూడో లెవ‌ల్‌లో భాగంగా ఇంటి స‌భ్యులు సామ‌, దాన‌, భేద దండోపాయాల‌తో కాయిన్స్ పెంచుకోవ‌చ్చ‌ని బిగ్ బాస్ చెప్ప‌డంతో కొంత మంది త‌మ కాయిన్స్ ను పంచుకున్నారు. కొంతమంది తమ దగ్గరే పెట్టుకున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక అంత కష్టపడి నైట్ మొత్తం నిద్రపోకుండా కాయిన్స్ కలెక్ట్ చేసినా కూడా సోహైల్, మెహబూబ్ ప్రయత్నం బూడిదలో పోసిన పన్నీరులాగ అయింది. మొత్తంమీద తోటి కంటెస్టెంట్స్ తో కలిసి ఎలాగొలా 10 వేలకు పైగా మెహబూబ్ కాయిన్స్ ను కలెక్ట్ చేయగా సుజాత లాస్ట్ లో స్విచ్ కాయిన్ అనే పవర్ ను ఉపయోగించుకొని మెహబూబ్ కాయిన్స్ మొత్తం తీసుకుంది. దీనితో ఫైనల్ కెప్టెన్ పోటీ దారులుగా అమ్మ రాజ‌శేఖ‌ర్, కుమార్ సాయి, హారిక‌, సుజాత ఎంపికయ్యారు.

ఇక ఫైనల్ గా బిగ్ బాస్ వీరికిచ్చిన టాస్క్ కాసుల వేట. ఈ టాస్క్ లో బుర‌ద‌లో కాయిన్స్ ని ఉంచగా, వాటిని ఈ న‌లుగురు పోటీ దారులు తీసి వారికి సంబంధించిన బుట్ట‌లో వేయాల‌ని అన్నారు. చివ‌రికి ఎవ‌రి బుట్ట‌లో ఎక్కువ కాయిన్స్ ఉంటే వారే కెప్టెన్‌గా ఉంటారు అని బిగ్ బాస్ చెప్పారు. ఇక ఈ టాస్క్ లో చివ‌ర‌కు హారిక 2000 కాయిన్స్.. అమ్మా రాజ‌శేఖ‌ర్ 2300, సుజాత 2900, కుమార్‌కి 3500 కాయిన్స్ రావడంతో ఈవారం కెప్టెన్‌గా కుమార్ సాయి నిలిచాడు.

ఇక కెప్టెన్సీ టాస్క్ ముగియడంతో అందరూ నార్మల్ మోడ్ లోకి వచ్చేసారు. ఎవరికి వాళ్ళు గ్రూప్ డిస్కషన్స్ లో మునిగిపోయారు. అభిజిత్‌.. హారిక‌, దివిల‌తో ట్రయాంగిల్ లవ్ గురించి మాట్లాడుకున్నారు. ఇలాంటి యాంగిల్స్ నా కొద్దు అని చెప్పేసాడు. మరోవైపు అఖిల్ సోఫాలో దుప్ప‌టి క‌ప్పుకొని ప‌డుకోగా, కింద కూర్చొని ఉన్న మోనాల్ సోఫాలో త‌ల‌పెట్టి వాళ్ళు వేరే డిస్కషన్ లో ఉన్నారు.

ఇక ఈ రోజు శుక్రవారం పెద్దగా ఏం టాస్క్ లు ఉండకపోవచ్చు. ఈ రోజు కూడా కూల్ గానే వెళ్లిపోయే అవకాశాలు ఉన్నాయి. మరి ఈ వరం ఎలిమినేషన్ లో ఉన్న వాళ్ళల్లో ఎవరి ఇంటికి వెళ్తారో తెలియాలంటే మాత్రం రెండు రోజులు ఆగాల్సిందే.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.