ట్యాగ్ · 4140 కథనాలు · పేజీ 40

"తలైవి " న్యూ లుక్
'క్రాక్' మేకింగ్ వీడియో
మహేష్ బాబు ఎమోషనల్ ట్వీట్
కొత్త సినిమా సెట్లో అడుగుపెట్టిన 'నాగ శౌర్య'

"మహా సముద్రం " మూవీ లో అదితిరావు హైదరి
కన్ఫామ్ 'మహా సముద్రం'లో అదితి
సాగర కన్య రాశీఖన్నా

రజనీకాంత్ "అన్నాత్తే " మూవీ అప్ డేట్
రాజమౌళి సక్సెస్ ఫుల్ సినీ జర్నీ
రాజమౌళి పై 'RRR' టీమ్ ఫిర్యాదులు
జక్కన్నకు 'RRR' టీమ్ బర్త్ డే విషెస్

"గుడ్ నైట్" - రష్మిక
నభా నటేష్ చిత్ర కళా నైపుణ్యం

'ఈవారం' ఇంట్రెస్టింగ్ టాలీవుడ్ అప్ డేట్స్
మా పిల్లలు ఒలంపిక్స్‌కు రెడీ అంటున్న నమ్రత
సిక్స్ ప్యాక్ తో విజయ్ దేవరకొండ ?
"అర్జున్ రెడ్డి ", "గీత గోవిందం " వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకుని విజయ్ దేవరకొండ టాలీవుడ్ లో సెన్సేషనల్ హీరోగా రాణిస్తున్నారు. క్రేజీ హీరో విజయ్ ప్రస్తుతం పాన్ ఇండియా మూవీ "ఫైటర్" లో నటిస్తున్న విషయం తెలిసిందే. యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ మూవీ లో క్యారెక్టర్ కై విజయ్ థాయ్ ల్యాండ్ లో మార్షల్ ఆర్ట్స్ లో ట్రైనింగ్ తీసుకున్నారు. కరోనా కారణంగా నిలిచిపోయిన "ఫైటర్ " మూవీ షూటింగ్ త్వరలో హైదరాబాద్ లో పునః ప్రారంభం కానుంది.

"తలైవి " న్యూ లుక్
లెజెండరీ యాక్ట్రెస్ , పొలిటికల్ లీడర్ , తమిళనాడు దివంగత ముఖ్య మంత్రి జయలలిత జీవిత చరిత్ర ఆధారంగా ఎ ఎల్ విజయ్ దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో తమిళ , తెలుగు , హిందీ భాషలలో "తలైవి " మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. అరవింద్ స్వామి , ప్రకాష్ రాజ్ , భాగ్యశ్రీ , పూర్ణ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. జివి ప్రకాష్ కుమార్ , రచిత అరోరా సంగీతం అందిస్తున్నారు.
'క్రాక్' మేకింగ్ వీడియో
గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రవితేజ హీరోగా క్రాక్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. యదార్ధ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్ర షూటింగ్ లాక్ డౌన్ ముందే ముగింపు దశకు వచ్చింది. కేవలం 10-15 రోజుల షూటింగ్ మాత్రమే మిగిలిఉండగా.. ఇక ఇప్పుడు షూటింగ్స్ మొదలవుతున్న నేపథ్యంలో క్రాక్ టీం కూడా ఆఖరి షెడ్యూల్ ను మొదలుపెట్టేసింది. హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్‌సిటీలో చివరి షెడ్యూల్ ప్రారంభమైంది. ఈ షెడ్యూల్ తో సినిమా షూటింగ్ మొత్తం పూర్తవుతుంది.
మహేష్ బాబు ఎమోషనల్ ట్వీట్
సక్సెస్ ఫుల్ చిత్ర హీరోగా టాలీవుడ్ లో రాణిస్తూ మహేష్ బాబు పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్నారు. తన కుటుంబ సభ్యులకు మహేష్ బాబు అధిక ప్రాధాన్యత ఇస్తున్న విషయం తెలిసిందే. సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ సందర్భాలను బట్టి ట్వీట్స్ చేస్తున్నారు. అంతర్జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా తన డాటర్ (సితార ) ను ఉద్దేశించి మహేష్ బాబు ఒక ఎమోషనల్ ట్వీట్ చేశారు. సితార చిన్న వయసు నుండే తన టాలెంట్ ను ప్రదర్శిస్తున్న విషయం తెలిసిందే.
కొత్త సినిమా సెట్లో అడుగుపెట్టిన 'నాగ శౌర్య'
కరోనా వల్ల ఇన్ని రోజులు షూటింగ్స్ లేక బోసి పోయిన సినీ పరిశ్రమకు ఇప్పుడు మంచి రోజులు వచ్చాయి. రాజమౌళినే షూటింగ్ మొదలు పెట్టాడంటే దాదాపు అందరూ మొదలు పెట్టేసినట్టే. ఇప్పటికే చాలా మంది మెదలుపెట్టగా.. ఎలా లేదనుకున్నా ఈ నెలాఖరుకల్లా అందరూ మొదలు పెట్టేస్తారు.

