ప్లాంట్ లేడీ సమంత

Samantha Akkineni Calls Herself A Plant Lady In Her Latest Pic Shared On Social Media

స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న సమంత సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ ఫొటోస్ , వీడియోస్  షేర్ చేస్తూ తన జీవిత విశేషాలను అభిమానులతో పంచుకుంటున్నారు. సమంత ఫస్ట్ టైమ్ నెగటివ్ రోల్ లో నటించిన “ది ఫ్యామిలీ మెన్ సీజన్ 2 ” వెబ్ సిరీస్ త్వరలో ప్రసారం కానుంది. సక్సెస్ ఫుల్ “గేమ్ ఓవర్ “మూవీ ఫేమ్ అశ్విన్ శరవణన్ దర్శకత్వంలో తెలుగు , తమిళ భాషలలో హారర్ నేపథ్యంలో రూపొందనున్న మూవీ కి సమంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ మూవీ లో సమంత మూగ యువతిగా నటిస్తున్నారనీ , సైన్ లాంగ్వేజ్ లో ట్రైనింగ్ కూడా తీసుకున్నారనీ సమాచారం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇన్ స్టా గ్రామ్ లో 12.5 మిలియన్ ఫాలోవర్స్ తో సమంత సోషల్ మీడియా లో దూసుకుపోతున్నారు. గార్డెనింగ్ పై ఆసక్తి తో తన ఇంటి టెర్రస్ పై సేంద్రియ పద్ధతి లో పంటలు పండిస్తూ సమంత వాటి ఫొటోస్ ను సోషల్ మీడియా లో షేర్ చేస్తూ అభిమానులను ఇన్ స్పైర్ చేస్తున్న విషయం తెలిసిందే. అభిమానులు , ఫ్రెండ్స్ గార్డెనింగ్ ప్రారంభించి స్వంతంగా పంటలు పండించవల్సిందిగా కోరుతూ సమంత #గ్రో విత్ మీ ఛాలెంజ్ కూడా ప్రారంభించారు. సమంత ఇప్పుడు గార్డెన్ లో ఉన్న తన ఫొటో ను “ప్లాంట్ లేడీ ” అంటూ ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసి అభిమానులను ఆకట్టుకున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × one =