"మహా సముద్రం " మూవీ లో అదితిరావు హైదరి
సూపర్ హిట్ "RX 100 "మూవీ ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో ఎ కె ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై శర్వానంద్ హీరోగా యాక్షన్ థ్రిల్లర్ "మహా సముద్రం " రూపొందుతున్న విషయం తెలిసిందే. హీరో సిద్దార్ద్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. వైజాగ్ బ్యాక్ డ్రాప్ లో తెలుగు , తమిళ భాషలలో రూపొందనున్న ఎమోషనల్ ఎంటర్ టైనర్ "మహా సముద్రం " మూవీలో హీరోయిన్ ను చిత్ర యూనిట్ ఎంపిక చేసింది.
కన్ఫామ్ 'మహా సముద్రం'లో అదితి
అజయ్ భూపతి దర్శకత్వంలో మహాసముద్రం అనే సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.వైజాగ్ నేపథ్యంలో నడిచే క్రైమ్ థ్రిల్లర్ గా ఈ మహాసముద్రం చిత్రం తెరకెక్కనుంది. సినిమాతో గమ్యం, ప్రస్థానం తరువాత మళ్ళీ అలాంటి బలమైన పాత్రలో శర్వా నటించబోతున్నట్టు ఇప్పటికే చిత్రయూనిట్ తెలిపింది.

బిగ్ బాస్ 4- 'గంగవ్వ' ఇంటి కల నెరవేరుస్తానన్న నాగ్
బిగ్ బాస్ 4- ఈ వారం మొత్తం 9మంది నామినేషన్ లో ఉండగా.. ఇద్దరు హౌస్ మేట్స్ ఇంటి నుండి బయటకు వచ్చారు. అయితే సుజాత నామినేషన్ లో ఉండి బయటకు రాగా.. మరో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గంగవ్వ మాత్రం అనారోగ్యం కారణంగా బయటకు రావాల్సి వచ్చింది. నిజానికి బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చిన కొద్దిరోజుల్లోనే గంగవ్వ కాస్త డీలా పడిపోయి బయటకు వెళ్తా అని కన్నీరు పెట్టింది. అయితే అప్పుడు బిగ్ బాస్ సర్ది చెప్పడంతో ఎలాగొలా 4 వారలు నెట్టుకొచ్చేసింది. అయితే ఇప్పుడు అక్కడ వాతావరణానికి ఉండలేక కాస్త అనారోగ్యానికి గురవ్వడంతో.. ఆమె ఆరోగ్యం బాగుండటం లేదని డాక్టర్లు రిపోర్టు ఇవ్వడంతో.. బిగ్‌బాస్ పర్మిషన్ తీసుకున్న నాగార్జున, గంగవ్వను…
సాగర కన్య రాశీఖన్నా
చదువుకునే రోజుల్లో ఐ ఏ ఎస్ ఆఫీసర్ కావాలనేది రాశీఖన్నా ఆశయం. మోడలింగ్ లో కానీ , యాక్టింగ్ లో కానీ ఆసక్తి లేని రాశీఖన్నా అనుకోకుండా కొన్ని యాడ్స్ లో నటించి బ్లాక్ బస్టర్ బాలీవుడ్ మూవీ "మద్రాస్ కేఫ్ " తో సినీకెరీర్ ప్రారంభించారు. సక్సెస్ ఫుల్ మూవీ "ఊహలు గుస గుస లాడే " తో టాలీవుడ్ కు పరిచయం అయిన రాశీఖన్నా పలుసూపర్ హిట్ మూవీస్ లో తన అందం , అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. సూపర్ హిట్ "ఇమైక్క నోడిగళ్ "(2018 ) మూవీ తో కోలీవుడ్ లో అడుగుపెట్టి రాశీఖన్నా తమిళ మూవీస్ తో బిజీగా మారారు. రాశీఖన్నా ప్రస్తుతం రెండు తమిళ మూవీస్ లో నటిస్తున్నారు. ఒక వెబ్ సిరీస్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

రజనీకాంత్ "అన్నాత్తే " మూవీ అప్ డేట్
సన్ పిక్చర్స్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు శివ దర్శకత్వంలో తమిళ సూపర్ స్టార్ , తలైవా రజనీకాంత్ హీరోగా యాక్షన్ ఎంటర్ టైనర్ "అన్నాత్తే " తమిళ మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. లేడీ సూపర్ స్టార్ నయనతార , "మహానటి "కీర్తి సురేష్ కథానాయికలు. సీనియర్ హీరోయిన్స్ మీనా , ఖుష్బూ , జాకీ ష్రాఫ్ , ప్రకాష్ రాజ్ , సూరి ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. డి. ఇమ్మాన్ సంగీతం అందిస్తున్నారు.
రాజమౌళి సక్సెస్ ఫుల్ సినీ జర్నీ
అపజయం ఎరుగని దర్శక ధీర రాజమౌళి బర్త్ డే ఈ రోజు . రాజమౌళి ఈ రోజు తో 47 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుని 48 వ సంవత్సరంలో అడుగుపెడుతున్నారు. దర్శకుడు రాజమౌళి కి సినీ ప్రముఖుల బర్త్ డే శుభాకాంక్షలు సోషల్ మీడియా లో వెల్లువెత్తాయి. ఇప్పుడు దర్శకుడు రాజమౌళి సక్సెస్ ఫుల్ సినీ జర్నీ గురించి తెలుసుకుందాం. సూపర్ హిట్ "స్టూడెంట్ నెం 1 " మూవీ తో టాలీవుడ్ కు డైరెక్టర్ గా పరిచయం అయిన రాజమౌళి బ్లాక్ బస్టర్ "సింహాద్రి మూవీ తో భారీ విజయాన్ని సాధించారు. సూపర్ హిట్ "సై " మూవీ తో రాజమౌళి హ్యాట్రిక్ సాధించారు.
రాజమౌళి పై 'RRR' టీమ్ ఫిర్యాదులు
ఒక్కో సినిమాను రాజమౌళి ఎంత జాగ్రత్తగా తీర్చిదిద్దుతాడో అందరికీ తెలుసు. ఒక శిల్పాన్ని ఎంతో జాగ్రత్తగా ఎలా చెక్కుతారో అలా చెక్కుతాడు కాబట్టే ఆయనకు జక్కన్న అన్న పేరు పెట్టారు. అలా ఉంటాడు కాబట్టే మన తెలుగు సినిమాకు అంతర్జాతీయ స్థాయిలో పేరు రావడానికి కారణమయ్యాడు. దేశం గర్వించదగ్గ దర్శకుడు అయ్యాడు. ఇక ఈ రోజు రాజమౌళి పుట్టిన రోజు నేపథ్యంలో ఆయనకు సినీ ప్రముఖుల నుండి పుట్టిన రోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అయితే విచిత్రం ఆర్ఆర్ఆర్ టీం మాత్రం ఆయనపై ఫిర్యాదులు చేస్తున్నారు. సీరియస్ గా ఏం కాదులెండి కామెడీగా. సెట్స్ లో రాజమౌళి బర్త్‌డే సందర్భంగా ఆర్ఆర్ఆర్ టీం సభ్యులు ఆయన సెట్లో ఎలా ఉంటారనే…
జక్కన్నకు 'RRR' టీమ్ బర్త్ డే విషెస్
`బాహుబలి`సినిమాతో తెలుగు సినీ పరిశ్రమ సత్తాను ప్రపంచానికి పరిచయం చేసిన దర్శకదిగ్గజం రాజమౌళి. ఇక ఈరోజు రాజమౌళి పుట్టిన రోజు. ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా ఆయనకు విషెస్ తెలియజేశారు. ఆర్ఆర్ఆర్ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషిస్తున్న నటీనటులు కూడా జక్కన్నకు సోషల్ మీడియా ద్వారా స్పెషల్ విషెస్ అందించారు.
గుణశేఖర్ 'శాకుంతలం'.. 'హిరణ్యకశ్యప' కంటే ముందే
మొదటినుండి గుణశేఖర్ విభన్నమైన సినిమాలు చేస్తూవుండటం చూస్తున్నాం. మనోహరం, ఒక్కడు, రుద్రమదేవి వంటి చిత్రాలే ఇందుకు ఉదాహరణ. ప్రస్తుతం `హిరణ్యకశ్యప`సినిమా పనుల్లో బిజీగా వున్నారు. ఈ సినిమా కూడా భారీ బడ్జెట్ సినిమానే. రానా ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాను ఓ హాలీవుడ్ సంస్థతో కలిసి సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తుంది. ఈ చిత్ర ప్రీప్రొడక్షన్ వర్క్ పూర్తయింది. అయితే, సినిమా చిత్రీకరణ ప్రారంభం కావడానికి మరింత సమయం పట్టడంతో ఈ గ్యాప్ లో మరో సినిమాను లైన్ లో పెట్టాడు గుణశేఖర్. మరో పాన్-ఇండియా సినిమా ‘శాకుంతలం’ చేయాలని గుణశేఖర్ నిర్ణయించుకున్నారు.

"గుడ్ నైట్" - రష్మిక
అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుని సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా రాణిస్తున్న రష్మిక ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ "పుష్ప "మూవీ లో కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే. త్వరలోనే "పుష్ప " మూవీ పునః ప్రారంభం కానుంది. తమిళ భాషలో "సుల్తాన్ " మూవీ షూటింగ్ ను రష్మిక కంప్లీట్ చేశారు. "సుల్తాన్ " మూవీ తో రష్మిక కోలీవుడ్ కు పరిచయం అవుతున్నారు.
నభా నటేష్ చిత్ర కళా నైపుణ్యం
"నన్ను దోచుకుందువటే "మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన నభా నటేష్ తన అందం , అభినయం తో ప్రేక్షకుల హృదయాలు దోచుకున్నారు. బ్లాక్ బస్టర్ "ఇస్మార్ట్ శంకర్ "మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి నభా నటేష్ ప్రేక్షకుల ప్రశంసలతో పాటు పలు మూవీ ఆఫర్స్ అందుకున్నారు. సాయి ధరమ్ తేజ్ "సోలో బ్రతుకే సో బెటర్ ", బెల్లంకొండ సాయి శ్రీనివాస్ "అల్లుడు అదుర్స్ " మూవీస్ లో నభా నటేష్ కథానాయికగా నటిస్తున్నారు. "సోలో బ్రతుకే సో బెటర్ " మూవీ షూటింగ్ కంప్లీట్ అయ్యింది.
బిగ్ బాస్ 4 - 'బిగ్ బాస్' గా మారిన అవినాష్
బిగ్ బాస్ 4 - నామినేషన్, కెప్టెన్సీ టాస్క్ అంటూ లగ్జరీ బడ్జెట్ ఇలా బిజీగా అలానే కష్టపడినా హౌస్ మేట్స్ నిన్న కాస్త రిలాక్స్ అయ్యారు . నిన్న ఎపిసోడ్ మాత్రం కొంచం కూల్ గా వెళ్ళిపోయింది. ఇక మార్నింగ్ మస్తీలో భాగంగా అందరూ తమకు ఎదురైనా కష్టాలు, బాధలు గురించి మాట్లాడరు. దీనిలో భాగంగా అందరూ కాస్త ఎమోషనల్ అయ్యారు. ఆ తర్వాత లగ్జరీ బడ్జెట్ టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. లగ్జరీ బడ్జెట్ టాస్క్‌లో ఎవరు ఎక్కువ కార్డ్స్ పొందితే వారికి ప్రత్యేకమైన గిఫ్ట్‌తో పాటు ఆయిల్‌తో మసాజ్ చేసుకొనే అవకాశం దక్కుతుందని తెలిపారు బిగ్ బాస్. పోటీలో మెహబూబ్, అఖిల్‌లు పాల్గొనగా మెహబూబ్ 12 పాయింట్స్‌తో విజేతగా…

'ఈవారం' ఇంట్రెస్టింగ్ టాలీవుడ్ అప్ డేట్స్
గత వారం రోజుల్లో ఎన్నో సినిమా వార్తలు 'దితెలుగుఫిలింనగర్ .కమ్' ద్వారా మీకు అందించాం. ఈ వారంలో ఎన్నో విశేషాలు చోటు చేసుకున్నాయి. మరి ఆ అప్ డేట్స్ లో మీరేమైనా ముఖ్యమైన అప్ డేట్స్ మరిచిపోయారా? అయితే ఈ వీక్లీ రౌండప్ మీకోసం. ఈవారం వార్తలపై మీరొక లుక్కేయండి.
మా పిల్లలు ఒలంపిక్స్‌కు రెడీ అంటున్న నమ్రత
సూపర్‌స్టార్ మహేష్ బాబు భార్య నమ్రతా శిరోద్కర్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారనే సంగతి తెలిసిందే. మహేష్ గురించి కానీ, పిల్లలు సితార-గౌతమ్ లకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు పలు ఆసక్తికర విషయాలగురించి ఏదో ఒకటి తన సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూనే ఉంటారు. ఇప్పుడు రోజుకో పోస్ట్ అయినా అభిమానులతో పంచుకుంటున్నారు. ఇక ఇప్పుడు తాజాగా ఒక ఇంట్రెస్టింగ్ వీడియో ను పంచుకున్నారు.

ఫుల్ ఫామ్ లో అమెజాన్ ప్రైమ్ - 5 భాషల్లో 9 సినిమాలు
లాక్ డౌన్ వల్ల సినిమాల షూటింగ్స్ ఆగిపోయిన సంగతి తెలిసిందే కదా. ఏదో ఇప్పుడిప్పుడే షూటింగ్ లు మొదలుపెడుతున్నారు. ఇప్పుడిప్పుడే కాస్త ముందుకొచ్చి తక్కువమంది సిబ్బందితో.. జాగ్రత్తలు తీసుకుంటూ షూటింగ్ లు చేయడానికి రెడీ అవుతున్నారు. ఇక సినిమా థియేటర్లలో బొమ్మ పడి ఆరు నెలలు పూర్తి అయ్యింది. కొద్దిరోజుల్లో థియేటర్స్ కూడా ఓపెన్ చేస్తున్నారు. ఇక ఈ కరోనా వల్ల థియేటర్స్ లేక బిజినెస్ లేక సినీ పరిశ్రమకు కొన్ని కోట్లలో నష్టం కలిగిన సంగతి తెలిసిందే. మరో పక్క ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ పుంజుకున్నాయి. మొదట చిన్న సినిమాలు రిలీజ్ అయ్యేవి.. ఇప్పుడు పెద్ద సినిమాలు కూడా ఓటీటీ లో రిలీజ్ అవ్వడానికి సిద్ధపడుతున్నాయి…